Bigg Boss 5 Telugu Swetha Varma: బిగ్ బాస్ అనే రియాలిటీ షో పేరు వింటే మాత్రం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ షోలో పాల్గొనే సెలబ్రెటీలు తమ నిజ జీవితంలో ఎలా ఉంటారో అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉంటూ తమ పరిచయాలు పెంచుకుంటారు. ప్రతి ఒక్క సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు ప్రేక్షకులు. ఇక మొత్తానికి ఈ షో ప్రపంచ పరంగా బెస్ట్ షో గా నిలిచింది.
ఇక తెలుగులో నాలుగు సీజన్ లను పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఐదవ సీజన్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. ఇక షో ప్రారంభమై వారం రోజులు కాగా ఫస్ట్ ఎలిమినేట్ గా సరయు ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయింది. ఇక సెకండ్ ఎలిమినేషన్ రౌండ్ కూడా నిన్నటి ఎపిసోడ్ లో పూర్తవగా.. నిన్న ఎలిమినేషన్ రౌండు మాత్రం ఓ రేంజ్ లో సాగింది.
ఇది కూడా చదవండి:ఇది తెలుగు షోనా.. అరెరే మరి షోలోకి ఇంగ్లీష్ వాళ్ళని తెచ్చావ్ ఏంటి బాసు?
బిగ్ బాస్ కంటెస్టెంట్ లందర్నీ రెండు భాగాలుగా విభజించి వారితో ఎలిమినేషన్ రౌండ్ ను పూర్తి చేశాడు. అందులో రెండు టీమ్ ల మధ్య ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమకు నచ్చని కంటెస్టెంట్ లను ఎలిమినేట్ చేశారు. ఇక ఎలిమినేట్ సమయంలో కంటెస్టెంట్ ల మధ్య ఓ రేంజ్ లో పోరు జరిగింది. ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. ప్రతి ఒక్కరూ తోటి కంటెస్టెంట్స్ తో బాగా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఉమాదేవి, శ్వేతా వర్మ తమ బూతు మాటలతో బాగా రెచ్చిపోయారు. ఇక శ్వేతా వర్మ మాత్రం బాగా ఫైర్ అయ్యింది. లోబో, హామీద లను ఎలిమినేట్ చేసింది. ఇప్పుడిప్పుడే అసలు రంగు బయట పడుతున్నాయి అంటూ వీరిద్దరి ఫేక్ అంటూ మధ్య మధ్యలో అందరూ ల* పనులే చేస్తున్నారు అంటూ ఇంగ్లీష్ లో అరిచింది. ఇక ఉమాదేవి.. యానీ మాస్టర్ పై విరుచుకుపడ్డ విధానాన్ని చూసి తట్టుకోలేకపోతూ.. ఉమాదేవి పై బాగా అరిచింది.
ఇది కూడా చదవండి:నువ్వు ఎదగాలని అందరిని తొక్కేయకు.. లహరికి ఇచ్చి పడేసిన సరయు!
మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అంటూ.. హ్యుమానిటీ టు హ్యుమానిటీ.. ఉమెన్ టు ఉమెన్ అంటూ అందరూ ఆడవాళ్లే అంటూ కాస్త రెస్పెక్ట్ గా మాట్లాడాలి అంటూ యానీ మాస్టర్ ని అలా ఎలా అనిపివ్వాలనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక తనకు ఫేక్ జనాలు దూరంగా ఉండాలని.. తన గేమ్ ఏంటో తను ఇండివిడ్యువల్ గానే ఆడుతున్నాను అంటూ తను ఎలిమినేట్ చేసిన లోబో, హమీదలపై పెయింట్ ను ఆవేశంగా పూయడంతో అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ఆవేశంలో అలా చేశాను అంటూ మళ్లీ వారికి క్షమాపణలు తెలుపుకుంది శ్వేతా వర్మ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.