BIGG BOSS 5 TELUGU CONTASTANT PRIYA EMOTIONAL ABOUT HER BABY DEATH DURING CORONA PANDEMIC TIME NR
Bigg Boss 5 Telugu Priya: చనిపోకముందే స్మశానం బుక్ చేసి వచ్చాను.. కానీ ఇంటికి వచ్చి చూడగానే అంటూ కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ ప్రియా
Bigg Boss 5 Telugu Priya
Bigg Boss 5 Telugu Priya: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రచ్చ మొదలైంది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా తమ వ్యక్తిగత విషయాలతో మరింత పరిచయాన్ని పెంచుకుంటున్నారు. కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లో
Bigg Boss 5 Telugu Priya: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రచ్చ మొదలైంది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా తమ వ్యక్తిగత విషయాలతో మరింత పరిచయాన్ని పెంచుకుంటున్నారు. కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లో తమ పనులతో, ముచ్చట్లతో బాగా బిజీ అయ్యారు. గేమ్ లో కూడా బాగా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నటి ప్రియ తన వ్యక్తిగత విషయంలో కొన్ని చేదు అనుభవాలను పంచుకుంది.
తెలుగు సినీ నటి ప్రియ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. సహాయ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె బిగ్ బాస్ లో అడుగుపెట్టగా అందరితో బాగా కలిసిపోయింది. అందరితో కలిసి బాగా ముచ్చట్లు పెడుతుంది. బుధవారం జరిగిన ఎపిసోడ్ లో కొన్ని చేదు అనుభవాలను పంచుకుంది. తనతో పాటు పలువురు కంటెస్టెంట్ లు కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో ప్రియ తన కూతురు విషయం గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది.
అక్కడే కూర్చున్న నటరాజ్ లైఫ్ చాలా సంతోషంగా ఉండాలి అంటూ.. అలా ఎక్కడ ఉంటుందో చూడాలి అని కానీ గత ఏడాదిలో ఎన్నో విషాదాలు చూసాము అని అనడంతో వెంటనే ప్రియ మాట్లాడుతూ తన ఇంటిలో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న తన పాప బతికి ఉన్నప్పుడు ఆ బాధ గురించి చెప్పలేను అంటూ బాధ పడింది. కోవిడ్ సమయంలో స్మశాన వాటికలు దొరకలేదు అంటూ.. తన కూతురు ఎక్కువ రోజులు బతుకదని ఇక కేవలం రెండు రోజులే అనీ తెలిసేసరికి స్మశాన వాటిక బుక్ చేసి వచ్చాను అని తెలిపింది.
అలా బుక్ చేసి వచ్చిన తరువాత తన కూతురితో నవ్వుతూ పలకరించడం ఎంత బాధగా ఉంటుందో తెలుసా అంటూ కడుపులో చెయ్యి పెట్టి నలిపేసిన ఫీలింగ్ అంటూ భరించడం కష్టమని తెలిపింది. తన కూతురు ఎప్పుడు నవ్వుతూ ఉండేది అంటూ..తను ఎంత బాధలో ఉన్నా కూడా తన ఆరోగ్యం గురించి అడిగేదని తెలిపింది. ఇక తనకు ఎక్కువ గాలి వీస్తే ఊపిరాడదని.. ఊపిరి తీసుకోకుండా అల్లాడిపోతూ కంటి నుంచి కన్నీరు రాల్చేదని తన బాధను తెలిపింది. ఆమె మాటలు విన్న నటరాజ్ తో పాటు పలువురు కంటెస్టెంట్ లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.