Bigg Boss 5 Telugu Shanmuk Jaswanth: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమై వారం రోజులు మాత్రమే పూర్తికాగా.. ఏ సీజన్ కూడా చేయని హైలెట్ ఈ సీజన్ మాత్రమే కేవలం వారం రోజుల్లోనే చేస్తుంది. మొత్తం ఇందులో 19 మంది కంటెస్టెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఎలిమినేట్ లో బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అవ్వగా నిన్నటి ఎపిసోడ్ లో రెండో నామినేషన్ కూడా పూర్తి చేశాడు బిగ్ బాస్. ఇక రెండో నామినేషన్ గురించి మాటల్లో చెప్పలేనిది అని చెప్పాలి. ఇదిలా ఉంటే షన్ను అర్థపావు భాగ్యం కు గట్టి షాక్ ఇచ్చాడు.
నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ లందర్నీ రెండు భాగాలుగా విభజించాడు. అందులో ఒక టీమ్ పేరు నక్క మరో టీమ్ పేరు గ్రద్ద గా పెట్టారు. ఇక ఇందులో నక్క టీంలో ఉమా, లహరి, మానస్, జెస్సీ, రవి, సన్నీ, శ్వేత, నటరాజ్, కాజల్ ఉండగా.. గ్రద్ద టీమ్ లో లోబో, విశ్వ, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీద, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలు ఉన్నారు. ఇందులో ఒక టీమ్ వాళ్లు మరొక టీమ్ వాళ్లను నామినేట్ చేయాలి.
ఇది కూడా చదవండి:సరయు మాటల వెనుక బిగ్ బాస్ స్క్రిప్ట్.. షన్నుని ఫోకస్ చేసేందుకే ఇదంతా?
దీంతో రెండు టీమ్ ల మధ్య నామినేట్ యుద్ధం జరగగా అందులో కొందరు కంటెస్టెంట్ లు తమ బూతు మాటలతో దారుణమైన కామెంట్లు చేశారు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో వాడని పదాలే వాడేశారు. ఆ మాటలు విన్న తోటి కంటెస్టెంట్ లే కాకుండా ప్రేక్షకులు కూడా బాగా షాక్ అయ్యారు. కార్తీకదీపంలో ఫేమస్ అయిన అర్ధపావు భాగ్యం అలియాస్ ఉమాదేవి మాత్రం ఏకంగా తన మాటలతో అసలు రూపాన్ని బయటపెట్టింది.
ఇది కూడా చదవండి:షణ్ముఖ్ జశ్వంత్ వరస్ట్ అన్న సరయు.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!
ఆమె మాటలు విన్న షణ్ముఖ్ ఓకే సారీ నోరు తెరిచి షాక్ అయ్యాడు. ఎవరికి వాళ్ళు తమకు నచ్చని కంటెస్టెంట్ ల గురించి నెగటివ్ గా చెబుతూ వారిపై ముఖాలపై ఎరుపు రంగును పూసి నామినేట్ చేశారు. ఇక షణ్ముఖ్ వంతు వచ్చేసరికి.. నేరుగా వెళ్లి ఉమాదేవిని నామినేట్ చేశాడు. మీరు కరెక్టే ఏమో కానీ.. హౌస్ కి కరెక్ట్ గా సెట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది అంటూ గట్టి షాక్ ఇచ్చాడు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ.. అంతే కాకుండా అందరి ముందు అలాంటి మాటలు మాట్లాడొద్దని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Telugu, Karthika deepam, Shanmuk jaswanth, Star Maa, Uma devi