BIGG BOSS 5 NAGARJUNA HOST BIGG BOSS SHOW RATING VERY LOW DAY BY DAY TA
Bigg Boss 5 - Nagarjuna : బిగ్‌బాస్ రేటింగ్ విషయంలో చేతులేత్తేసిన నాగార్జున.. వీకెండ్లో కూడా..
బిగ్‌బాస్ సీజన్ 5 హోస్ట్‌గా నాగార్జున (Twitter/Photo)
Bigg Boss Telugu 5 - Nagarjuna : lనాగార్జున మూడోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షో ‘ బిగ్‌బాస్’. తాజాగా ఈ షో రేటింగ్స్ విషయంలో వెనకబడ్టట్టు తాజాగా వచ్చిన రేటింగ్స్ స్ఫస్టం చేస్తున్నాయి.
Bigg Boss Telugu 5 - Nagarjuna : lనాగార్జున మూడోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షో ‘ బిగ్‌బాస్’. తాజాగా ఈ షో రేటింగ్స్ విషయంలో వెనకబడ్టట్టు తాజాగా వచ్చిన రేటింగ్స్ స్ఫస్టం చేస్తున్నాయి. ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన ఈ షో ముందుగా హిందీ ప్రేక్షకులను అలరించింది. ఆ తరవాత నెమ్మది నెమ్మదిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ (NTR Jr )ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని (Natural Nani) హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఐదోసారి బిగ్‌బాస్ సీజన్ 5ను నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్లలో ఇద్దరిలో ఎవరు ఒకరు విజేతలుగా నిలుస్తారని అపుడే గుసగుసలు మొదలయ్యాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఇప్పటి వరకు ఆరుగురు కంటెస్టెంట్స్ ఈ రియాలిటీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆరుగురులో ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. తెలుగులో గత నాలుగు సీజన్లు హిట్ టాక్ తెచ్చుకోగా.. ఐదో సీజన్ మాత్రం కాస్త ఏటికి ఎదురీదుతోంది. వీక్ డేస్‌లో ఎంతో కొంత రేటింగ్ రాబడుతుండగా.. వీక్ డేస్‌లో ఈ షో రేటింగ్ మరీ వీక్ అయిపోయింది. రాత్రి 10 గంటలకు ఈ షోను ప్రసారం చేస్తుండటంతో ఈ షోను చూసే ప్రేక్షకులు రాను రాను తగ్గి పోతున్నారు. గత వారం ఈ షోకు 2.69 రేటింగ్ వచ్చింది. వీకెండ్లో మాత్రం బిగ్‌బాస్ షోకు అర్భన్ ఏరియాలో 8.77 వచ్చింది. రూరల్‌లో మాత్రం 5.70 రేటింగ్ మాత్రమే సంపాదించింది.
హౌస్‌లో ఉండే కంటెస్టెంట్స్ కూడా పెద్దగా అలరించలేకపోతున్నారనే టాక్ ఉంది. అంతేకాదు హౌస్‌లో ఉండేవాళ్లు ప్రేక్షకులను ఎంటర్టేన్ చేయడంలో విఫలమవుతున్నారనే మాట వినిపిస్తోంది. బిగ్‌బాస్ అంటేనే గ్లామర్‌కు నిలయం. ఇందులో గ్లామర్ భామలు నలుగురు ఎలిమినేట్ కావడంతో ఈ షోపై ఆ ఇంపాక్ట్ పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అన్నట్టు మొదటి లాంఛింగ్ ఎపిసోడ్‌తోనే అంతగా రేటింగ్ రాకపోవడం ఈ షోకు పెద్ద మైనస్. పైగా హౌస్‌లో ఉండే కంటెస్టెంట్స్‌లతో ఎవరు పెద్దగా తెలిసిన ముఖాలు లేకపోవడం బిగ్‌బాస్ సీజన్ 5కు పెద్ద మైనస్ అని చెప్పుకుంటున్నారు.పైగా బిగ్‌బాస్ వల్ల సామాన్య ప్రజలకు పెద్దగా ఒరిగేదేమి లేదు అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.
హౌస్‌లో కంటెస్టెంట్స్ చిత్ర, విచిత్రంగా సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్నారనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. పైగా మన భారతీయ సాంప్రదాయాలను మంట గలిపే ప్రోగ్రామ్ అంటూ కొంత మంది సాంప్రదాయ వాదులు ఈ షోను బ్యాన్ చేయాలంటూ గళమెత్తుతున్నారు. మొత్తంగా ఇదివరకటిలా ఈ షో అంత కిక్ ఇవ్వడం లేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇప్పటికే రెండు నెలలు పూర్తి చేసుకుంటు్న బిగ్‌బాస్ సీజన్ 5ను నాగార్జున ఏ విధంగా విజయ తీరాలకు చేరుస్తా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.