Home /News /movies /

BIGG BOSS 5 TELUGU UPDATES 2 CONTESTANTS TESTED POSITIVE SOURCES SAYS AND THEY ARE IN QUARANTINE PK

Bigg Boss 5 Telugu - Covid 19: బిగ్ బాస్ 5 తెలుగులో కరోనా కలకలం.. ఇద్దరు కంటెస్టెంట్స్‌కు పాజిటివ్..?

బిగ్‌బాస్ 5 ( Bigg Boss 5 Telugu)

బిగ్‌బాస్ 5 ( Bigg Boss 5 Telugu)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu) ఇంకా మొదలు కాకముందే వార్తల్లోనే ఉంటుంది. కరోనా (Corona) కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యంగా షో మొదలవుతుంది. గతేడాది కూడా ఇదే జరిగింది. ఈ సారి కూడా సెప్టెంబర్ 5న భారీగానే బిగ్ బాస్ షో మొదలు పెట్టబోతున్నారు.

ఇంకా చదవండి ...
బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu) ఇంకా మొదలు కాకముందే వార్తల్లోనే ఉంటుంది. కరోనా (Corona) కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యంగా షో మొదలవుతుంది. గతేడాది కూడా ఇదే జరిగింది. ఈ సారి కూడా సెప్టెంబర్ 5న భారీగానే బిగ్ బాస్ షో మొదలు పెట్టబోతున్నారు. దీనికోసం ఏర్పాట్లు కూడా అన్నీ బాగానే.. భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ షో కోసం ఎంపికైన కంటెస్టెంట్స్ హైదరాబాద్ ITC హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారని తెలుస్తుంది. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 18 మందిని ఈ సారి సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్‌పై మరో సంచలన వార్త బయటికి వచ్చింది. ఏ కరోనా కారణంగా అయితే అంతా భయపడుతున్నారో.. ఇప్పుడు మరోసారి ఇదే కాటేసిందని వార్తలొస్తున్నాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు కంటెస్టెంట్స్‌కు కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తుంది. ఇది గోప్యంగానే ఉంచుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై వార్తలు బాగానే వస్తున్నాయి. నిజంగానే ఇద్దరు కంటెస్టెంట్స్‌కు కరోనా వచ్చిందా.. వాళ్లెవరు.. మరి వాళ్లు ఇంట్లోకి వస్తారా లేదా అనే అనుమానాలు చాలానే వస్తున్నాయి. దాదాపు నెల రోజుల కిందే బిగ్ బాస్ (Bigg Boss 5 Telugu) కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తైపోయింది.

అందులో చాలా మంది టీవీ సెలబ్రిటీస్‌తో పాటు సినిమా వాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ సారి సోషల్ మీడియా స్టార్స్‌ను ఎక్కువగా నమ్ముకున్నారు నిర్వాహకులు. షణ్ముక్ జస్వంత్ (Shanmukh Jaswanth), సిరి హన్మంతు సహా చాలా మంది సోషల్ మీడియా స్టార్స్ ఈ సారి హౌజ్‌లోకి వస్తున్నారు. అయితే ఇంత మందిలో ఎవరికి కరోనా వచ్చిందనే విషయం మాత్రం అర్థం కావడం లేదు. పైగా ఈ విషయాన్ని బయట కూడా పెట్టరు. షోకు సంబంధించిన ప్రతీ ఒక్కటి కూడా చాలా రహస్యంగా ఉంచుతారు.

Bigg Boss 5 Telugu final contestants list: మార్పుల్లేవు.. మార్చడాల్లేవు.. క్వారంటైన్‌లో ఉన్న బిగ్ బాస్ 5 తెలుగు కంటెస్టెంట్స్ వీళ్లే..!


ఇప్పుడు కూడా ఇదే జరగనుంది. కరోనా భయంతోనే ఇద్దర్ని ఎక్కువగా ఎంపిక చేసారని తెలుస్తుంది. షో మొదలయ్యే నాటికి ఒకరిద్దరికి పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా మిగిలిన వాళ్లతో రీ ప్లేస్ చేయాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు కరోనా వచ్చిన ఆ ఇద్దరు ఎవరో అనేది అంతా ఆరా తీస్తున్నారు. ఒకవేళ కరోనా అనేది ఇంకా ఎక్కువ మందికి సోకితే మాత్రం షోపై కూడా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ 5 తెలుగు మొదలు కానుంది. నాగార్జున వరసగా మూడోసారి హోస్టుగా ఉండబోతున్నాడు. ఈ సారి కంటెస్టెంట్స్ కోసం భారీగానే ఖర్చు చేస్తుంది స్టార్ మా యాజమాన్యం.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 5 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు