హోమ్ /వార్తలు /సినిమా /

Abhijeet Duddala: సినిమాలకు దూరంగా బిగ్ బాస్ విన్నర్ అభిజీత్.. తీవ్ర ఆరోగ్య సమస్యలతో?

Abhijeet Duddala: సినిమాలకు దూరంగా బిగ్ బాస్ విన్నర్ అభిజీత్.. తీవ్ర ఆరోగ్య సమస్యలతో?

Abhijeet Duddala

Abhijeet Duddala

Abhijeet Duddala: తెలుగు సినీ నటుడు అభిజిత్ గురించి అందరికి తెలిసిందే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత ఏ సినిమాలలో కూడా ఒక్క అవకాశం కూడా అందుకోలేదు.

Abhijeet Duddala: తెలుగు సినీ నటుడు అభిజిత్ గురించి అందరికి తెలిసిందే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత ఏ సినిమాలలో కూడా ఒక్క అవకాశం కూడా అందుకోలేదు. ఇక పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అభిజిత్ కు మరోసారి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో తనేంటో నిరూపించుకునే అవకాశం వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని తన క్యారెక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తను ఆడిన ఆటల గురించి, తోటి కంటెస్టెంట్ లతో ఉండే విధానం గురించి ప్రేక్షకులు ఆయనకు ఫుల్ కు ఫుల్ మార్కులు వేసి సీజన్ 4 కి టైటిల్ విన్నర్ గా గెలిపించారు. ఇక బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కెరీర్ మొత్తం మలుపు తిరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈయనతో పాటు మరి కొందరు కంటెస్టెంట్ లు తప్ప మిగిలిన వారంతా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్టులలో అవకాశము అందుకొని బిజీగా ఉంటున్నారు.

కానీ ఇప్పటికీ కూడా ఎటువంటి అవకాశాలు అందుకోలేడు అభిజిత్. గతంలో మాత్రం తాను మూడు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు.. త్వరలోనే షూటింగ్ లలో కూడా అడుగు పెడుతున్నట్లు ప్రకటించాడు. కానీ ఏం జరిగిందో ఏమో మళ్ళీ ఆ సినిమాల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. గతంలో ఈయన అభిమానులు తన సినిమా గురించి ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నలు కూడా వేయడంతో.. తన ఆరోగ్యం బాలేదని త్వరలోనే తన సినిమాల గురించి ప్రకటిస్తానని తెలిపాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ అభిమాని తన సినిమా గురించి ఏదైనా చెప్పాలి అని ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేసి ప్రశ్నించగా..వెంటనే స్పందించాడు అభిజిత్. ప్రస్తుతం తను ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను తెలిపాడు. అందుకే దాని పైనే ఫోకస్ పెట్టానని తెలిపాడు. లైవ్ లోకి కూడా వచ్చిన అభిజిత్ ను సినిమాల గురించి ప్రశ్నలు వేయగా.. ప్రస్తుతం తను తన ఆరోగ్యంకే ఇంపార్టెంట్ ఇస్తున్నాను అంటూ ప్రస్తుతం నో సినిమాలు అంటూ అభిమానులకు చేదు వార్త చెప్పాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత అభిజిత్ గురించి ఎవరికీ అంత తెలియదు. కానీ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాక మాత్రం ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాకుండా ఆయన సినిమాల కోసం ఎంతో ఆతృత చూపడంతో అభిజిత్ మాత్రం అభిమానులను నిరాశ పరుస్తున్నాడు.

First published:

Tags: Abhijeet duddala, Bigg Boss 4 Telugu, Health issues, Life is beautyfull, Star Maa

ఉత్తమ కథలు