BIGG BOSS 4 WINNER ABHIJEET ABOUT DETHADI HARIKA SHOCKING COMMENTS MK
BiggBoss Abhijeet: అభిజిత్ చేసిన పనికి...కన్నీళ్లతో స్పృహ తప్పి పడిపోయిన దేత్తడి హారిక...అంత మాట అనగానే..
Instagram
Bigg Boss 4 Winner Abhijeet About Dethadi Harika | అభిజిత్ ఫ్యాన్స్ ఇద్దరి పేర్లను కలుపుతూ ABHIKA అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా చేశారు. అయితే అభిజిత్, హారిక మధ్య కొందరు మాత్రం వారిది కేవలం క్యూట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ సెలవిచ్చేశారు.
Bigg Boss 4 Winner Abhijeet About Dethadi Harika | బిగ్ బాస్ షోలో అభిజిత్ హారిక మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఫెవికాల్ బంధం ఉందని అందరూ చెబుతుంటారు. అందుకు తగ్గట్టు గానే అభిజిత్ ఫ్యాన్స్ ఇద్దరి పేర్లను కలుపుతూ ABHIKA అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా చేశారు. అయితే అభిజిత్, హారిక మధ్య కొందరు మాత్రం వారిది కేవలం క్యూట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ సెలవిచ్చేశారు. కానీ వారిద్దరూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఒక్కటవుతారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఇవ్వన్నీ సోషల్ మీడియాను ఊపేసిన సంఘటనలే. అంతేకాదు అభిజిత్ బంధవు యాంకర్ రవి కూడా బయట వారిద్దరి బంధం ఒక్కటయ్యేలా ప్రయత్నాలు కూడా చేశాడు. ఏకంగా హారిక సోదరుడు, ఆమె తల్లి కూడా అభిజిత్ తమకు అల్లుడు అయితే అభ్యంతరం లేదని చెప్పేశారు. అభిజిత్ హారికలు ఇష్టపడితే పెళ్లి చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ఇంట్లో ఒక సారి విజిట్ చేసిన హారిక తల్లి జ్యోతి కూడా నాగార్జున ముందే తమ కాబోయే వచ్చిన హారిక తల్లి జ్యోతి అభిజిత్‌ను ప్రశంసలతో ముంచెత్తింది.
అంతేకాదు హారిక తల్లి జ్యోతి, అభిజిత్ అమ్మ లక్ష్మీని ఒకే చోటకు యాంకర్ రవి చేర్చి, అభిజిత్ హారిక ఫ్యామిలీలను కలిపే ప్రయత్నం కూడా చేశారు. ఇదిలా ఉంటే అభిజిత్ తనకు కజిన్ బ్రదర్ అవుతాడని యాంకర్ రవి స్వయంగా చెప్పాడు. అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ కథ వేరే ఉందన్న సంగతి తాజాగా బయట పడింది. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత బయటకు వచ్చిన హారిక, అభిజిత్ లు జంటగా అందరికీ దర్శనం ఇస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ హారిక మాత్రం అభిజిత్ ను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హారిక బయటకు వస్తూనే అందరి అఖిల్, సోహైల్ లను ఉద్దేశిస్తూ బయ్ బ్రదర్స్ అంటూ చెప్పేసింది. హౌస్ బయటకు రాగానే బ్రదర్స్ అయిపోయామా అంటూ సోహైల్ అనడం విశేషం.
ఇక అటు అభిజిత్ నే సర్వస్వంగా హారిక భావించిందని అంతా అనుకున్నారు. కానీ వారిద్దరూ విడివిడిగా ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్లిపోవడం గమనార్హం. ఎందుకంటే బిగ్ బాస్ లో ప్రేమ పక్షుల్లా కనిపించిన వీరిద్దరూ ఇలా ఒంటరి పక్షుల్లా వెళ్లిపోవడం వెనుక ఏం జరిగి ఉంటుందా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇంతలో అభిజిత్ తాజాగా ఓ బాంబు పేల్చాడు. హారిక తనకు చెల్లితో సమానం అని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కూడా దిమ్మతిరిగి పడిపోయింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరూ హౌస్ నుంచి బయటకు రాగానే ఇలా బ్రేకప్ అవ్వడంతో ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. అటు హారిక కూడా జరిగింది ఏంటో చెప్పలేకపోతోంది. అయితే నిజం ఏంటనేది త్వరలోనే బయటకు వస్తుందని అభిక ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాల్సిందే...
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.