BIGG BOSS 5 TELUGU UPDATE 10TH WEEK NO ELIMINATION JESSY TO LEAVE HOUSE FOR HIS HEALTH REASONS NGS
Bigg Boss Telugu 5: బిగ్ బాస్ 5లో టాప్ 5 ఎవరు..? వారికి లైఫ్ ఇచ్చి ఇంటిని వీడిన జెస్సీ
ఇంటిని వీడిన జెస్సీ
Bigg Boss Telugu 5: పదో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వీడెది ఎవరు అంటూ తీవ్ర ఉత్కంఠతో అంతా ఆదివారం కోసం ఎదురుచూశారు. అయితే కాజల్ ఈ వారం హౌస్ ను వీడుతుందని అంతా ఊహించారు. సోషల్ మీడియాలో ఆమెకు తక్కువ ఓట్లు పడినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆమె ఈ వారం లక్కీగా సేవ్ అయ్యింది. అందుకు కారణం జెస్సీ.. జెస్సీ నామినేషన్ లో లేనప్పటికీ హౌస్ ను వీడాల్సి వచ్చింది. అయితే వెళ్తూ వెళ్తూ టాఫ్ 5 లో ఉండేది ఎవరో తాను క్లారిటీ ఇచ్చాడు జెస్సీ.
Bigg Boss 5 Telugu 10th Week Jessie Eliminated: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu) పది వారాలు పూర్తి చేసుకుంది. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. అయితే పదో వారం నామినేషన్ లో అంతా స్ట్రాంగ్ గా ఉండడంతో ఎవరు ఎలిమినేట్ (Eliminate) అవుతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎక్కువ మంది కాజల్ ఎలిమినేట్ అవుతారంటూ ప్రచారం జరిగింది. ఆమెకు చాలా ఓట్లు తక్కువ పడినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె ఎలిమినేట్ అవ్వడం పక్కా అంటూ భావించారు. ఎవరూ ఊహించని విధంగా.. ఎలిమినేషన్ ప్రక్రియలో చివరికి మానస్-కాజల్ మిగిలారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని హౌస్ మీట్స్ టెన్షన్ పడ్డారు. నాగార్జున ట్విస్ట్ ఇస్తూ.. ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని కారణం చెప్పారు. ఎందుకు అన్నదానిపై వెంటనే క్లారిటీ ఇచ్చారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా.. హౌస్ లో జెన్యూస్ పర్సన్ గా.. ఫ్రెండిషిప్ కు వాల్యూ ఇచ్చే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న జెస్సీ (Jessy) ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అతడు నామినేషన్ లో లేకపోయినా.. ఆరోగ్య పరిస్థితుల రీత్యా షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
సీక్రెట్ రూంలో ఉన్నప్పుడు తాను తిరిగి హౌస్ లోకి వస్తానని జెస్సీ భావించాడు. కానీ వైద్య పరీక్షలు చేయించాల్సి ఉందని.. వైద్యుల సూచన మేరకు బయటకు పంపిచేయక తప్పడం లేదని నాగార్జున స్పష్టం చేశారు. దీంతో హౌస్ లో రీ ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన జెస్సీ ఆశలు అడియాశలే అయ్యాయి. బిగ్‌బాస్ హౌస్‌లో తన జర్నీ పూర్తైందని పంపించివేశారు. వెళ్లిపోయేముందు జెస్సీ కంటెస్టెంట్లకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ల్యాండ్‌ఫోన్ ద్వారా ఒక్కొక్కరితో పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్.
