Bigg Boss 5 Telugu Uma Devi: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూస్తూనే ఉన్నాం. ఇందులో నటించే పాత్రలన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఇందులో వంటలక్క సవితి తల్లిగా నటిస్తున్న అర్ధ పావు భాగ్యం అలియాస్ ఉమాదేవి గురించి అందరికి తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది ఉమాదేవి. ఇదిలా ఉంటే ఈమె రెమ్యూనరేషన్ మొత్తం దానం చేసిందని తెలిసింది.
కేవలం కార్తీకదీపం సీరియల్ లో కాకుండా పలు సీరియల్ లో కూడా నటిస్తున్న ఉమాదేవికి తన పాత్రల వల్ల ది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్5 లో అవకాశం వచ్చింది. కానీ ఈమె రెండు వారాలకే బిగ్ బాస్ హౌస్ ను వదిలేసే పరిస్థితి వచ్చింది. నిజానికి ఉమాదేవి వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలానే ఉంది. కానీ తన మాటలు ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఆమెను త్వరగా ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశారు.
హౌస్ లో ఉన్నంత కాలం ఉమాదేవి తన మాటలతో బాగా రచ్చ చేసింది. మొదటి మూడో రోజు నుంచి తనేంటో తను అసలు రంగు ఏంటో బయటపడింది. కానీ ఈమె నిజానికి హౌస్ లో నటించలేదు. నిజజీవితంలో ఉండే క్యారెక్టర్ నే హౌస్ లో చూపించింది. కానీ మధ్య మధ్యలో ఆమె మాట్లాడిన బూతు మాటల వల్ల తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఈమె ఇంట్లో నుండి బయటికి వెళ్ళాక మాత్రం నిజంగానే ఉమాదేవి బాగా ఆడిందని తన కటువు మాటలతో అందరినీ గడగడలాడించింది కానీ ఆమెనే వంద రెట్లు కరెక్టు అని అనుకున్నారు ప్రేక్షకులు.
ఇది కూడా చదవండి:లైవ్ కి వచ్చిన అర్థపావు భాగ్యం.. మా డాక్టర్ బాబు అంటూ రచ్చ రచ్చ
ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా తను సంతోషంగా బయటికి వచ్చానన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందరిని మిస్ అవుతున్నాను అంటూ.. తొందరగా రావడం వల్ల బాధ అనిపించిందని తెలిపింది. ఇక ఈమె బిగ్ బాస్ నుండి అందుకున్న పారితోషకం మొత్తాన్ని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారికి అందజేసింది. ఈ విషయం తెలియగానే ఆమె తన పిల్లల కోసం వారి జీవితాల కోసం హౌస్ లోకి వచ్చానని తెలిపింది.. కానీ తన పిల్లలకు కూడా ఆ డబ్బులను వాడకుండా ఒక క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి ఇవ్వడంతో ఉమా దేవి మాటలు కటువు కానీ ఆమె మనసు వెన్న అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Telugu, Cancer baby, Star Maa, Uma devi