Home /News /movies /

BIGG BOSS 5 TELUGU TODAY PROMO RELEASED AND DISPUTES BETWEEN NATARAJ MASTER ANCHOR RAVI PK

Bigg Boss 5 Telugu promo: బిగ్ బాస్ 5 తెలుగు ప్రోమో వచ్చేసింది.. యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ మధ్య గొడవ..

బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా నాగార్జున (Twiter/Photo)

బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా నాగార్జున (Twiter/Photo)

Bigg Boss 5 Telugu promo: బిగ్ బాస్ హంగామా (Bigg Boss 5 Telugu promo) మళ్లీ మొదలైపోయింది. ముందు ముందు ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో ఇప్పుడు విడుదలైన ప్రోమో చూస్తుంటేనే అర్థమైపోతుంది. కనీసం ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండానే ఇంట్లో మనస్పర్థలు మొదలైపోయాయి.

ఇంకా చదవండి ...
బిగ్ బాస్ హంగామా మళ్లీ మొదలైపోయింది. ముందు ముందు ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో ఇప్పుడు విడుదలైన ప్రోమో చూస్తుంటేనే అర్థమైపోతుంది. కనీసం ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండానే ఇంట్లో మనస్పర్థలు మొదలైపోయాయి. గతంలో బిగ్ బాస్ షో మొదలైనపుడు కచ్చితంగా ఓ వారం రోజులైనా అంతా బాగుండేవాళ్లు. కానీ నాలుగో సీజన్ నుంచి సీన్ అంతా మారిపోయింది. తొలిరోజు నుంచే గొడవలు పడటం అనేది అలవాటుగా మార్చుకున్నారు. గొడవ పడితే కానీ ఫేమస్ అవ్వలేమని.. మాటలు అనుకుంటే తప్ప ప్రోమోలో పడలేమని కొందరు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే వచ్చీ రాగానే గొడవలు పడటం మొదలుపెట్టారు. ఈ సారి ఇంట్లోకి బాగా అగ్రెసివ్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌ను పంపించారు. వాళ్లు వెళ్లిన పని వెంటనే మొదలు పెట్టారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇదే స్పష్టం అవుతుంది. ముఖ్యంగా యాంకర్ రవితో లోబో మాట మాట తగువు పెంచేసాడు.

అలాగే నటరాజ్ మాస్టర్‌, యాంకర్ రవి మధ్య కూడా గొడవ జరిగింది. ఇక మోడల్ జస్వంత్‌ను బాగానే టార్గెట్ చేసారు మిగిలిన ఇంటి సభ్యులు. మరోవైపు విజే సన్నీ అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా జస్వంత్ బొమ్మను విసిరి కొట్టాడు. అంతేకాదు షణ్ణుతో కూడా గొడవ పడుతున్నారు ఇంటి సభ్యులు. మొత్తానికి ఈ సారి కంటెస్టెంట్స్‌ను చూస్తుంటే గొడవలు పడితేనే జనాల్లో ఉంటామని ముందుగానే ఫిక్స్ అయిపోయి వచ్చినట్లున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 5 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు