Sarayu - Ariyana: సరయు దెబ్బకు బెదిరిపోయిన అరియనా.. ఇంటర్వ్యూలో గుట్టు అంత విప్పేసిందిగా

Sarayu - Ariyana

Sarayu - Ariyana: బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమై నిన్నటితో వారం రోజులు పూర్తయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి ఎలిమినేట్ లిస్టులో ఉన్న ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ సంగతి తెలిసిందే. అందులో బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అవ్వగా మొత్తానికి ఇంటి పట్టు పట్టేసింది ఈ హాట్ బ్యూటీ.

  • Share this:
    Sarayu - Ariyana: బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమై నిన్నటితో వారం రోజులు పూర్తయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి ఎలిమినేట్ లిస్టులో ఉన్న ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ సంగతి తెలిసిందే. అందులో బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అవ్వగా మొత్తానికి ఇంటి పట్టు పట్టేసింది ఈ హాట్ బ్యూటీ. ఇక నిన్న ఎపిసోడ్ చివరిలో వేదికపై సరయు ఎంతలే ఫైర్ అయిందో చూసాం. వరెస్ట్, బెస్ట్ కాన్సెప్ట్ తో వరెస్ట్ కంటెస్టెంట్ లను ఓ రేంజ్ లో దుమ్ము దులిపేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే సరయు దెబ్బకు ఏకంగా అరియానా కూడా బెదిరిపోయింది.

    బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేయడానికి సీజన్ ఫోర్ బోల్డ్ బ్యూటీ అరియానా ముందుకు వచ్చింది. దీంతో తాజాగా ఇంటర్వ్యూ కి సంబంధించిన బిగ్ బాస్ బజ్ ప్రోమో విడుదల అయింది. ఇక అందులో అరియానాను వచ్చి హగ్ చేసుకొని తనకు నచ్చని కంటెస్టెంట్ పై బోల్డ్ గా కామెంట్స్ చేసింది సరయు. వేదిక పైనే కాకుండా ఇక్కడ కూడా చాలా మండిపోయినట్లు కనిపించింది. అందులో కంటెస్టెంట్ సిరి హన్మంత్ మగవాళ్ళని అడ్డుపెట్టుకొని ఆట ఆడుతుంది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.

    ఇది కూడా చదవండి:నువ్వు ఎదగాలని అందరిని తొక్కేయకు.. లహరికి ఇచ్చి పడేసిన సరయు!

    ఇక యాంకర్ రవి మంచోడు లెక్క నీతి సూత్రాలు బోధిస్తాడు కానీ విషయం ఏమీ లేదు అంటూ రవి ఫోటోను అక్కడికక్కడే పగలగొడుతుంది. ఇక సన్నీకి క్యారెక్టర్ లేదు అంటూ సన్నీ ఫోటోను కూడా ఘోరంగా పగలగొట్టింది. సరయు కోపాన్ని చూసి అరియానా సైలెంట్ గా నిల్చొని చూస్తుంది. ఎలుకలు గుంపులుగా వస్తాయి అంటూ.. సింహం ఒక్కటే వస్తుంది అంటూ.. ఆ ఇంట్లో సింహం లాంటి మొగోడు విశ్వ అంటూ బోల్డ్ గా మాట్లాడింది. షణ్ముఖ్ జస్వంత్ గురించి కూడా కొన్ని కామెంట్లు చేసినట్టు కనిపించింది.

    ఇది కూడా చదవండి:నాగార్జున ప్రశ్న.. పబ్లిక్‌గా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేసిన షన్ను.. దీప్తినే అంటూ?

    నిజంగా దమ్ము ఉంటే మగాడివైతే అంటూ ఓ కంటెస్టెంట్ ను ఉద్దేశించి అన్నది. తను గాజులు వేసుకొని కూడా ఒక దాన్నే ఆడతా అంటూ నువ్వు ఇంట్లోకి వెళ్లి మూల కూర్చో అంటూ ఓ రేంజ్ లో మండిపడింది. ఇక అరియానా మాత్రం సరయూ మాటలకు బిత్తరపోయినట్లు చూస్తుంది. నిజానికి సరయు మాటల దెబ్బకు బెదిరి పోయింది ఈ బోల్డ్ బ్యూటీ. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజనులు మాత్రం అరియానాను చూసి పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా అరియానాకు దిమ్మ తిరిగి పోయింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి సరయు హౌస్ మేట్స్ గుట్టు అంతా విప్పేసింది.
    Published by:Navya Reddy
    First published: