Bigg Boss 5 Promo: ‘బిగ్ బాస్ 5’ ప్రోమో వచ్చేసింది.. చెప్పండి బోర్‌డమ్‌కు గుడ్ బై అంటున్న నాగార్జున..!

బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu)

Bigg Boss 5 Telugu: చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో వచ్చేసింది. ఐదో సీజన్ కూడా నాగార్జునే (Nagarjuna) హోస్ట్ చేస్తున్నాడు. చాలా రోజులుగా దీనిపై కూడా అనుమానాలు ఉన్నాయి.

  • Share this:
చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో వచ్చేసింది. ఐదో సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు. చాలా రోజులుగా దీనిపై కూడా అనుమానాలు ఉన్నాయి. నాగార్జున కాకుండా రానా దగ్గుబాటి వస్తున్నాడని.. నాగ్ బిజీ కారణంగా తప్పుకున్నాడని జరుగుతున్న ప్రచారానికి కూడా తెర పడింది. చెప్పండి బోర్ డమ్‌కు గుడ్ బై.. వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 5 అంటూ నాగార్జున కొత్త స్టెప్పుతో వచ్చేసాడు. ఒకటిన్నర నిమిషం ఉన్న ప్రోమో చాలా ఆసక్తికరంగా డిజైన్ చేసారు మేకర్స్. గతేడాది కరోనా సమయంలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 4కు మంచి అప్లాజ్ వచ్చింది. రేటింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అన్నింటికంటే ముఖ్యంగా కరోనా సమయంలో వచ్చిన బిగ్ బాస్ 4కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమాలు లేక.. థియేటర్స్ మూతపడిన సందర్భంలో కరోనా సమయంలో వచ్చిన బిగ్ బాస్‌ కోట్లాది మంది ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇచ్చింది. దాదాపు మూడున్నర నెలలు కావాల్సినంత వినోదం పండించింది. కరోనా సమయంలోనూ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి ఔరా అనిపించారు మేకర్స్. ఇప్పుడు ఐదో సీజన్ కూడా అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే తాజాగా సీజన్ 5 ప్రోమో కూడా విడుదలైంది. ఇందులోనూ నాగార్జున అదరగొట్టాడు.

అది చూసి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. ఈ సారి 105 రోజులు కాదు.. నాలుగు నెలలకు పైగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సీజన్ 5 కచ్చితంగా ముందు సీజన్స్ కంటే అదిరిపోతుందని నమ్మకంగా చెప్తున్నారు షో నిర్వాహకులు. ప్రోమోలో కూడా బోర్ డమ్‌కు చెప్పండి గుడ్ బై.. వచ్చేసింది సీజన్ 5 అంటూ ప్రమోషన్ మొదలు పెట్టారు. మరి చూడాలిక.. ప్రోమో స్థాయిలో సీజన్ 5 అదరగొడుతుందో లేదో..?
Published by:Praveen Kumar Vadla
First published: