Home /News /movies /

BIGG BOSS 5 TELUGU CONTESTANT HAMIDA OPENS ABOUT HER LOVE TOWARDS SREERAMA CHANDRA PK

Hamida - Sreerama Chandra: అవును.. శ్రీరామచంద్రతో ఆ కనెక్షన్ నిజమే.. అసలు విషయం చెప్పిన హమీద..

హమీద శ్రీరామచంద్ర (Hamida Sreeram)

హమీద శ్రీరామచంద్ర (Hamida Sreeram)

Hamida - Sreerama Chandra: ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, హమీద (Hamida - Sreerama Chandra) మధ్య ఒక లవ్ ట్రాక్ బాగానే నడిచింది. నాగార్జున కూడా ఈ ఇద్దరి గురించి ప్రమోషన్ బాగానే చేశాడు. గత వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చింది హమీద. తాజాగా ఆయనతో రిలేషన్ గురించి ఓపెన్ అయింది ఈ భామ.

ఇంకా చదవండి ...
ప్రతి సారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కచ్చితంగా ఒక్కరైనా ప్రేమలో ఉంటారు. తమ మధ్య నిజంగానే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రేమ పుట్టిందని మీడియా ముందు ఒప్పుకుంటారు. ఆ తర్వాత వాళ్లు తమ కనెక్షన్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకుంటారేమో అనేంత ప్రేమగా కనిపిస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, హమీద మధ్య ఒక లవ్ ట్రాక్ బాగానే నడిచింది. నాగార్జున కూడా ఈ ఇద్దరి గురించి ప్రమోషన్ బాగానే చేశాడు. గత వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చింది హమీద. ఎలాగూ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలతో బిజీ అయిపోతారు కంటెస్టెంట్స్. ఇప్పుడు హమీద కూడా ఇదే చేస్తోంది. వచ్చీ రాగానే తన జర్నీ గురించి మీడియాకు చెప్పింది. అక్కడ జరిగిన రచ్చ గురించి కూడా ఓపెన్ అయిపోయింది.

బిగ్ బాస్ ఇంటిని వదిలిపెట్టి వచ్చే కంటే కూడా అక్కడ శ్రీరామ్‌ను వదిలి రావడం ఎక్కువగా బాధ అనిపించింది అంటుంది హమీద. ఆయనతో ఉన్న కనెక్షన్ ఆ ఇంటి వరకు మాత్రమే పరిమితం కాదని.. బయటకు వచ్చిన తర్వాత కూడా తమ బంధం కొనసాగుతుంది అంటూ అసలు విషయం చెప్పింది. శ్రీ రామ్‌తో తాను హార్ట్ నుంచి కనెక్ట్ అయ్యానని.. అది ఇంటి వరకూ మాత్రమే ఉండే బంధం కాదు అంటుంది. ఈ రిలేషన్ ఒకవేళ మీరు ప్రేమ అనుకుంటే.. తామిద్దరం ప్రేమలో ఉన్నామని ఒప్పుకుంది హమీద.

Nuvve Kavali 21 Years: మిలీనియం ఇండస్ట్రీ హిట్ ‘నువ్వే కావాలి’కి 21 ఏళ్ళు పూర్తి.. విశేషాలు ఇవే..


బయటికి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా శ్రీరామ్ తర్వాత అదే రిలేషన్ కొనసాగిస్తాడు అని చెప్పింది. ఆయన కూడా బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది నిర్ణయించుకుంటామని ఓపెన్‌గా చెప్పింది హమీద. తమ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలా లేదా అనే విషయంపై కూడా ఆలోచన చేసుకుంటామని.. కానీ రామ్‌ను వదిలేసి రావడం మాత్రం తనకు చాలా బాధ అనిపించింది అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇంట్లో కెప్టెన్ అవ్వాలి అనేది తన కోరిక అని.. కానీ అది తీరకుండానే బయటికి వచ్చేసినట్లు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది హమీద.

Anasuya Bharadwaj: వాళ్లను కోర్టుకు ఈడుస్తా.. మా ఎన్నికల తర్వాత అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్..



శ్రీరామ్ తర్వాత తనకు ఇంట్లో అంత జెన్యూన్‌గా కనెక్ట్ అయిన మరో పర్సన్ యాంకర్ రవి అని చెప్పింది. అతడిని అన్నయ్య అని పిలుస్తానని.. ప్రతి విషయంలో బాగా సపోర్ట్ చేశాడు అంటుంది. ఇంట్లో మిగిలిన వాళ్ళతో తనకు జెన్యూన్‌గా కనెక్షన్ లేదని.. కేవలం శ్రీ రామచంద్రతో మాత్రమే కలిసాను అంటుంది. తమ ఇద్దరి మధ్య మాటలు కూడా అవసరం లేదని.. కేవలం కంటి చూపుతోనే ఒకరినొకరు అర్థం చేసుకుంటాము అంటుంది ఈమె. హమీద మాటలు వింటుంటే కచ్చితంగా శ్రీరామ్ బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక విషయం నిర్ణయించుకుని చెప్పేలా కనిపిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 5 Telugu, Hamida, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు