BIGG BOSS 5 TELUGU 8TH WEEK 55TH EPISODE VJ SUNNY ELECTED WORST PERFORMER HE GOES TO JAIL AND BIG WAR BETWEEN JESSY AND SUNNY NGS
Bigg Boss Telugu 5: జైలుకెళ్లిన వీజే సన్ని.. జెస్సీతో బిగ్ ఫైట్.. కాలుతో తన్నాడా..?
వరస్ట్ పర్ఫార్మర్ వీజే సన్నీ
VJ Sunny Selected As Worst Performer: కెప్టెన్ అయిన వెంటనే వరస్ట్ పర్ఫార్మర్ అయ్యాడు విజే సన్నీ.. అతడు జైలుకు వెళ్లడం ఇది రెండోసారి.. కానీ బిగ్ బాస్ హౌస్ లో వరస్ట్ పర్ఫార్మర్ ఎంపిక రచ్చ రచ్చ అయ్యింది. ఒకనొక టైంలో జెస్సీ - సన్నీ ఒకరిపై ఒకరుకు వెళ్లి కొట్టుకునేంత పని చేశారు.
Bigg Boss Telugu 5.. Episode 55: బిగ్ బాస్ తెలుగు 5 (Bigg boss telugu 5) హౌస్ లో హౌస్ మేట్స్ మధ్య గ్రూపులు పెరుగుతున్నాయి. ఇప్పటికే షణ్ముఖ్, జెస్సీ, సిరీలు త్రిమూర్తులుగా ఉన్నారు. వాళ్లు కలిసే ఆట ఆడుతున్నారు. ఇప్పుడు సన్ని, మానస్, కాజల్ ఒక గ్రూపుగా మారుతున్నారు. మిగిలిన వారంతా ఒక గ్రూపుగా ఉంటారు. దీంతో హౌస్ లో గొడవలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా 55వ ఎపిసోడ్ హౌస్ మేట్స్ ను కొట్టుకునే స్థాయికి తీసుకెళ్లింది. కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన గొడవ నుంచి తేరుకోలేకపోతున్నారు వీజే సన్నీ (VJ Sunny), మానస్ (Manas)లు.. ముఖ్యంగా సన్నీ తాను, మానస్ ఎలా ఓడిపోయానని చెప్తారని ఆవేశంతో ఊగిపోయాడు. ఇదంతా హౌస్‌లో నుంచి చూసిన యాంకర్ రవి (Anchor Ravi).. సన్నీతో మాట్లాడు కానీ మానస్‌తో మాట్లాడొద్దు అని జెస్సీ (Jessy)కి సలహా ఇచ్చాడు. గేమ్‌లో ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే మండుతుందని ఫైర్ అయ్యాడు సింగర్ శ్రీరామ్ (Singer Sreeram). మరోపక్క రవి ఈవారం పెద్దగా పర్ఫామ్ చేయలేదని అభిప్రాయపడ్డాడు షణ్ను. అటు ఆర్ జె కాజల్ (RJ Kajal) మాత్రం శ్రీరామ్ ఇంకా మాస్క్ తీయలేదని సన్నీ, మానస్‌లతో చెప్పుకొచ్చింది. అటు శ్రీరామ్.. నామినేషన్స్ తప్పించుకునేందుకు కాజల్ కాంట్రవర్శీలకు పోవడం లేదని పేర్కొనగా రవి అవునని తలూడించాడు. ఆమెను సేఫ్ ప్లేయర్‌గా అభివర్ణించాడు.
హౌస్ మేట్స్ మధ్య రచ్చ కొనసాగుతున్న సమయంలోనే తర్వాత హౌస్‌లో వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్. ముందుగా కెప్టెన్ షణ్ను.. నీ ఫ్రెండ్స్ వల్ల నీ గేమ్ కనిపించలేదంటూ కాజల్ పేరు సూచించాడు. సన్నీ.. సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడంటూ జెస్సీ పేరు చెప్పాడు.
నీ గేమ్ నువ్వు ఆడు, పక్కవాళ్ల గేమ్ ఆడకు అని హెచ్చరిస్తూ కాజల్ చెత్తగా ఆడిందన్నాడు శ్రీరామ్. మొత్తంగా ఈ టాస్క్ ముగిసే సమయానికి కాజల్, సన్నీకి మూడేసి ఓట్లు పడ్డాయి. దీంతో కెప్టెన్ షణ్ను.. సన్నీ బస్తాను తన్నడం నచ్చలేదంటూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించడానికి సిద్ధపడ్డాడు.
ఈ క్రమంలో త్రిమూర్తులకు, సన్నీకి మధ్య పెద్ద గొడవ జరిగింది. సిరి కత్తి పట్టుకోవడం తప్పు కాదా? అని ప్రశ్నించాడు జెస్సీని కావాలని తన్నాను అని నిరూపిస్తే ఇప్పటికిప్పుడు హౌస్‌లో నుంచి వెళ్లిపోతానన్నాడు. అతడికి మద్దతుగా రంగంలోకి దిగి వాదనకు దిగారు మానస్, కాజల్. చివర్లో యానీ.. తన ఓటును సన్నీకి మార్చడంతో ఇంట్లో అందరికన్నా ఎక్కువగా సన్నీకే 4 ఓట్లు పడ్డాయి. దీంతో అతడిని జైల్లో వేశారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.