Home /News /movies /

BIGG BOSS 5 TELUGU MAANAS CAPTAIN COOL MANAS CLOSER TO TOP 5 IN BIGG BOSS 5 TELUGU TA

Bigg Boss 5 Telugu - Maanas : కెప్టెన్ కూల్ మానస్.. బిగ్‌బాస్‌లో టాప్ 5కి మరింత చేరువ..

మానస్ (Twitter/Photo)

మానస్ (Twitter/Photo)

Bigg Boss 5 Telugu - Maanas Nagulapalli : క్రికెట్‌లో మిస్టర్ కూల్ ధోని బాటలో ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ ఇంట్లో కూడా ఒక కెప్టెన్ కూల్ ఉన్నాడు. ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎవరి ఓన్ స్టైల్ వారు సొంతం చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
    Bigg Boss 5 Telugu - Maanas Nagulapalli : సాధారణంగా కెప్టెన్ కూల్ అని ఎంఎస్ ధోనిని అంటాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు ధోని (MS Dhoni). అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు బిగ్‌బాస్ ఇంట్లో కూడా ఒక కెప్టెన్ కూల్ ఉన్నాడు. ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎవరి ఓన్ స్టైల్ వారు సొంతం చేసుకున్నారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం టాప్ 8 కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నారు. అందులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ముందుకు దూసుకుపోతున్నాడు మానస్. ఈయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రియాలిటీ షో మొదలైనప్పటి నుంచి చాలా మెచ్యూరిటీతో కనిపిస్తున్నాడు ఈయన.

    ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో టెంపర్ లాస్ అయిపోయి అరిచిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. కానీ ఈ 80 రోజుల ప్రయాణంలో ఒక సారి కూడా మానస్ గట్టి గట్టిగా కోపంతో ఊగిపోయి అరిచిన సందర్భాలు ఒక్కటి కూడా లేవు. తన స్నేహితులు సన్నీ, కాజల్, ప్రియాంక సింగ్ చాలా సార్లు ఒత్తిడికి గురై ఇతర ఇంటి సభ్యులతో గొడవ పెట్టుకున్నారు. అలాంటి సమయంలో కూడా చాలా ప్రశాంతంగా కనిపించాడు మానస్.

    Dadasaheb Phalke Award for Rajinikanth: రజినీకాంత్ సహా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ దిగ్గజాలు వీళ్లే..

    ఇక గత వారం కెప్టెన్ అయిన ఈయన తన బాధ్యతను సమర్థవంతంగా పోషించాడు. ఎక్కడ ఏ చిన్న గొడవ కూడా జరగకుండా ఇంటి సభ్యుల మధ్య బాండింగ్ ఉండేలా తనదైన ప్లానింగ్ చేసి చూపించాడు. మానస్ (Maanas) కెప్టెన్సీతో ఇంటి సభ్యులు కూడా ఖుషి అయ్యారు. అతడు మంచి కెప్టెన్ అంటూ అందరూ ఓటేశారు. తన ఆటతీరుతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు ఈయన. అందుకే ఎప్పుడు నామినేషన్స్ లోకి వచ్చిన కూడా భారీగా ఓట్లు పడుతున్నాయి.

    Drushyam Movie Review : విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ రివ్యూ..

    ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే టాప్ 5 కంటెస్టెంట్స్ లో కచ్చితంగా మానస్ ఉంటాడు అనేది అర్థం అవుతుంది. మరి గ్రాండ్ ఫినాలే వరకూ ఇదే ఊపు ఆయన కొనసాగిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతానికైతే మిగిలిన ఇంటి సభ్యులతో పోలిస్తే.. మానస్ ప్రశాంతత అతడికి వరంగా మారింది.

    BalaKrishna - Akhanda : జోరు మీదున్న నట సింహా బాలకృష్ణ ‘అఖండ’ ప్రమోషన్స్..


    మొత్తంగా మరో రెండు మూడు వారాల్లో బిగ్‌బాస్ (Bigg Boss 5) సీజన్ 5కు శుభం కార్డు పడనుంది. ఈ సీజన్‌లో మగవాళ్లే విజేతలుగా నిలుస్తారనేది చూడాలి. ఈసారైనా ఆడవాళ్లకు బిగ్‌బాస్ కిరీటం దక్కేలా కనిపించడం లేదు. మొత్తంగా ఈ సారి ఎవరు బిగ్‌బాస్ విజేతగా నిలుస్తారనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bigg Boss 5, Maanas, Nagarjuna Akkineni, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు