హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్‌ ముందు మరో పెద్ద సవాల్.. దాన్ని అధిగమిస్తే..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్‌ ముందు మరో పెద్ద సవాల్.. దాన్ని అధిగమిస్తే..

బిగ్‌బాస్ 5 బిగ్‌ అప్డేట్ (Bigg Boss Telugu 5  Photo : Twitter)

బిగ్‌బాస్ 5 బిగ్‌ అప్డేట్ (Bigg Boss Telugu 5 Photo : Twitter)

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్‌ ముందు మరో పెద్ద సవాల్.. దాన్ని అధిగమిస్తేనే హౌస్‌లో ప్రవేశించడానికి అర్హత సాధిస్తారు. లేకపోతే అంతే  సంగతులు.. వివరాల్లోకి వెళితే.. 

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్‌ ముందు మరో పెద్ద సవాల్.. దాన్ని అధిగమిస్తేనే హౌస్‌లో ప్రవేశించడానికి అర్హత సాధిస్తారు. లేకపోతే అంతే  సంగతులు.. వివరాల్లోకి వెళితే.. తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 5కు అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ నుంచి బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభం కానుంది.  ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా నాగార్జునకు బదులు రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం కాలేదు. ఈ సారి కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు తెలుగులో బిగ్‌బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది.  బిగ్‌బాస్ సీజన్ నాల్గో సీజన్‌లో అభిజిత్ వితేతగా నిలిచి ప్రైజ్ మని గెలుచుకున్నారు. ఇక బిగ్‌బాస్ విషయానికొస్తే..  తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు  మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు.

సీజన్ 5 హోస్ట్‌గా  నాగార్జునకు మంచి పారితోషకం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే నాగార్జున పై ట్రయల్ షూట్స్ చేసినట్టు సమాచారం. ఈ సీజన్‌లో కొత్తవాళ్లను కాకుండా అందరికీ తెలిసివాళ్లను బిగ్‌బాస్ సీజన్ 1లో ఎలాగైతే.. చాలా మంది సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేసినట్టే.. ఇపుడు సీజన్ 5 కోసం కొత్త మొఖాలు కాకుండా పాపులర్ ఫిగర్స్‌ను రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. అందులో భాగంగా టిక్ టాక్ దుర్గారావు, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ (సత్యవతి), టిక్ టాక్ స్టార్ భాను, యాంకర్ ప్రత్యూష, శేఖర్ మాస్టర్, యాంకర్ శివ, కమెడియన్ ప్రవీణ్,యాంకర్ వర్షిణి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ వంటి వాళ్లు బిగ్‌బాస్ సీజన్‌ 5లో పార్టిసిపేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు బిగ్‌బాస్ సీజన్ 5లో ఎక్కువగా కాంట్రవర్సీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్ లిస్ట్ bigg boss season 5

తాజాగా ఈ షోకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుగా ప్రోమో విడుదల చేయనున్నారు. ఆ ప్రోమోలో షో ఎపుడు ప్రారంభం అవుతుందో చెబుతారట. ఇక షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్‌కు ఆగష్టు 22 నుంచి రెండు వారాలు పాటు క్వారంటైన్‌లో ఉండాలట. అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత హౌస్‌లోకి పంపిస్తారట. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ 20 మందిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే వారిని హౌస్ నుంచి పంపించేసి కొత్త వారిని తీసుకునేలా బిగ్‌బాస్ టీమ్ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి.. 

Nagarjuna - Jr NTR : నాగార్జునకు పెద్ద తల నొప్పిగా మారిన ఎన్టీఆర్ .. మరోసారి అక్కినేని Vs నందమూరి..


HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..


Shankar - Lingusamy: తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ పెడుతున్న తమిళ దర్శకులు.. శంకర్ నుంచి లింగుస్వామి వరకు టాలీవుడ్ పై దండయాత్ర...


Controversial Photoshoots: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫోటోషూట్స్ ఇవే..


Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

First published:

Tags: Bigg Boss 5 Telugu, Nagarjuna Akkineni, Star Maa, Tollywood

ఉత్తమ కథలు