హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 5 Telugu: త్వరలో మొదలు కానున్న బిగ్‌బాస్ సీజన్ 5.. జబర్ధస్త్ కమెడియన్స్ సహా ఎవరెవరున్నారంటే.. ..

Bigg Boss 5 Telugu: త్వరలో మొదలు కానున్న బిగ్‌బాస్ సీజన్ 5.. జబర్ధస్త్ కమెడియన్స్ సహా ఎవరెవరున్నారంటే.. ..

సీజన్ 5 కోసం నాగార్జున కాకుండా రానా హోస్ట్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నా కూడా ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు మా యాజమాన్యం. దాంతో మరోసారి నాగ్ హోస్ట్ చేస్తాడనే నమ్ముతున్నారు అభిమానులు. పైగా కంటెస్టెంట్స్ ఎంపిక కూడా గత సీజన్ మాదిరే జూమ్ యాప్‌లో ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎంపిక చేసిన వాళ్లను రెండు వారాలు క్వారంటైన్‌లో ఉంచి ఆ తర్వాత ఇంటి లోపలికి పంపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

సీజన్ 5 కోసం నాగార్జున కాకుండా రానా హోస్ట్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నా కూడా ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు మా యాజమాన్యం. దాంతో మరోసారి నాగ్ హోస్ట్ చేస్తాడనే నమ్ముతున్నారు అభిమానులు. పైగా కంటెస్టెంట్స్ ఎంపిక కూడా గత సీజన్ మాదిరే జూమ్ యాప్‌లో ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎంపిక చేసిన వాళ్లను రెండు వారాలు క్వారంటైన్‌లో ఉంచి ఆ తర్వాత ఇంటి లోపలికి పంపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

Bigg Boss 5: ‌ తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 5కు అంతా సిద్ధమైందా అంటూ ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇందులో జబర్ధస్త్ కమెడియన్స్‌తో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్లను కంటెస్టెంట్స్‌గా తీసుకోబోతున్నట్టు సమాచారం.

Bigg Boss 5: ‌ తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 5కు అంతా సిద్ధమైందా అంటూ ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అంతేకాదు త్వరలో బిగ్‌బాస్ సీజన్ 5 టెలికాస్ట్‌కు ముహూర్తానికి కూడా టైమ్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా నాగార్జునకు బదులు రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు తెలుగులో బిగ్‌బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది.  బిగ్‌బాస్ సీజన్ నాల్గో సీజన్‌లో అభిజిత్ వితేతగా నిలిచి ప్రైజ్ మని గెలుచుకున్నారు. ఇక బిగ్‌బాస్ విషయానికొస్తే..  తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు  మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు.

ఇపుడు ఐదో సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయలేనని స్టార్ మా వాళ్లకు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు సీజన్ 5ను రానాతో హోస్ట్ చేయిస్తే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారట. ఇప్పటికే స్టార్ మా వాళ్లు రానాతో సంప్రదింపులు జరుపుతున్నారు. రానా డేట్స్ బట్టి బిగ్‌బాస్ సీజన్ 5ను ప్లాన్ చేస్తున్నారట. ఇక రానా దగ్గుబాటికి బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా భారీగానే ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం.

బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా రానా దగ్గుబాటి (Twitter/Photo)

తాజాగా ఐదో సీజన్‌కు కోసం ఇప్పటి నుంచే స్టార్ మా వాళ్లు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జూమ్, గుగుల్ మీట్ ద్వారా బిగ్‌బాస్‌ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసేవాళ్లను ఇంటర్వ్యూలు కూడా చేసినట్టు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసేవారు కోవిడ్ వాక్సినేషన్ రెండు పూర్తి చేసుకుంటే కానీ హౌస్‌లోకి ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. గత నాల్గో సీజన్‌లాగే ఐదో సీజన్‌ను ఆగష్టు చివరి వారంలో మొదలు పెట్టేందుకు అంతా సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

దుర్గారావు (File Image)

ఈ సీజన్‌లో కొత్తవాళ్లను కాకుండా అందరికీ తెలిసివాళ్లను బిగ్‌బాస్ సీజన్ 1లో ఎలాగైతే.. చాలా మంది సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేసినట్టే.. ఇపుడు సీజన్ 5 కోసం కొత్త మొఖాలు కాకుండా పాపులర్ ఫిగర్స్‌ను రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. అందులో భాగంగా టిక్ టాక్ దుర్గారావు, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ (సత్యవతి), టిక్ టాక్ స్టార్ భాను, యాంకర్ ప్రత్యూష, శేఖర్ మాస్టర్, యాంకర్ శివ, కమెడియన్ ప్రవీణ్,యాంకర్ వర్షిణి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ వంటి వాళ్లు బిగ్‌బాస్ సీజన్‌ 5లో పార్టిసిపేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు బిగ్‌బాస్ సీజన్ 5లో ఎక్కువగా కాంట్రవర్సీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

First published:

Tags: Bigg Boss 5 Telugu, Hyper Aadi, Jabardasth comedy show, Nagarjuna Akkineni, Rana daggubati, Tik Tok Star Durga Rao, Tollywood

ఉత్తమ కథలు