Home /News /movies /

BIGG BOSS 5 TELUGU 9TH WEEK ELIMINATION OUT AND VISHWA OUT FROM THE HOUSE PK

Bigg Boss 5 Telugu: ఏడుపు రాజా ఔట్.. బిగ్ బాస్ 5 తెలుగులో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే..

Bigg Boss Telugu 5 logo Photo : Twitter

Bigg Boss Telugu 5 logo Photo : Twitter

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu) 9వ వారం ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఎప్పట్లాగే ముందు రోజే ఎవరు బయటికి వెళ్తున్నారనే సంగతిపై క్లారిటీ వచ్చేసింది. ఈ వారం ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. గత సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో కెప్టెన్ షణ్ముఖ్ తప్ప హౌజ్ మొత్తం నామినేట్ అయ్యారు.

ఇంకా చదవండి ...
బిగ్ బాస్ 5 తెలుగు 9వ వారం ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఎప్పట్లాగే ముందు రోజే ఎవరు బయటికి వెళ్తున్నారనే సంగతిపై క్లారిటీ వచ్చేసింది. ఈ వారం ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. గత సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో కెప్టెన్ షణ్ముఖ్ తప్ప హౌజ్ మొత్తం నామినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ తమను తాము సేవ్ చేసుకోడానికి మరో అవకాశం ఇచ్చాడు. అందులో అనీ మాస్టర్, మానస్ ఇద్దరూ సేవ్ అయ్యారు. అనీని ఇంటి సభ్యులు సపోర్ట్ చేస్తే.. తనకు వచ్చిన స్పెషల్ పవర్‌తో మానస్‌ను నామినేషన్స్ నుంచి సేవ్ చేసింది అనీ. దాంతో ఈ వారం శ్రీరామచంద్ర, కాజల్, సన్నీ, సిరి, జెస్సీ, యాంకర్ రవి, విశ్వ, ప్రియాంక నామినేట్ అయ్యారు. ఇందులో శ్రీరామ్, యాంకర్ రవి, సన్నీ బాగా స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్లకు ఓటింగ్ కూడా అదిరిపోయేలా పడింది. మరోవైపు జెస్సీకి సింపతీ ఓట్లు ఈ సారి బాగానే పడ్డాయి.

అనారోగ్యంగా ఉన్నా కూడా ఆడుతున్నానే సంపతి బాగానే వర్కవుట్ అయింది. మరోవైపు సిరి కూడా షణ్ణు ఫాలోయర్స్ కారణంగా సేవ్ అయిపోయింది. ఇక చివరగా కాంట్రవర్సీ క్వీన్ కాజల్ కూడా చివరి వరకు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు అనిపించినా.. ఇంట్లో ఈమె లేకపోతే మసాలా ఉండదేమో అని భావించిన ఆడియన్స్ ఓట్లు వేసి సేవ్ చేసారు. విశ్వ, ప్రియాంక చివరగా మిగిలిపోయారు.

Puneeth Rajkumar Wife letter: అప్పు లేని బాధ మాకు తెలుసు. మీ కుటుంబాలకు వద్దంటూ పునీత్ భార్య కన్నీటి లేఖ..


Allu Arjun brother Bobby: అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?


ఈ ఇద్దరిలో కచ్చితంగా ప్రియాంక సింగ్ కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుందని అంతా భావించారు. అయితే చివర్లో ట్విస్ట్ వచ్చింది. పింకీ కాకుండా ఈ వారం విశ్వ ఇంటి నుంచి బయటికి వచ్చేసాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయింది. ప్రియాంక, విశ్వ ఇద్దరూ చివరి వరకు ఉండగా.. చివర్లో విశ్వ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. రెండుసార్లు ఇంటి కెప్టెన్ అయిన విశ్వ.. ఈ సారి మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. మాట్లాడితే ఏడవడం.. లేదంటే ఫిజికల్‌గా వెళ్లిపోవడం తప్పిస్తే మైండ్ గేమ్ లేదనే విమర్శ మనోడిపై ముందు నుంచి ఉంది. అదే శాపంగా మారిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 5 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు