Bigg Boss 5 : ఏమైతేనేం ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్‌బాస్ ఐదో సీజన్ అంతే అట్టహాసంగా ముగిసింది. గత 15 వారాలుగా తెలుగు టెలివిజన్ తెరపై మెజారిటీ ప్రేక్షకులను మెప్పించిన రియాలిటీ షో బిగ్‌బాస్. గత సీజన్స్‌తో పోలిస్తే కొద్దిగా టీఆర్పీ రేటింగ్స్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఐదో సీజన్లో ముందుగా అంతగా అంచనాలేని సన్ని బిగ్‌బాస్ 5 విజేతగా నిలిచారు. బిగ్ బాస్ హౌజ్‌లో చివరి వరకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు సన్నీ(Sunny). తాజాగా ఈ షోకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. నాలుగు గంటలకు పైగా ప్రసారమైన ఈ షోకు 18.04 టీఆర్పీ రేటింగ్ వచ్చిందని స్టార్ మా నిర్వాహకులు ప్రకటించారు. గత సీజన్‌తో ఉన్నంతలో రేటింగ్ విషయం కాస్త తగ్గింది. గత సీజన్ బిగ్‌బాస్ 4కు 19.51 టీఆర్పీ సాధించింది. మూడో సీజన్లో 18.29 టీఆర్పీ వచ్చింది.
నాని హోస్ట్‌గా వ్యవహరించిన రెండో బిగ్‌బాస్ సీజన్‌కు 15.05 రేటింగ్ దక్కించుకుంది. తొలిసారి తెలుగు టెలివిజన్ తెరపై ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్‌బాస్’ సీజన్ 1కు 14.13 టీఆర్పీ వచ్చింది. మొత్తంగా చప్పగా సాగిన బిగ్‌బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు మాత్రం మంచి టీఆర్పీ సాధించడంలో స్టార్ మాతో పాటు నాగార్జున (Nagarjuna) ఒకింత సక్సెస్ అయ్యారు. త్వరలో బిగ్‌బాస్ ఓటీటీ లో ప్రసారం చేయనున్నారు. దాంతో పాటు బిగ్‌బాస్ సీజన్ 6కు రంగం సిద్ధం చేస్తున్నారు.
Year Ender 2021 : ఈ యేడాది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని వేడెక్కించిన వివాదాలు..
బిగ్‌బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే విషయానికొస్తే.. ఈ షోలో ఓటింగ్ పరంగా దాదాపు 50 శాతం ఆయనకు పడినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత 30 శాతం ఓటింగ్ షణ్ముఖ్ దక్కించుకున్నారని తెలుస్తోంది. ఇక సన్నీకి బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ ట్రోపీతో పాటు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్, షాద్ నగర్లో సువర్ణభూమి నుంచి రూ. 25 లక్షల ఫ్లాట్, ఓ టీవీయస్ బైక్ బహుమతులుగా గెలిచారు. మొత్తంగా తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకుంది.
బాలకృష్ణ, రవితేజలను డైరెక్ట్ చేసిన గోపీచంద్.. వైరల్ అవుతున్న అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో..
బిగ్‌బాస్ సీజన్ 1కు ఎన్టీఆర్ (Jr NTR )హోస్ట్ చేసారు. ఇప్పటి వరకు ప్రసారమైన సీజన్స్‌లో మొదటి సీజన్‌ను ఎక్కువ మంది వీక్షించారు. ఆ తర్వాత రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేసి పర్వాలేదనిపించారు. ఎన్టీఆర్‌తో పోలికలు రావడంతో కాస్త వెనకబడ్డారు. ఇక మూడు, నాలుగు, ఐదు వరుసగా ఐదు సీజన్స్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించి ఈ షోను రక్తి కట్టించారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా సన్ని నిలిచాడు.
Year Ender 2021 : అఖండ, ఉప్పెన, జాతి రత్నాలు సహా 2021లో లాభాలు తీసుకొచ్చిన సినిమాలు..
ఆ సంగతి పక్కన పెడితే.. ఇంతకు ముందు బిగ్‌బాస్ మొదటి సీజన్, రెండో, మూడో, నాలుగో సీజన్ టైటిల్స్ విజేతలైన శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్‌ల జాడ.. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.ఇక బిగ్‌బాస్ సీజన్ వన్‌లో గెలిచిన శివ బాలాజీకి సినిమాలో పెద్దగా ఏమన్నా చేసాడా అంటే సమాధానం లేదు. గెలిచాకా రెండు మూడు ఛానెల్స్ తిరిగి ఓ వారం రోజులు కాస్తంత హడావుడి చేసాడు. మరి సన్ని ఏం చేస్తాడన్నాది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5, Nagarjuna Akkineni, Tollywood