Bigg Boss 5 Telugu: కళ్ల ముందు భారీ రెమ్యునరేషన్ .. ఐనా బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిన ఫేమస్ సింగర్, యాంకర్. మాములుగా బిగ్‌బాస్ ఆఫర్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఈ షోతో మాములు వ్యక్తులు కాస్తా ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయారు. ఈ షోతో చాలా మందికి మాస్‌లో గుర్తింపు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. వివరాల్లోకి వెళితే.. తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 5కు అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ నుంచి బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభం కానుంది. ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా నాగార్జునకు బదులు రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం కాలేదు. ఈ సారి కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ప్రోమో కూడా విడుదల చేసారు.
ఇప్పటి వరకు తెలుగులో బిగ్‌బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్ సీజన్ నాల్గో సీజన్‌లో అభిజిత్ వితేతగా నిలిచి ప్రైజ్ మని గెలుచుకున్నారు. ఇక బిగ్‌బాస్ విషయానికొస్తే.. తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. ఇపుడు మరోసారి నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి సింగర్ మంగ్లీతో పాటు ప్రముఖ యాంకర్ వర్షిణికి బిగ్‌బాస్ టీమ్ భారీ ఆఫర్ ఇచ్చినా.. బిగ్‌బాస్ హౌస్‌లో పార్టిసిపేట్ చేయలేమంటూ చెప్పేసారట.
ఈ షోలో సింగర్ మంగ్లీతో పాటు యాంకర్ వర్షిణి పేర్లు బాగా వినిపించాయి. ఇప్పటికే సింగర్ మంగ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు యాంకర్ వర్షిణి పలు టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే ఒప్పుకున్న కమిట్‌మెంట్స్ కారణంగా బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయలేమని చెప్పేసారట. ఐతే... ఈ షోలో పార్టిసిపేట్ చేసినవారికి బయట పెద్దగా అవకాశాలు వచ్చిన దాఖలాలు లేవు. విజేతలుగా నిలిచిన శివ బాలాజీ, కౌశల్ మంద, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్ ఎవరు పెద్దగా ఇరగదీసింది లేదు. అందుకే బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ ఆఫర్ వచ్చినా తిరస్కరించినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి..
Mohan Babu: ఆ వ్యక్తి నన్ను దారుణంగా మోసం చేసారు.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Chiranjeevi : చిరంజీవి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా.. దీని వెనక ఇంత పెద్ద కహానీ ఉందా..
HBDShankar: దక్షిణాది చిత్రాల సత్తాను చూపెట్టిన ఇస్మార్ట్ డైరెక్టర్ శంకర్..
నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor varshini, Bigg Boss 5 Telugu, Nagarjuna Akkineni, Singer Mangli, Star Maa, Tollywood