Shanmukh Jaswanth: అరేయ్ ఏంట్రా ఇది.. షణ్ముక్ చేసిన పనితో షాక్ అయిపోయిన సిరి, జెస్సీ..

BIgg Boss 5 Telugu Shanmukh Jaswanth

Bigg Boss 5 Telugu: ఎవరు అవునన్నా కాదన్నా ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో గ్రూపులు బాగానే ఉన్నాయి. అక్కడ ఎవరూ వ్యక్తిగతంగా ఆడడం లేదు. సొంతంగా ఆడాలని బిగ్ బాస్ పదే పదే చెప్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది.

  • Share this:
ఎవరు అవునన్నా కాదన్నా ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో గ్రూపులు బాగానే ఉన్నాయి. అక్కడ ఎవరూ వ్యక్తిగతంగా ఆడడం లేదు. సొంతంగా ఆడాలని బిగ్ బాస్ పదే పదే చెప్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రియాంక సింగ్ తన ఆట ఆడడం ఎప్పుడో మానేసింది. పూర్తిగా మానస్ కోసం మనసు పెట్టి ఆడుతుంది. ఇక ప్రతి టాస్క్‌లో సన్నీ, మానస్, కాజల్ కలిసి ఆడుతున్నారు. త్రిమూర్తులు షణ్ముక్, జెస్సి, సిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి ఒక్కరు గ్రూపులు కట్టి ఆడుతున్నారు. ఈ వారం కూడా ఇదే జరిగింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా వ్యక్తిగతంగా ఆడాలని పెద్దాయన చెప్పినా కూడా పట్టించుకోకుండా ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారు. ఇప్పుడు కెప్టెన్సీ టాస్కులో కూడా ఇదే జరిగింది. సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్ చివరి వరకు వచ్చినపుడు గ్రూపులుగా ఆడారు. దాంతో కోపంతో ఊగిపోయిన అనీ.. మధ్యలోనే బయటికి వచ్చేసింది.

కోపంతో బయటికి వచ్చేయడమే కాకుండా.. ఇక్కడ ఎవరు సొంతంగా ఆడటం లేదు అంటూ ఇంటి సభ్యులపై చిందులు తొక్కింది. చివరికి ఈ వారం కెప్టెన్‌గా షణ్ముఖ్ జస్వంత్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో తొలిసారి కెప్టెన్సీ టాస్క్‌లో కంటెండర్‌గా ఎంపికయ్యాడు షణ్ముఖ్. కెప్టెన్‌గానూ గెలిచాడు. అయితే ఆయన గెలిచిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఇంటి సభ్యులను ఆశ్చర్యపరిచాయి. షణ్ముఖ్ జస్వంత్ కెప్టెన్ అయిన తర్వాత రేషన్ మేనేజర్‌గా ఎవరూ ఊహించని విధంగా ఆనీ మాస్టర్‌ను ఎంపిక చేసుకున్నాడు.

Heroines who married Directors: ప్రేమకు వేళాయెరా.. దర్శకులను పెళ్లి చేసుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్ళే..


కచ్చితంగా సిరి, జెస్సిలలో ఎవరో ఒకరు రేషన్ మేనేజర్ అవుతారు అనుకుంటే కిచెన్‌లో ఎక్కువ అనుభవం ఉందని అనిని సెలెక్ట్ చేసుకున్నాడు షణ్ముక్. ఈయన చేసిన పనితో సిరి బాగా హర్ట్ అయింది. తనను కాకుండా మరొకరిని రేషన్ మేనేజర్‌గా తీసుకోవడంపై సిరి అలిగినట్లు తెలుస్తుంది. అయితే తన గేమ్ తాను ఆడుతున్న షణ్ణు.. ఈ విషయంలో మాత్రం సిరిని అస్సలు కన్సిడర్ కూడా చేయలేదని ప్రచారం జరుగుతుంది. పూర్తిగా ఇది సొంత ఆట అని.. తన నిర్ణయాలు తాను తీసుకుంటానని చెప్తున్నాడు షణ్ముఖ్ జస్వంత్. మరి కెప్టెన్‌గా తన సత్తా ఎంతవరకు చూపిస్తాడో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: