Bigg Boss 5 Telugu - UmaDevi: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చూశాం. ఈ సీరియల్ ద్వారా ఇందులో నటిస్తున్న నటులు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో అర్థపావు భాగ్యంగా అలరించే ఉమాదేవి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 5లో అవకాశం అందుకుంది. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి అతి తక్కువ సమయంలోనే ఇంటి దారి పట్టింది. ఇదిలా ఉంటే తను తాజాగా లైవ్ లోకి వచ్చి కొన్ని విషయాలు పంచుకుంది.
నిజానికి ఉమాదేవి హౌస్ లో ఎటువంటి నటన చూపించలేదు. తాను నిజ జీవితంలో ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉంది. తను ప్రతి ఒకటి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. దీంతో ఆ షోలో ఆమె మాటలు మిగతా కంటెస్టెంట్ లందరికీ సూటిపోటి గా ఉండడంతో ఆమెను ఎలిమినేట్ చేశారు. అలా ఆమెకు ఓటింగ్ కూడా చాలా తక్కువ వచ్చాయి.
ఇక రెండో వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన ఉమాదేవి తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చట్లు పెట్టడానికి లైవ్ లోకి వచ్చింది. ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది. ఆమె కూడా మాట్లాడుతూ అందరి లవ్ సపోర్ట్ వల్లే ఇంత వరకు వచ్చాను అంటూ.. బిగ్ బాస్ షో నుంచి మంచి పేరుతో బయటకు రావడం సంతోషంగా ఉందని కానీ రెండో వారం లోనే బయటికి రావడం బాధగా ఉందని తెలిపింది.
అందులోనే ఉంటే మాత్రం ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేసేదాన్ని అని తెలిపింది. ఇక తనకు ఎలిమినేషన్ అనేది అన్ ఫెయిర్ గా అనిపించిందని ఆ విషయంలో చాలా బాధపడ్డానని తెలిపింది. ఏం జరిగినా అంత మంచిదే అనుకొని ఒకవేళ మళ్లీ రీ ఎంట్రీ అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తాను మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తాను అని తెలిపింది. ఇక తను ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉంటానని కానీ వాళ్లంతా తనను తప్పుగా అర్థం చేసుకొని తను మాట్లాడే మాటలకు భయపడ్డారు అని తెలిపింది.
లోబోను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ గా తెలిపింది. ఇక ఈ షో స్క్రిప్టు కాదని తెలిపింది. తను చేసిన పాత్రల వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందని.. మళ్లీ సీరియల్స్ కి పెళ్లి అర్ధపావు భాగ్యంగా అలరిస్తానని తెలిపింది. ఇక మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చారో లేదో తెలియడం లేదు.. కానీ.. మా డాక్టర్ బాబు బాగుండాలి.. మా దీప బాగుండాలి త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ardapavu bagyam, Bigg Boss 5 Telugu, Bigg Boss UmaDevi, Karthika deepam, Tollywood