Bigg Boss 5 Telugu double elimination: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. సీక్రేట్ రూమ్‌లోకి లోబో..?

బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu)

Bigg Boss 5 Telugu double elimination: బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఎవరికీ తెలియదు. అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా ఊహించడం కష్టమే. అలాగే ఎలిమినేషన్స్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఒక్కోసారి ఇద్దర్ని కూడా ఎలిమినేట్ (Bigg Boss 5 Telugu double elimination) చేస్తుంటారు.

  • Share this:
బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఎవరికీ తెలియదు. అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా ఊహించడం కష్టమే. అలాగే ఎలిమినేషన్స్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఒక్కోసారి ఇద్దర్ని కూడా ఎలిమినేట్ చేస్తుంటారు. ప్రతీ సీజన్‌లోనూ అలాంటి విచిత్రాలు కనిపిస్తుంటాయి. ఈసారి కూడా అలాంటి సమయం వచ్చేసింది. ఆరు వారాల తర్వాత ఈ సారి ఎవరు ఇంటి నుంచి బయటికి రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ వారం ఏకంగా 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరమే. ముఖ్యంగా ఈ వారం లోబో, సిరిలలో ఎవరో ఒకరు బయటికి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు డబుల్ ఎలిమినేసన్ కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నాడు బిగ్ బాస్. 6వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా డబుల్ ఎలిమినేషన్ జరగబోతోందా అంటే నిజమే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

తాజాగా విడుదలైన ప్రోమోలో ఇంటి సభ్యుల కోరిక మేరకు ఒకర్ని బయటికి పంపిస్తున్నట్లు చూపించారు. లోబో, ప్రియలలో ఎవరికి ఇంటి సభ్యులు ఎక్కువగా ఓట్లు వేస్తే వాళ్లను ఇంటి నుంచి బయటికి పంపే అవకాశం ఉందని నాగార్జున చెప్పాడు. అందులో ప్రియకు 4 ఓట్లు.. లోబోకు 4 ఓట్లు వచ్చాయి. ఆనీ మాస్టర్ డిసైడింగ్ ఓటు వేసారు. అయితే ప్రియా, లోబోలలో ఎవరు బయటికి వచ్చారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే ఇది ఫేక్ ఎలిమినేషన్ అని తెలుస్తుంది.

Chiranjeevi: చిరంజీవి నిర్ణయాలతో అసంతృప్తిలో దర్శకులు.. మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నాడో..?
 గత సీజన్స్‌లోనూ ఇదే చేసారు. ఓ సారి మూడో సీజన్‌లో దేత్తడి హారికను.. నాలుగో సీజన్‌లో అఖిల్‌ను అర్ధరాత్రి ఫేక్ ఎలిమినేషన్ చేసారు. రాహుల్ సిప్లిగంజ్‌ను కూడా ఇలాగే ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రేట్ రూమ్‌లో దాచేసారు. ఈ సారి కూడా ఇదే చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. లోబో, ప్రియాలలో ఒకర్ని ఫేక్ ఎలిమినేషన్ చేస్తారని తెలుస్తుంది. మరోవైపు శ్రీరామ్ కూడా సీక్రేట్ రూమ్‌కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ వారం ఇంటి నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా సిరి లేదంటే శ్వేతాకే కనిపిస్తున్నాయని తెలుస్తుంది.


లోబో కూడా ఉన్నా.. ఈయన్ని ఇంటి సభ్యులే ఎలిమినేట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్ సీక్రేట్ రూమ్ కూడా ఈ వారం ఆసక్తికరమే. ఏదేమైనా కూడా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కాగా ఉంటుందని.. కచ్చితంగా ఒకటి అందులో ఫేక్ అనేది మాత్రం క్లియర్. అయితే ఫేక్ ఎలిమినేషన్ ఎవరు.. ఒరిజినల్ ఎవరు అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రతీవారం జరుగుతున్నట్లు కాకుండా ఈ సారి మాత్రం కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ప్రతీవారం అలాగే ఉండడంతో రేటింగ్స్ కూడా తక్కువగానే వస్తున్నాయి. అందుకే ఈ సారి రేటింగ్స్ పెంచేలా ప్లాన్స్ మార్చేసారు షో నిర్వాహకులు.
Published by:Praveen Kumar Vadla
First published: