• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 WINNER ABIJEET INTERESTING POST ON HIS SHIRT GOES VIRAL FANS COMMENTS MNJ

Abijeet: పులి స్టోరీని మ‌ళ్లీ గుర్తు చేసిన బిగ్‌బాస్ 4 విజేత‌ అభిజీత్.. కార‌ణ‌మిదే

Abijeet: పులి స్టోరీని మ‌ళ్లీ గుర్తు చేసిన బిగ్‌బాస్ 4 విజేత‌ అభిజీత్.. కార‌ణ‌మిదే

అభిజీత్

గ‌తేడాది ప్ర‌సార‌మైన బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 టైటిల్‌ని అభిజీత్(Abijeet) సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు (ముగ్గురు వైల్డ్‌కార్డ్ స‌హా) ఈ సీజ‌న్‌లో పాల్గొన‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే టైటిల్‌ని గెలుచుకున్నాడు అభిజీత్

  • Share this:
    Abijeet: గ‌తేడాది ప్ర‌సార‌మైన బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 టైటిల్‌ని అభిజీత్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు (ముగ్గురు వైల్డ్‌కార్డ్ స‌హా) ఈ సీజ‌న్‌లో పాల్గొన‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే టైటిల్‌ని గెలుచుకున్నాడు అభిజీత్. ఇక‌ బిగ్‌బాస్ విజేతగా అభి గెలిచిన స‌మ‌యంలోనూ పులి గెలిచిదంటూ అత‌డి అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెట్టిన విష‌యం విదిత‌మే. కాగా ఈ పులి స్టోరీని మ‌ళ్లీ ఓ సారి గుర్తు చేశాడు అభిజీత్. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న అభిజీత్.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేశాడు.

    దానికి పూల చొక్కా కాదు.. పులి చొక్కా అని అభి కామెంట్ పెట్టాడు. ఇక ఈ కామెంట్ మ‌రోసారి అంద‌రికీ బిగ్‌బాస్ డేస్‌ని గుర్తు చేస్తోంది. అయితే బిగ్‌బాస్ రియాలిటీ షో జ‌రిగేట‌ప్పుడు ఒకానొక స‌మ‌యంలో అభిజీత్ త‌న‌ను తాను పులిగా ప్ర‌క‌టించుకున్నారు. అంతేకాదు వ్యాఖ్యాత నాగార్జున సైతం అభిని పులితోనే వ‌ర్ణించాడు.



    అయితే సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన త‌రువాత అఖిల్‌ని ఉద్దేశించి.. అభి, మేక అన‌డం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత అఖిల్ కూడా త‌న‌ను తాను పులితో పోల్చుకోవ‌డం జ‌రిగాయి. కానీ చివ‌ర్లో మాత్రం అభి విన్న‌ర్‌గా, అఖిల్ ర‌న్న‌ర్‌గా నిలిచిన‌ప్పుడు పులి వ‌చ్చింది.. మేక చ‌చ్చింది అన్న అల వైకుంఠ‌పుర‌ములో మూవీ డైలాగ్‌తో అభి ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి త‌న కామెంట్‌తో పులి స్టోరీని గుర్తు చేశాడు అభి. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ద్వారా తెచ్చుకున్న ఫేమ్‌ను కంటిన్యూ చేయాల‌నుకుంటోన్న అభిజీత్.. ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం.
    Published by:Manjula S
    First published: