Home /News /movies /

BIGG BOSS 5 TELUGU BEAUTY LAHARI SHARI BOUGHT BMW BIKE AND PHOTOS GOING VIRAL PK

Bigg Boss Lahari Shari: BMW బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..

లహరి షారి బిఎండబ్ల్యూ బైక్ (lahari shari)

లహరి షారి బిఎండబ్ల్యూ బైక్ (lahari shari)

Bigg Boss Lahari Shari: ఒక్కసారి బిగ్ బాస్‌లోకి వస్తే.. దెబ్బకు వాళ్ళ దశ మారిపోతుంది. వచ్చిన క్రేజ్ ఆ తర్వాత వాళ్లు వాడుకుంటారా లేదా అనే విషయం పక్కనబెడితే అప్పటి వరకు మాత్రం తెలుగు ప్రేక్షకులందరికీ వాళ్లు పరిచయం అవుతుంటారు. లహరి షారి (Bigg Boss Lahari Shari) అలాగే పరిచయమైంది.

ఇంకా చదవండి ...
ఒక్కసారి బిగ్ బాస్‌లోకి వస్తే.. దెబ్బకు వాళ్ళ దశ మారిపోతుంది. వచ్చిన క్రేజ్ ఆ తర్వాత వాళ్లు వాడుకుంటారా లేదా అనే విషయం పక్కనబెడితే అప్పటి వరకు మాత్రం తెలుగు ప్రేక్షకులందరికీ వాళ్లు పరిచయం అవుతుంటారు. ప్లాన్ చేసుకుని ఆ క్రేజ్‌ను వాడుకోవడం అనేది వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటి వరకు అలా వాడుకుని స్టార్స్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5లో మెరిసిన ఓ భామ.. ఇప్పుడు ఏకంగా బిఎండబ్ల్యూ కారు కొనేసింది. గత సీజన్‌లో తన గ్లామర్‌తో అలరించిన లహరి షారి ఇప్పుడు కార్ కొనేసింది. ఈ భామ హౌజ్‌లో ఉన్నది మూడు వారాలే అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ముఖ్యంగా మంచి గ్లామర్ షోతో పాటు డేరింగ్ నేచర్ కూడా ఈమెకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తనదైన ముద్ర వేసుకోడానికి ప్రయత్నిస్తుంది లహరి. నాగార్జున కూడా ఈమెను బాగానే గుర్తు పెట్టుకున్నాడు. అందుకే వచ్చిన తర్వాత బంగార్రాజు ప్రమోషన్స్ చేసే బాధ్యత ఈమెకు ఇచ్చాడు. లహరి హోస్టుగా బంగార్రాజు ఇంటర్వ్యూలు చేసాడు. అందులో భాగంగానే అక్కినేని అందగాళ్లతో ఓ రోజంతా ఫ్లైట్‌లోనే ఉండిపోయింది లహరి. సోషల్ మీడియాలోనూ ఈమెకు మంచి క్రేజ్ ఉంది.

తాజాగా ఈ అమ్మడు తనకు ఎంతో ఇష్టమైన బీఎండబ్ల్యూ బైక్ సొంతం చేసుకుంది. లక్షలు పెట్టి కొనుగోలు చేసింది లహరి షారి. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది లహరి. ఎట్టకేలకు తాను కోరుకున్న బైక్ ఇంటికి వచ్చేసింది అంటూ లహరి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బైక్ ధర అక్షరాలా 3.50 లక్షలు. సిటీతో పాటు నేషనల్ హైవేలపై ఇకపై రైడ్స్‌తో రచ్చ చేయడమే అంటుంది ఈ భామ. ఇప్పుడిప్పుడే యాంకర్‌గా తనకంటూ గుర్తింపు సంపాదించుకుంటున్న లహరి.. మెల్ల మెల్లగా అవకాశాలు దక్కించుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 5తో వచ్చిన గుర్తింపును తన కెరీర్ కోసం వాడుకోవాలని చూస్తుంది. మొత్తానికి బిఎండబ్ల్యూ బైక్ కొనేసి.. రోడ్లపై రచ్చ చేయడానికి రెడీ అయిపోయింది ఈ బ్యూటీ.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Lahari shari, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు