హోమ్ /వార్తలు /సినిమా /

Priya - Lahari: మగాళ్లతో నువ్వు బిజీ లహరీ.. బాంబు పేల్చిన ప్రియా అంటీ.. మరీ ఇంత నీచంగా మాట్లాడితే ఎలా అంటూ?

Priya - Lahari: మగాళ్లతో నువ్వు బిజీ లహరీ.. బాంబు పేల్చిన ప్రియా అంటీ.. మరీ ఇంత నీచంగా మాట్లాడితే ఎలా అంటూ?

Priya - Lahari

Priya - Lahari

Priya - Lahari: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికి ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికి నాలుగు సీజన్ లు పూర్తి కాగా

  Priya - Lahari: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికి ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికి నాలుగు సీజన్ లు పూర్తి కాగా ఈ సీజన్ ప్రారంభమై మూడో వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఇప్పటి వరకు పూర్తయిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ మాత్రం బాగా హైలెట్ గా మారుతుంది.

  ప్రతి ఒక్క కంటెస్టెంట్ లు ఎక్కడ తగ్గేలా లేరు. ఈ షో ప్రారంభమైన రెండో రోజు నుండే తమ అసలు రంగులు చూపించారు కంటెస్టెంట్ లు. ఏ రోజు కూడా గొడవ పడకుండా లేరు. కాంట్రవర్సీలు కూడా బాగా ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ వారం నామినేషన్ భాగంలో 'వాల్ ఆఫ్ షేమ్' అనే టాస్క్ ఇచ్చారు. ఇక ఈ షోలో ఎవరు కొనసాగడం అనవసరం అని భావిస్తారో వారి పేరును బద్దలు కొట్టి నామినేట్ చేయాలి.

  దీంతో ప్రతి ఒక్క కంటెస్టెంట్ లు తమకు నచ్చని వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. ఇక ప్రియ.. లహరిని నామినేట్ చేసింది. వెంటనే లహరి నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారు అర్థం కావడం లేదు అని అనగా.. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్న అందరూ అబ్బాయిలతో బిజీగా ఉంటావు సమాధానం ఇచ్చింది. దీంతో లహరి షాక్ అవుతూ వాళ్ళు ఎవరు అని ప్రశ్నించగా.. రవి, మానస్ అని చెప్పడంతో వెంటనే రవి షాక్ అవుతూ.. ఆమెను ఒక ఫ్రెండ్ లా, సోదరీ ల భావిస్తానని చెప్పాడు.

  వెంటనే ప్రియ మీరు అందరి దగ్గర సపోర్ట్ ఆశించకండి అనేసరికి రవి తల పట్టుకొని ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. లహరి కూడా ప్రియపై గట్టిగా అరిచింది. దీంతో లహరి కాస్త ఎమోషనల్ గా అనిపించడంతో మిగతా కంటెస్టెంట్ లు అందరూ ఆమెను ఓదార్చినట్లు కనిపించింది. ఇక ప్రియ ఒక దగ్గర ఒంటరిగా కూర్చున్నట్లు అనిపించింది. ఈ ప్రోమోను చూసిన బిగ్ బాస్ అభిమానులు ప్రియలో అసలైన రంగు బయటపడింది అంటూ మండిపడుతున్నారు. ఈమె కంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఉమాదేవి చాలా వరకు నయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ పరంగా ఆలోచిస్తే ఒకవేళ నామినేట్ లిస్టులో ప్రియ ఉన్నట్లయితే ఏ మాత్రం ఆలోచించకుండా ప్రియను ఇంట్లో నుంచి బయటకు పంపించేలా చేస్తారు నెటిజన్లు.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Akkineni nagarjuna, Anchor ravi, Bigg Boss 5 Telugu, Contastant priya, Lahari

  ఉత్తమ కథలు