హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 తెలుగు.. కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో ఆ ఇద్ద‌రు ట్రెండింగ్ బ్యూటీలు

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 తెలుగు.. కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో ఆ ఇద్ద‌రు ట్రెండింగ్ బ్యూటీలు

ఈ సీజన్‌లో సునీల్ పూల రంగడు బ్యూటీ ఇషా చావ్లా వైల్డ్ కార్డ్ రూపంలో వస్తుందని ప్రచారం జరుగుతుంది. కానీ అందులో నిజం ఎంతుందో తెలియడం లేదు. ఎందుకంటే ఈ సారి వైల్డ్ కార్డులు ఉండకూడదనే ఉద్ధేశ్యంతోనే 19 మంది ఇంటి సభ్యులను పంపించినట్లు తెలుస్తుంది. అందుకే కొత్తగా ఎవర్నీ ఇంట్లోకి తీసుకొచ్చేలా కనిపించడం లేదు నిర్వాహకులు. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎప్పుడుంటుందో అని ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు.

Bigg Boss 5 Telugu: తెలుగు బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5కు సంబంధించిన ఏర్పాట్లు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాది ఆల‌స్యంగా సీజ‌న్ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. ఈసారి వేస‌వి కాలంలో బిగ్‌బాస్ 5ను ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఇంకా చదవండి ...

  Bigg Boss 5 Telugu: తెలుగు బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5కు సంబంధించిన ఏర్పాట్లు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాది ఆల‌స్యంగా సీజ‌న్ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. ఈసారి వేస‌వి కాలంలో బిగ్‌బాస్ 5ను ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి నుంచే కంటెస్టెంట్‌ల కోసం సంప్ర‌దింపులు ప్రారంభ‌మైన‌ట్లు టాక్. ఈ నేప‌థ్యంలో యాంక‌ర్ ర‌వి, క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వారిద్ద‌రికి మంచి క్రేజ్ ఉండ‌టంతో.. ఈ ఇద్ద‌రినీ ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి తీసుకునేందుకు నిర్వాహ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వీరితో పాటు యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ పేరు కూడా వినిపిస్తోంది.

  ప‌లు షార్ట్ ఫిలింస్‌లు, డ్యాన్స్ వీడియోల‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్న ష‌ణ్ముఖ్‌.. సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ అనే వెబ్ సిరీస్‌తో మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ నేప‌థ్యంలో అత‌డిని ఈ సీజ‌న్‌లో తీసుకునేందుకు నిర్వాహ‌కులు ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా ఇప్పుడు మ‌రో ఇద్ద‌రి పేర్లు బిగ్‌బాస్ 5 సీజ‌న్ కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో వినిపిస్తున్నాయి.

  ట్రెండింగ్ బ్యూటీలు వ‌ర్షిణి, దీపికా పిల్ల‌ల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో నిర్వాహ‌కులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే వ‌ర్షిణి స్టార్ మాలో ఓ షోకు యాంక‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మ‌రోవైపు టిక్‌టాక్ ద్వారా ఫేమ‌స్ అయిన దీపికా పిల్లి ప్ర‌స్తుతం ఢీ షోలో మెంటార్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ ఇద్ద‌రు బ్యూటీలతో హౌజ్‌ను గ్లామర్‌గా చేయొచ్చ‌న్న ఆలోచ‌న‌లో వారు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ సీజ‌న్‌లో ఎవ‌రెవ‌రు కంటెస్టెంట్‌లుగా ఉండ‌బోతున్నారో తెలియాలంటే ఇంకా చాలా రోజులే ఆగాలి. కాగా గ‌త సీజ‌న్‌లో యూట్యూబ‌ర్లు, యాంక‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌టంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ల‌పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇలాంటి నేప‌థ్యంలో మ‌రి ఈసారి కూడా వారినే తీసుకుంటారా..? లేక కాస్త ఫేమ్ ఉన్న వారిని తీసుకుంటారా..? చూడాలి.

  Published by:Manjula S
  First published:

  Tags: Anchor varshini, Bigg Boss 5 Telugu

  ఉత్తమ కథలు