Abijeet Bigg Boss 4: ఆ విష‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఫాలో అవ్వ‌లేదు.. అభిజీత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

విజయ్ దేవరకొండ అభిజీత్

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య‌న ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ప్రారంభ‌మైన బిగ్‌బాస్ 4 తెలుగు విజేత‌గా అభిజీత్(Abijeet) నిలిచాడు. హౌజ్‌లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌గా పేరొందిన అభిజీత్.. అంద‌రినీ మెప్పించి విన్న‌ర్‌గా నిలిచాడు

 • Share this:
  Abijeet Bigg Boss 4: ఎన్నో అంచ‌నాల మ‌ధ్య‌న ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ప్రారంభ‌మైన బిగ్‌బాస్ 4 తెలుగు విజేత‌గా అభిజీత్ నిలిచాడు. హౌజ్‌లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌గా పేరొందిన అభిజీత్.. అంద‌రినీ మెప్పించి విన్న‌ర్‌గా నిలిచాడు. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఇచ్చిన ప‌లు ఇంట‌ర్వ్యూల్లోనూ త‌న‌లోని మంచిదనాన్ని చాటుకుంటూ మ‌రింత మంది అభిమానుల‌కు సంపాదించుకుంటున్నాడు. కాగా అభిజీత్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు ప‌లువురు సెల‌బ్రిటీలు అత‌డికి మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు. వారిలో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఒక‌డు. అభితో ఉన్న ఫొటోను త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. నా స్నేహితులు ఎక్క‌డ ఉన్నా.. వారు మంచిగా ఉండాల‌ని కోరుకుంటున్నా అని దేవ‌ర‌కొండ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో అభికి విజ‌య్ ఫ్యాన్స్ మ‌ద్ద‌తు కూడా ల‌భించింది.

  కాగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో దేవ‌రకొండ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు అభిజీత్. నేను హౌజ్‌లో ఉన్న‌ప్పుడు నాకు మ‌ద్ద‌తు ఇచ్చిన విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌కు థ్యాంక్స్. అత‌డికి ఏం అనుకున్నాడో అది నెర‌వేర్చుకున్నాడు. విజ‌య్ మంచి టాలెంటెడ్ యాంక‌ర్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో న‌టించిన వారంద‌రూ ఇప్పుడు మంచి పేరును సంపాదించుకున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్‌తో నాకు ఇంకో అవ‌కాశం వ‌చ్చింది అని తెలిపాడు.

  ఇక ఇటీవల క్రిస్మ‌స్ సంద‌ర్భంగా శాంటా క్లాజ్‌గా కొంత‌మంది పిల్ల‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లిన అభి.. అక్క‌డే త‌న పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా అలానే చేశారు క‌దా. దాన్ని ఇన్ఫిరేష‌న్‌తో తీసుకొని మీరు అలా చేశారా..? అన్న ప్ర‌శ్న‌కు.. అలా ఏం లేదు. విజ‌య్‌ని ఫాలో అవ్వ‌లేదు. విజ‌య్ అలా చేశాడ‌ని నాకు తెలీదు అని వివ‌రించారు అభి. కాగా ఈ సీజ‌న్ విజేత‌గా నిలిచిన అభికి ఇప్పుడు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్లు సమాచారం.
  Published by:Manjula S
  First published: