హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేకు అతిథులు వీరే.. అదిరిన ‘స్టార్ మా’ కాన్సెప్ట్..

Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేకు అతిథులు వీరే.. అదిరిన ‘స్టార్ మా’ కాన్సెప్ట్..

Bigg Boss Telugu 5 logo Instagram

Bigg Boss Telugu 5 logo Instagram

Bigg Boss 5 :  బిగ్ బాస్ 5 తెలుగు చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. మరో వారం రోజుల్లోనే ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. తాజాగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథులుగా వీరు రానున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

  Bigg Boss 5 :  బిగ్ బాస్ 5 తెలుగు చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. మరో వారం రోజుల్లోనే ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం ఇంట్లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వాళ్లే ఫైనలిస్టులు అంటూ నాగార్జున అధికారికంగా ప్రకటించాడు కూడా. కాజల్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ సీజన్ అందరికంటే ముందుగానే శ్రీరామచంద్ర ఫైనల్ చేరుకున్నారు. ఆ తర్వాత సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, సిరి కూడా ఫైనల్ చేరుకున్నట్లు అనౌన్స్ చేసాడు నాగ్. ఇక చివరగా మానస్ కూడా ఫైనలిస్టుగా నిలిచాడు. ఆయన ఫైనల్ చేరిన విషయం అనౌన్స్ చేసిన వెంటనే.. కాజల్ బయటికి వచ్చేసింది. మరి వీళ్లలో ఎవరికి గెలిచే సత్తా ఉంది.. ఈ ఐదుగురులో ఎవరికి ఎక్కువగా టైటిల్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

  నాగార్జున హోస్ట్ చేస్తోన్న గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథులుగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు హాజరు కానున్నట్టు సమాచారం. ఈ షో గ్రాండ్ ఫినాలేకు రామ్ చరణ్, ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే హాజరు కానున్నట్టు సమాచారం. ‘83’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ షోకు హాజరు కానున్నట్టు సమాచారం.

  Bigg Boss 5 Telugu finlaists,Bigg Boss 5 Telugu finlaist sunny,Bigg Boss 5 Telugu finlaist siri,Bigg Boss 5 Telugu finlaist maanas,Bigg Boss 5 Telugu finlaist sreerama chandra,Bigg Boss 5 Telugu finlaist shanmukh jaswanth,telugu cinema,బిగ్ బాస్ 5 తెలుగు,బిగ్ బాస్ 5 తెలుగు ఫైనలిస్టులు,బిగ్ బాస్ 5 తెలుగు ఫైనలిస్టుల బలాలు బలహీనతలు
  బిగ్ బాస్ 5 తెలుగు ఫైనల్ కంటెస్టెంట్స్ (File/Photo)

  ఈ షోలో  షణ్ముఖ్ జస్వంత్ భారీ అంచనాలు మాత్రమే కాదు.. భారీ పారితోషికం కూడా తీసుకుని ఈ సీజన్ ఇంట్లోకి వచ్చిన కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్. మనోడికి యూ ట్యూబ్‌లో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. ఇప్పటికే కోటికి పైగా పారితోషికం అందుకున్నట్టు సమాచారం.  ఫైనల్‌కు చేరినా కూడా గెలుస్తాడా అంటే మాత్రం కాస్త అనుమానమే. ఈయన కంటే మిగిలిన వాళ్లు కాస్త ముందున్నారు. విన్నర్ కంటే రన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  మహేష్ బాబు, నమ్రత బాటలో గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్న ఈ సినీ జంటలు తెలుసా..

  ఈ సీజన్ తొలి ఫైనలిస్టుగా నిలిచాడు శ్రీరామ్. ఈయనపై ముందు నుంచి కూడా అందరికీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. అదే శ్రీరామ్‌కు శ్రీరామరక్ష. అయితే ఈ మధ్యే శ్రీ రెడ్డి చేసిన రచ్చతో కాస్త నెగిటివ్ వైబ్స్ ఈయనకు కూడా వచ్చాయి. అది ఓటింగ్స్‌పై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది.

  Akhanda : అఖండ దూకుడు ముందు ఐదేళ్ల ఆ రికార్డ్ ఫసక్.. బాలకృష్ణ మాస్ బీభత్సం..

  మానస్: సీజన్ మొదలైనపుడు మానస్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సీరియల్స్‌తో పాటు సినిమాలు కూడా చేసినా కూడా మానస్ అంత పాపులర్ కాదు. కానీ సీజన్ అయ్యే సరికి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే విన్నర్ అయ్యేంత ఫాలోయింగ్ మాత్రం ఈయనకు కనిపించడం లేదు. కేవలం ఓ గ్రూప్ వరకు ఉండటమే ఈయనకు మైనస్.

  Rana - Virata Parvam : రానా బర్త్ డే సందర్భంగా ‘విరాట పర్వం’ నుంచి క్రేజీ అప్‌డేట్..

  సిరి హన్మంత్: ఫైనలిస్టుల్లో ఉన్న ఒకేఒక్క అమ్మాయి. అయితే సీజన్ అంతా కేవలం షణ్ణు చుట్టూనే ప్రదక్షణలు చేయడం ఈమెకు మైనస్. పైగా తనపై తనకే నమ్మకం లేకపోవడం కూడా సిరికి నెగిటివ్. ఈ సీజన్ అంతా సిరి జర్నీ చూసుకుంటే అందులో షణ్ముఖ్ తప్ప మరెవరూ ఉండరు.

  Rana Daggubati - Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ మూవీ నుంచి రానా టీజర్ పై బిగ్‌ అప్డేట్..


  సీజన్ మొదలైనపుడు ఈయనపై ఎవరికీ అంచనాలు లేవు. కానీ రానురాను మనోడి ఫాలోయింగ్ భయంకరంగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెకండ్ సీజన్‌లో కౌశల్‌ను ఇంటి సభ్యులు ఎలాగైతే టార్గెట్ చేసి హీరోను చేసారో.. ఇప్పుడు సన్నీ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయనకు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ప్రకారం చూస్తుంటే మాత్రం సన్నీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా గ్రాండ్ ఫినాలేలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Alia Bhatt, Bigg Boss 5, Deepika Padukone, Nagarjuna Akkineni, Ram Charan, Ranveer Singh, Star Maa, Tollywood

  ఉత్తమ కథలు