ముందుగా జెస్సీ.. సన్నీతో మాట్లాడాడు. అయితే గతంలో సన్నితో నిత్యం గొడవలు ఉండేవి. కానీ ఇటీవల వాళ్లిద్దరు కాస్త క్లోజ్ అయ్యారు. ఈ నేపథ్యంతో సన్ని ఆటను మెచ్చుెకుంటూనే కొన్ని సూచనలు చేశాడు జెస్సీ.. జాగ్రత్తగా ఉండు, టెంపర్ లూజ్ అవకు. ఒక్కడిగా గేమ్ ఆడితే ఇండివిడ్యువల్ హీరో అవుతావు, లేదంటే కమెడియన్ అవుతావు' అని చెబుతూ జెస్సీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
తరువాత మానస్‌తో మాట్లాడాడు. అయితే మానస్ తో మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా ఇద్దరికీ పడడం లేదనే అభిప్రాయం కలిగింది. మానను అందరినీ నెగిటివ్ గా చూడొద్దు అంటూ కామెంట్ చేశాడు. గత వారం మానస్ అనుకున్నట్టు తాను కాజల్ ను ఇన్ ఫ్లెన్స్ చేయలేదని వివరణ ఇచ్చాడు. దీంతో మానస్ సారీ కూడా చెప్పాడు. అంతే కాదు రవికంటే బాబులా మైండ్ గేమ్ ఆడుతున్నావని జెస్సీ అతడిని అన్నాడు. కాజల్ తో మాత్రం.. కాస్త ఘాటుగానే మాట్లాడాడు. మొదటి రెండు వారాల్లో చూసినట్టు కాజల్ లేదన్నాడు. పక్క వాళ్ల గురించి ఆలోచిస్తూ నీ గేమ్ పాడవుతోందని వార్నింగ్ ఇచ్చాడు. అందరూ నిన్న వాడుకుంటున్నారు జాగ్రత్తగా ఉండు అంటూ సూచనలు చేశాడు.
ఆని మాస్టర్ ని కొనియాడాడు. చాలా స్ట్రాంగ్ గేమ్ ఆడుతున్నారంటూ మెచ్చుకున్నాడు. ఆమెకు పెద్దగా సూచనలు చేయలేదు. ఇక ప్రియాంక సింగ్ ను కూడా తీవ్రంగా హెచ్చరించాడు. త్యాగాలు ఆడడానికి హౌస్ కు రాలేదని గుర్తు చేశాడు. వచ్చే సీజన్లలో ప్రియాంక సింగ్ ఆదర్శంగా ఉండాలి అంటూ హితవు పలికాడు.
ఇక శ్రీరామ్ కు మాత్రం అతడి వ్యాఖ్యలు ఫుల్ బూస్ట్ ఇచ్చాడు. శ్రీరామ్ మంచి వ్యక్తి అని.. గేమ్ బాగా ఆడుతున్నాడని.. ఇలా ఆడితే కచ్చితంగా టాప్ 5 ఉంటాడని చెప్పాడు. రవి కూడా జెస్సీ మంచి మార్కులే వేశాడు. ఇద్దరూ టాప్ 5 లో ఉంటాడని జోస్యం చెప్పాడు.
ఇక సిరితో చాలా ఫన్నీగా మాట్లాడాడు. సిరీని ముద్దు పెట్టమని రిక్వెస్ట్ చేశాడు ఆమె కూడా ఫోన్ లోనే ముద్దు ఇచ్చింది. చివర్లో వచ్చేవారమే బయటకు వచ్చేయకు, ఫైనల్ దాకా అక్కడే ఉండమని చెప్పాడు. సిరీ కూడా కచ్చితంగా తన టార్గెట్ టాప్ 5 అంది. ఇక బెస్ట్ ఫ్రెండ్ షణ్ముఖ్‌తో తనకు ఉన్న బాండ్ ఎలాంటిదో జెస్సీ బయట పెట్టాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు. 'హౌస్‌లో ఉన్న చివరి రోజుల్లో సన్నూతో ఉండలేకపోయానన్నదే తన బాధ అన్నాడు జెస్పీ, తాను ఎప్పటికీ సీక్రెట్ ఫ్రెండ్‌నే అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఫస్ట్ వీక్‌లోనే వెళ్లిపోతావని విమర్శలు ఎదుర్కొన్న జెస్సీ పదీ వరకు ఉన్నాడని.. అంతేకాదు తాను ఎలిమినేట్ అవ్వకుండా వెళ్లిపోతూ మరొకరికి లైఫ్ ఇచ్చాడంటూ షన్నూ కొనియాడాడు. దీంతో హౌస్ మేట్స్ అంతా క్లాప్స్ కొట్టారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.