BIgg Boss 5 Telugu jessie: బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు సీజన్ లు పూర్తవగా సీజన్ 5 మాత్రం బాగా హైలెట్ గా మారుతుంది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొని తమ పరిచయాన్ని పెంచుకున్నారు. షో ప్రారంభమై ఒక వారం కూడా కాలేదు అప్పుడే గొడవలు, కాంట్రవర్సీలు, ఎఫైర్ లు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఇందులో మరో కంటెస్టెంట్ జెస్సీ నాగార్జున పేరు లాగుతూ గొడవ గురించి చర్చించాడు.
ఈ సీజన్ లో అందరూ పరిచయమున్న కంటెస్టెంట్ లే పాల్గొనగా.. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు మోడల్ జశ్వంత్. ఇక ఈయన మొదటి రోజు సైలెంట్ గా కనిపించడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత రోజు ఎలిమినేషన్ రౌండ్ లో కాస్త ఎమోషనల్ కావడంతో పాపం అమాయకుడు అని అనుకున్నారు. దాంతో ఆయనకు ఓటింగ్ కూడా బాగానే వచ్చింది. కానీ తర్వాత రోజు అనీ మాస్టర్ తో గొడవపడి బాగా రచ్చ చేశాడు. దీంతో అతని అసలు క్యారెక్టర్ బయటపడటంతో కంటెస్టెంట్ లతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.
ఇది కూడా చదవండి:బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న మరో హాట్ బ్యూటీ.. ఎవరంటే?
ఇక సోషల్ మీడియాలో వీడు మామూలోడు కాదు అంటూ తెగ ట్రోల్స్ చేశారు. ఇక మళ్లీ అనీ మాస్టర్ దగ్గరికి వెళ్లి తనని క్షమించమంటూ కాళ్ళ మీద పడి మరి ఏడ్చాడు. దాంతో మళ్లీ కామెంట్లు ఎదుర్కొన్నాడు జెస్సీ. ఇక తాజాగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో వరెస్ట్ పర్ఫార్మర్ గా నిలవడంతో బిగ్ బాస్ అతడిని జైల్లోకి పంపించడం జరిగింది. ఇక జెస్సీ జైలు కు ముందే.. మరో కంటెస్టెంట్ సన్నీతో మాట్లాడగా అనీ మాస్టర్ తో జరిగిన గొడవ గురించి చర్చలు చేశాడు.
ఇది కూడా చదవండి:మొదటి ఎలిమినేషన్‌లో బయటికి రాబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే?
తను అలా చేసి ఉండకూడదు అంటూ.. ఇప్పుడు నాగార్జున గారు ఏమంటారో అని భయంగా ఉందని తెలిపాడు. అనవసరంగా అనీ మాస్టర్ తో కాళ్ళు పెట్టి గొడవ పెట్టుకున్న అంటూ భయపడగా.. సన్నీ ధైర్యం చెబుతూ ఓదార్చాడు. ఇక ఈరోజు ఆఖరి వారం కాగా ఈరోజు ఎపిసోడ్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anni master, Bigg Boss 5 Telugu, Jaswanth, Jessi, Nagarjuna Akkineni, Star Maa, Sunny