HOME »NEWS »MOVIE »bigg boss 4 winner abijeet shares photo with his mom mnj

Abijeet: అమ్మతో చిన్నప్పటి ఫొటోను షేర్ చేసిన అభిజీత్.. సూపర్ క్యూట్ అంటోన్న ఫ్యాన్స్‌

Abijeet: అమ్మతో చిన్నప్పటి ఫొటోను షేర్ చేసిన అభిజీత్.. సూపర్ క్యూట్ అంటోన్న ఫ్యాన్స్‌
అభిజీత్

గ‌తేడాది జ‌రిగిన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ విన్న‌ర్‌గా అభిజీత్(Abijeet) టైటిల్‌ని గెలుచుకున్న విష‌యం తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వెళ్లిన అభిజీత్. మొద‌టి నుంచి అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ వ‌చ్చాడు. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న టాస్క్‌ల‌లో పెద్దగా ప‌ర్ఫామ్ చేయ‌క‌పోయినా.. త‌న ప్రవర్తనతో అంద‌రి మనసులను గెలుచుకున్నాడు

  • Share this:
    BB 4 Winner Abijeet: గ‌తేడాది జ‌రిగిన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ విన్న‌ర్‌గా అభిజీత్ టైటిల్‌ని గెలుచుకున్న విష‌యం తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వెళ్లిన అభిజీత్. మొద‌టి నుంచి అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ వ‌చ్చాడు. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న టాస్క్‌ల‌లో పెద్దగా ప‌ర్ఫామ్ చేయ‌క‌పోయినా.. త‌న ప్రవర్తనతో అంద‌రి మనసులను గెలుచుకున్నాడు. ఎలిమినేషన్ కోసం 11 సార్లు నామినేట్ అయినప్పటికీ.. ప్రేక్షకుల ఓట్లతో చివరి వరకు వెళ్లాడు. ఇక మిస్ట‌ర్ కూల్‌, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌గా అంద‌రి మ‌న్న‌న‌లు పొంది.. చివ‌రకు బిగ్‌బాస్ విజేత‌గా నిలిచాడు. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత అభిజీత్‌కి మ‌రింత క్రేజ్ పెరిగింది. ఆయ‌న కోసం ప‌లువురు ద‌ర్శ‌కులు స్క్రిప్ట్‌ల‌ను రెడీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన ఫేమ్‌ని పోగొట్టుకోకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న అభిజీత్.. ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం.

    కాగా బిగ్‌బాస్ త‌రువాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న అభిజీత్ తాజాగా చిన్న‌ప్పుడు త‌న అమ్మ‌తో తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో అమాయ‌కంగా చూస్తున్నాడు అభి. ఇక దానికి మామ్ ల‌వ్ అని కామెంట్ పెట్టాడు. కాగా ఈ ఫొటో అభి ఫ్యాన్స్‌ని బాగా ఆక‌ట్టుకుంటోంది. బిగ్‌బాస్ షో ద్వారా అభిజీత్ త‌ల్లి కూడా ఫేమ్ సాధించ‌గా.. క్యూట్ అంటూ ఆ ఇద్ద‌రి ఫొటోను అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.





    ఇదిలా ఉంటే ఇటీవ‌ల అభిజీత్.. టీమిండియా క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ‌.. త‌న జెర్సీని గిఫ్ట్‌గా పంపిని విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌కు చెందిన క్రికెట‌ర్ హనుమ విహారి ద్వారా త‌న జెర్సీని గిఫ్ట్‌గా పంపారు రోహిత్. దాన్ని అభి త‌న సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో షేర్ చేసుకున్న సంగ‌తి విదిత‌మే.
    Published by:Manjula S
    First published:January 21, 2021, 19:24 IST