Home /News /movies /

BIGG BOSS 4 WINNER ABIJEET COMMENTS ON SOHEL MEHABOOB CONTROVERSIAL VIDEO MNJ

Abijeet: సొహైల్, మెహబూబ్ వైరల్ వీడియోపై బిగ్‌బాస్ 4 విన్న‌ర్‌ అభిజీత్ షాకింగ్ కామెంట్

అభిజీత్

అభిజీత్

బిగ్‌బాస్ సీజ‌న్‌ 4(Bigg Boss 4) మొత్తానికి ఇప్పుడు కాంట్ర‌వ‌ర్స‌రీగా మారింది ఓ వీడియో. రీయూనియ‌న్ సంద‌ర్భంగా హౌజ్‌లోకి వెళ్లిన మెహ‌బూబ్‌(Mehaboob).. సొహైల్‌(Sohel)కి డ‌బ్బులు తీసుకోమని హింట్ ఇచ్చాడ‌ని ఓ వీడియో తెగ వైర‌ల్ అయ్యింది

ఇంకా చదవండి ...
    Bigg Boss 4 Abijeet: బిగ్‌బాస్ సీజ‌న్‌ 4 మొత్తానికి ఇప్పుడు కాంట్ర‌వ‌ర్స‌రీగా మారింది ఓ వీడియో. రీయూనియ‌న్ సంద‌ర్భంగా హౌజ్‌లోకి వెళ్లిన మెహ‌బూబ్‌.. సొహైల్‌కి డ‌బ్బులు తీసుకోమని హింట్ ఇచ్చాడ‌ని ఓ వీడియో తెగ వైర‌ల్ అయ్యింది. ఈ క్రమంలో టాప్ 3లో ఉండగా.. ఆ డబ్బులు తీసుకొని ఎలిమినేట్ అవ్వడంపై సొహైల్‌పై కూడా ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు సొహైల్‌కి విన్న‌ర్ అభిజీత్ ప్రైజ్ మ‌నీ నుంచి రూ.25ల‌క్ష‌లు ఇవ్వ‌డంపై కూడా చాలా మంది మండిప‌డ్డారు. విన్న‌ర్ ప్రైజ్ మ‌నీ నుంచి సగం డ‌బ్బును ఇవ్వ‌డ‌మేంట‌ని బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌పై కామెంట్లు చేశారు. ఇలాంటి నేప‌థ్యంలో వీడియో అలాగే ప్రైజ్ మ‌నీ వ్య‌వ‌హారంపై ఓ ఇంట‌ర్వ్యూలో బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజీత్ స్పందించారు.

    అదేం పెద్ద ఇష్యూ కాద‌ని.. దాన్ని పెద్ద‌గా చేయ‌కండ‌ని అన్నారు. తాను బ‌య‌ట‌కు వచ్చిన త‌రువాత ఆ వీడియో చూశాన‌ని.. అయినా అందులో ఏదైనా త‌ప్పు ఉంటే స్టార్ మా నిర్వాహ‌కులు చూసుకుంటార‌ని, ప్రాబ్ల‌మ్ అనుకుంటే వారు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని తెలిపారు. ఇక ప్రైజ్ మ‌నీ నుంచి స‌గం డ‌బ్బులు మూడో స్థానంలో వ‌చ్చిన సొహైల్‌కి ఇవ్వ‌డంపై స్పందిస్తూ.. నేను బిగ్‌బాస్ విజేత‌ను అవుదామ‌నుకున్నా. మ‌నీ అన్న‌ది ముఖ్యం కాదు. అది ఎప్పుడో ఒక‌సారి సంపాదించుకోవ‌చ్చు. కానీ నేను విజేత‌ను. డ‌బ్బులు కాదు నాకు ఒక గుర్తింపు కావాల‌నుకున్నా. ఇప్పుడు ఆ గుర్తింపు వ‌చ్చింది.

    ఇప్ప‌టివ‌ర‌కు నేను శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హీరోని. నా పేరు శీను. కానీ ఇప్పుడు నేను శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హీరో అభిజీత్‌ని. ఆ గుర్తింపు నాకు చాలు. నేను ఎంట‌ర్‌టైనర్‌ని. అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేయాల‌నుకుంటా అని త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేశాడు. ఇక ఈ వ్య‌వ‌హారాల‌పై అభిజీత్ స్పంద‌న‌ను విన్న ఫ్యాన్స్ మ‌రింత సంబ‌ర‌పడిపోతున్నారు. అభిజీత్ యాట్యిట్యూడ్ అత‌డిని విజేత‌ను చేసింద‌ని.. మ‌రోసారి మిస్ట‌ర్ కూల్ అనిపించుకున్నాడ‌ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

    కాగా బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన త‌రువాత అభిజీత్‌కి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే స్టార్ మా నిర్వాహ‌కుల‌తో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా అత‌డి కోసం ప్ర‌త్యేక ప్రోగ్రామ్‌ల‌ను ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. చూస్తుంటే అభిజీత్ త్వ‌ర‌లో బిజీగా మార‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Televison News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు