బిగ్ బాస్ నడుస్తున్నపుడు బయట చాలా మంది చాలా చెప్తుంటారు. వీడు తోపు.. వీడు కత్తి అంటారు. బయటికి వచ్చిన తర్వాత చూడు కుమ్మేస్తాడు అంటూ జాతకాలు కూడా చెప్తుంటారు. అప్పట్లో కౌశల్ గురించి ఇలాంటివి చాలా విన్నాం కూడా. ఏకంగా ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కట్టారు అంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కానీ అలాంటిదేం జరగలేదు. కౌశల్ బయటికి వచ్చాడు. తన పని తాను చేసుకుంటున్నాడు కానీ ఆయన కెరీర్‌కు బిగ్ బాస్ పెద్దగా హెల్ప్ అయింది అయితే లేదు. ఆయన కంటే ముందు శివ బాలాజీ పరిస్థితి కూడా అంతే. రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే పర్లేదనిపిస్తున్నాడు. అయితే బిగ్ బాస్ 4 పుణ్యమా అని ఎన్నడూ లేనంత.. ఏ కంటెస్టెంట్‌కు రానంత క్రేజ్ సంపాదించుకున్నాడు అభిజీత్. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత ఆడియన్స్ మరిచిపోయిన ఈ నటుడు బిగ్ బాస్ పుణ్యమా అని బయటికి వచ్చాడు. అయితే సీజన్ అయిపోయి 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు అభిజీత్. కనీసం చేస్తున్నాడనే టాక్స్ కూడా వినిపించలేదు. కానీ అప్పట్లో అభిజీత్ ఇంట్లో ఉన్నపుడు ఈయన జోరు చూస్తే సీజన్ అవ్వగానే నిర్మాతలు ఈయన కోసం అడ్వాన్సులు పట్టుకుని రెడీగా ఉంటారేమో అనేంతగా సీన్ క్రియేట్ చేసారు.. హంగామా సృష్టించాడు అభిమానులు. కానీ హౌజ్‌లో ఉన్నపుడు ఉన్న పరిస్థితులు బయటికి వచ్చిన తర్వాత కనిపించడం లేదు.
అదంతా ఇంటి లోపు వరకే అని అభిజీత్‌కు త్వరగానే అర్థం అయిపోయింది. అంత క్రేజ్ వచ్చినా కూడా ఒక్క ఛాన్స్ కూడా తీసుకురాలేకపోయింది ఈ గుర్తింపు. తాజాగా ఈయన బిగ్ బాస్ ఉత్సవంలో పాలు పంచుకోడానికి వచ్చాడు. స్టార్ మాలో వచ్చిన ఈ ఈవెంట్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇందులో తన సినిమా ముచ్చట్ల గురించి అభి చెప్తాడని తెలుస్తుంది. ఏదేమైనా కూడా బిగ్ బాస్ హౌజ్‌లో అంత నమ్మకంగా కనిపించిన ఈ కుర్రాడికి ఇప్పటి వరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. మరి అభిజీత్ కెరీర్ బిగ్ బాస్ ఇచ్చిన రూట్‌తో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Abijeet, Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood