Bigg Boss 5: బిగ్‌బాస్ 5 సీజన్‌కు అంతా సిద్ధం అయిందా.. టెలికాస్ట్‌కు ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వివరాాల్లోకి వెళితే.. తెలుగులో బిగ్‌బాస్ సీజన్ నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకున్నాయి. ఇప్పటికే ఆరు పూర్తై పోయింది. ఇక బిగ్‌బాస్ సీజన్ నాల్గో సీజన్‌లో అభిజిత్ వితేతగా నిలిచారు. ఇక తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నాని హోస్ట్‌గా వ్యవహరించారు.ఇక మూడో, నాలుగు సీజన్‌కు మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. ఇపుడు ఐదో సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇక బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ విన్నర్‌గా శివ బాలాజీ నిలిచారు. రెండో సీజన్‌లో కౌశల్ మందా విజేతగా నిలిచారు. ఇక మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకున్నారు. నాల్గో సీజన్‌లో అభిజిత్ విజేతగా నిలిచారు.
తాజాగా ఐదో సీజన్‌కు కోసం ఇప్పటి నుంచే స్టార్ మా వాళ్లు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జూమ్, గుగుల్ మీట్ ద్వారా బిగ్‌బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసేవాళ్లను ఇంటర్వ్యూలు కూడా చేసినట్టు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసేవారు కోవిడ్ వాక్సినేషన్ రెండు పూర్తి చేసుకుంటే కానీ హౌస్‌లోకి ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. గత నాల్గో సీజన్‌లాగే ఐదో సీజన్‌ను ఆగష్టు చివరి వారంలో మొదలు పెట్టేందుకు అంతా సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
ఈ సీజన్‌లో కొత్తవాళ్లను కాకుండా అందరికీ తెలిసివాళ్లను బిగ్‌బాస్ సీజన్ 1లో ఎలాగైతే.. చాలా మంది సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేసినట్టే.. ఇపుడు సీజన్ 5 కోసం కొత్త మొఖాలు కాకుండా పాపులర్ ఫిగర్స్‌ను రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. అంతేకాదు సీజన్ 5లో ఎక్కువగా కాంట్రవర్సీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.