హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఫస్ట్ ఎపిసోడ్‌తోనే..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఫస్ట్ ఎపిసోడ్‌తోనే..

బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా నాగార్జున (Twiter/Photo)

బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా నాగార్జున (Twiter/Photo)

Bigg Boss 5 Telugu : అంతా అనుకున్నట్టే.. బిగ్‌బాస్ 5 (Bigg Boss 5 Telugu) తెలుగు ఎంతో అట్ఠహాసంగా ప్రారంభమైంది.

Bigg Boss 5 Telugu : అంతా అనుకున్నట్టే.. బిగ్‌బాస్ 5 (Bigg Boss 5 Telugu) తెలుగు ఎంతో అట్ఠహాసంగా ప్రారంభమైంది. ఈ సారి 19 కంటెస్టెంట్స్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పట్లాగే ఈ సారి కూడా అదిరిపోయేలా ఎపిసోడ్ మొదలు పెట్టారు నాగార్జున (Nagarjuna). తెలుగులో బిగ్‌బాస్ సీజన్ కు వరుసగా మూడోసారి నాగార్జున హోస్ట్ చేయనున్నారు. గతంలో సీజన్ 3, సీజన్ 4ను తన యాంకరింగ్‌తో షోను రక్తి కట్టించిన నాగార్జున.. ఇపుడు సీజన్ 5ను సక్సెస్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ షో ప్రారంభం కంటే ముందు నాగార్జున కాకుండా వేరే వాళ్లతో  బిగ్‌బాస్ సీజన్ 5ను హోస్ట్ చేయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ సీజన్‌ 5కు వరుసగా నాగార్జున మూడోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

డాన్సులతో పాటు కామెడీ కూడా చేసారు నాగ్. షో మొదలవ్వగానే మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్‌కు డాన్సులతో పిచ్చెక్కించారు నాగార్జున. అలాగే ఇంటి మొత్తాన్ని తిప్పి చూపించారు నాగార్జున. ఈ షో ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రసారం కానుంది. శని, ఆదివారాలు మాత్రం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

NBK : నందమూరి బాలకృష్ణ అరుదైన రికార్డు.. ఆయన తరంలో స్టార్ హీరోగా బాలయ్యకు మాత్రమే అది సాధ్యమైంది..

ఈ సారి షోలో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఫేమసైన వారిని కంటెస్టెంట్స్‌గా తీసుకున్నారు. ఈ షో తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. మన దేశంలో ఎక్కువ మంది ట్వీట్ చేసిన ప్రోగ్రామ్‌గా రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా అత్యధిక ట్వీట్స్‌తో ఈ ప్రోగ్రామ్ టాక్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీగా మారింది. మొత్తంగా తెలుగులో ప్రసారం కాబోతున్న ఈ ప్రోగ్రామ్‌కు దేశ వ్యాప్తంగా సెకండ్ ప్లేస్‌లో నిలవడం మాములు విషయం కాదనే చెప్పాలి.

Nuvvu Naaku Nachav@20Years: 20 యేళ్ల వెంకటేష్ కల్ట్ కామెడీ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’.. ఫైనల్ కలెక్షన్స్..


ఇప్పటి వరకు తెలుగులో బిగ్‌బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది.  బిగ్‌బాస్ సీజన్ నాల్గో సీజన్‌లో అభిజిత్ వితేతగా నిలిచి ప్రైజ్ మని గెలుచుకున్నారు. మొదటి సీజన్‌లో శివ బాలాజీ విజేతగా నిలిచారు. రెండో సీజన్‌లో కౌశల్ మందా నిలిస్తే.. మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ విన్నర్ అయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు ప్రసారమైన ప్రతి సీజన్‌లో మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే విజేతలుగా నిలుస్తూ వస్తున్నారు. మరి ఈ సారి ఈ సెంటిమెంట్ బ్రెేక్ చేసి ఫీమేల్ విజేతలుగా నిలుస్తారా అనేది చూడాలి.

HBD Nandamuri Mokshagna: హ్యాపీ బర్త్ డే నందమూరి మోక్షజ్ఞ.. బాలయ్య తనయుడు ఎంట్రీ పై ఫ్యాన్స్ ఎదురు చూపులు..


ఇక బిగ్‌బాస్ విషయానికొస్తే..  తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు  మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా ఐదోసారి బిగ్‌బాస్ సీజన్ 5ను  నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.  ఈ సీజన్‌లో యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్‌లలో ఇద్దరిలో ఎవరు ఒకరు విజేతలుగా నిలుస్తారని అపుడే గుసగుసలు మొదలయ్యాయి.

First published:

Tags: Bigg Boss 5 Telugu, Nagarjuna Akkineni, Tollywood

ఉత్తమ కథలు