Bigg Boss 5 Telugu: టాలీవుడ్ బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికి నాలుగు సీజన్ లను పూర్తి చేసుకుంది. ఇక వారం కిందట సీజన్ 5 ప్రారంభమవ్వగా.. ఇందులో ఈసారి 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఇందులో బిగ్ బాస్ బిగ్ బాంబు మర్చిపోయాడు అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.
నిజానికి ప్రతి సీజన్ కు కొత్త కొత్త మార్పులను చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. ఇక ఈ సీజన్ లో మాత్రం చాలావరకు మార్పులు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా మార్పులు చాలానే ఉండాలి. ఇదంతా పక్కన పెడితే ప్రతి సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వెళ్తున్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబ్ ను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది. అలా గత సీజన్ మొత్తంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లకు బిగ్ బాంబును హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లపై ఇవ్వడం జరిగింది.
ఇది కూడా చదవండి:సరయు దెబ్బకు బెదిరిపోయిన అరియనా.. ఇంటర్వ్యూలో గుట్టు అంత విప్పేసిందిగా
అంటే బిగ్ బాంబు లో తమకు నచ్చని కంటెస్టెంట్ పై ఏదో ఒక శిక్ష ఇవ్వడం లాంటిదే జరుగుతుంది. ఇక ఈ సీజన్ లో కూడా నిన్న బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అవ్వగా తన ఇంట్లో నుండి బయటకు వస్తున్న సమయంలో ఆమె ఏ కంటెస్టెంట్ కూడా బిగ్ బాంబ్ ఇవ్వలేదు. దీంతో ఈ విషయాన్ని పసిగట్టిన నెటిజన్లు బిగ్ బాస్ పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:షణ్ముఖ్ జశ్వంత్ వరస్ట్ అన్న సరయు.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!
ఈ సీజన్ లో బిగ్ బాంబ్ ఇవ్వడం మర్చిపోయారా లేక ఇవ్వడమే మానేశారా అంటూ ప్రశ్నలు ఎదురవడంతో.. బిగ్ బాస్ మీకు ఇంత మతిమరుపు ఉంటే ఎలా అని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఒకవేళ మర్చిపోయి ఉన్నట్లయితే నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కు బిగ్ బాంబ్ ఇస్తారో లేదో చూడాలి. లేదా ఈ సీజన్ లోనే ఈ బిగ్ బాంబ్ వద్దు అనుకుంటున్నారేమో చూడాలి. ఇక సరయు మాత్రం ఎవరికీ శిక్ష ఇచ్చే అవకాశం లేకున్నా కూడా తన మాటలతో మాత్రం అదే పెద్ద శిక్ష అన్నట్లుగా చేసింది. ఇక ప్రస్తుతం సరయు కి సంబంధించిన ఎలిమినేట్ ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Bigg bomg, Bigg Boss 5 Telugu, Sarayu, Star Maa