Bigg Boss 4: బిగ్‌బాస్ సీజన్ 4లో ఈ సారి ఏయే మార్పులు ఉండబోతున్నాయంటే..

కరోనా మహామ్మారి  కారణంగా ఈ సారి తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని బిగ్‌బాస్ లవర్స్ కాస్తంత అనుమానాలు వ్యక్తం చేసారు. తాజాగా ఈ షోలో భారీ మార్పులకు బిగ్‌బాస్ నిర్వాహకులు శ్రీకారం చుట్టారు.

news18-telugu
Updated: August 8, 2020, 6:26 AM IST
Bigg Boss 4: బిగ్‌బాస్ సీజన్ 4లో ఈ సారి ఏయే మార్పులు ఉండబోతున్నాయంటే..
బిగ్ బాస్ తెలుగు 4 లోగో Photo : star maa
  • Share this:
కరోనా మహామ్మారి  కారణంగా ఈ సారి తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని బిగ్‌బాస్ లవర్స్ కాస్తంత అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. అంతేకాదు షోను హోస్ట్ చేసే నాగార్జున కూడా బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రోమోలో కూడా పాల్గొన్నాడు. నాగార్జున నటించిన ఈ ప్రోమో త్వరలో ప్రసారం కానుంది. ఆ సంగతి పక్కనపెడితే.. కోవిడ్ 19 కారణంగా బిగ్‌బాస్ సీజన్ 4 ఉండబోదన్నది ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో బిగ్ బాస్ షో షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున స్టార్ట్ చేసి.. 30 నుంచి రెగ్యులర్‌గా  ఈ షోను  ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు స్టార్ మా నిర్వాహకులు. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్‌కు కరోనా టెస్టులు నిర్వహించి తర్వాత పూర్తిగా ఆరోగ్యం ఉన్నారని డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత హౌస్‌లో పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సారి కంటెస్టెంట్స్‌కు ఆరోగ్య స్టార్ మా యాజమాన్యం స్పెషల్ కేర్ తీసుకోనున్నట్టు సమాచారం.

Bigg Boss Telugu 4 host,telugu hot anchors manjusha and vishnu priya,Bigg Boss Telugu 4 host megastar chiranjeevi,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss telugu,bigg boss,bigg boss telugu 3,bigg boss telugu season 3,bigg boss 3 telugu episode 4,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu episode 4 highlights,bigg boss 3 telugu latest promo,bigg boss season 3 telugu,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu live,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu contestants,telugu bigg boss 3,బిగ్ బాస్ నాల్గవ సీజన్,బిగ్ బాస్ నాల్గవ సీజన్ చిరంజీవి,nagarjuna,నాగార్జున
బిగ్ బాస్ లోగో Photo : Youtube


బిగ్‌బాస్ షూటింగ్ చేసే ప్రదేశంలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మంది సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ షో కోసం నాగార్జుకు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయనున్నారు. గతంలో లాగా 100 రోజులు కాకుండా.. ఈసారి 10 వారాల్లోనే ముగించాలనే నిర్ణయానికి స్టార్ మా వచ్చినట్టు సమాచారం.అంటే ఈసారి బిగ్‌బాస్ షో   70 రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంది.  ఒకప్పటిలా ఫిజికల్ యాక్టివిటీస్ లాంటివి ఉండే అవకాశాలు లేవు. ఒకరితో మరొకరు ఇంట్రాక్ట్ అయ్యేది కూడా లేదని సమాచారం. బిగ్‌బాస్ షో కోసం హౌస్‌లో ఉండే పార్టిసిపేంట్స్ సోషల్ డిస్టన్స్ మెయింటెన్ చేయాలనే రూల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒకప్పటిలా  షోలో ముద్దు ముచ్చట్లు ఉండే అవకాశాలు ఉండవు. ఇక ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్‌ని కూడా అల్రెడీ సెలక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హాట్ యాంకర్స్ విష్ణుప్రియ, మంజూషలు పాటు నందు, సింగర్ సునీత, వర్షిణి, వైవా హర్ష కొరియోగ్రాఫర్ రఘు, మంగ్లీ, నోయల్, ప్రియా వడ్లమాని పేర్లు కూడా వినబడుతున్నాయి.

బిగ్‌బాస్ 4 హోస్ట్ నాగార్జున (Courtesy/Star Maa)


తాజగా ఈ సీజన్ కోసం నాగార్జునకు  స్టార్ మా యాజమాన్యం భారీగానే ముట్ట జెప్పబోతున్నట్టు సమాచారం . మొత్తంగా ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 2.5 కోట్ల వరకు ఛార్జ్ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా 10 వారాలకు గాను.. మొత్తంగా రూ. 50 కోట్ల వరకు నాగార్జునకు పారితోషకం ఇవ్వనున్నట్టు సమాచారం. దాంతో పాటు మరో రూ. 10 కోట్లు డాక్టర్లు, ఇతర ఖర్చుల కోసం ఇవ్వనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 8, 2020, 6:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading