Bigg Boss 4 Telugu Nagarjuna: ‌బిగ్‌బాస్‌కు నాగార్జున గుడ్ బై చెప్పినట్టే.. అందుకు సాక్ష్యం ఇదిగో..

Bigg Boss 4 Telugu Nagarjuna | నాగార్జున బిగ్‌బాస్‌కు తాత్కాలికంగా  గుడ్ బై చెప్పనున్నాడా అంటే నిన్న మొన్నటి వరకు ఇదంతా రూమరే అనుకున్నారు. తాజాగా నాగార్జున స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

news18-telugu
Updated: October 23, 2020, 5:49 PM IST
Bigg Boss 4 Telugu Nagarjuna: ‌బిగ్‌బాస్‌కు నాగార్జున గుడ్ బై చెప్పినట్టే.. అందుకు సాక్ష్యం ఇదిగో..
నాగార్జున (Twitter/Photo)
  • Share this:
Bigg Boss 4 Telugu Nagarjuna | నాగార్జున బిగ్‌బాస్‌కు తాత్కాలికంగా  గుడ్ బై చెప్పనున్నాడా అంటే నిన్న మొన్నటి వరకు ఇదంతా రూమరే అనుకున్నారు. తాజాగా నాగార్జున స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జున.. బిగ్‌బాస్‌ 4 తెలుగు షోకు హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటు.. ‘వైల్డ్ డాగ్’ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాలచ్ ప్రదేశ్‌లోని ‘రోహ్‌తంగ్ పాస్‌లో జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ట్వీట్ చేసి మరి తెలిపారు. రోహ్‌తంగ్ పాస్‌లో సముద్ర మట్టానికి 3980 మీటర్ల ఎత్తు అంటే దాదాపు 13000 అడుగుల ఎత్తులో  ఉంది. ఈ ప్రదేశం నవంబర్ నుంచి మే వరకు మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడే నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు 7 నెలల తర్వాత ఇంత అందమైన ప్రదేశంలో షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని నాగార్జున చెప్పుకొచ్చాడు. 21 రోజుల్లో ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్టు నాగార్జున తెలిపారు. అప్పటి వరకు అక్కడే షూటింగ్ కోసం ఉండనున్నట్టు తెలిపారు.


దీంతో నాగార్జున ఈ శని, ఆదివారాలతో పాటు మరో రెండు వారాలు బిగ్‌బాస్‌ షోకు రాలేనట్టు చెప్పాడు. ఇపుడా నాగార్జున ప్లేస్‌లో అక్కినేని పెద్ద కోడలు సమంత అక్కినేని.. బి‌గ్‌బాస్‌ షోను హోస్ట్ చేయనున్నట్టు స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి. మరి బిగ్‌బాస్ షో హోస్ట్‌గా సమంత ఏ లెవల్లో ఇరగదీస్తుందో చూడాలి. ఇక ‘వైల్డ్ డాగ్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో నాగార్జున.. NIA ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఉగ్రవాదం నేపథ్ంయలో యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగులో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 23, 2020, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading