Bigg Boss 4 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే.. వాళ్ళిద్దరే వీక్..

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 సీజన్ మెల్లగా పుంజుకుంటుంది. ఒక్కోరోజు ఒక్కో రకంగా టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ముఖ్యంగా మూడో వారం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారిపోయింది. పైగా ఇంట్లో కూడా ఒకరి మధ్య ఒకరికి బాగానే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 22, 2020, 5:11 PM IST
Bigg Boss 4 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే.. వాళ్ళిద్దరే వీక్..
బిగ్ బాస్ 4 నామినేషన్స్ (bigg boss 4 telugu nominations)
  • Share this:
బిగ్ బాస్ 4 సీజన్ మెల్లగా పుంజుకుంటుంది. ఒక్కోరోజు ఒక్కో రకంగా టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ముఖ్యంగా మూడో వారం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారిపోయింది. పైగా ఇంట్లో కూడా ఒకరి మధ్య ఒకరికి బాగానే పుల్లలు పెట్టాడు బిగ్ బాస్. దాంతో ఒకరంటే ఒకరు మండిపడుతున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కూడా ఒకరిపై ఒకరు చాలా సెటైర్లు వేసుకున్నారు. ముఖ్యంగా ఒకరిద్దర్నే టార్గెట్ చేసారు. ఇక ఈ వారం ఇంట్లోంచి ఎవరు బయటికి వస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారం కొత్త వాళ్లే ఎక్కువగా నామినేట్ అయ్యారు. ఇప్పటి వరకు నామినేషన్స్‌లోకి రాని అరియానా గ్లోరీ ఈ వారం తొలిసారి నామినేట్ అయింది.
బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory/Instagram)
అరియానా గ్లోరీ (Ariyana Glory/Instagram)


ఇక లాస్య, దేవి నాగవల్లి, మోనాల్ గజ్జర్, మెహబూబ్, కుమార్ సాయి, హారిక కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఇంట్లో కాస్త వీక్ కంటెస్టెంట్ అంటే కుమార్ సాయి మాత్రమే. పైగా ప్రతీ ఒక్కరూ అతన్నే టార్గెట్ చేసారు కూడా. బయట ప్రేక్షకుల్లో ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే లాస్య, దేవి నాగవల్లికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరూ ఈజీగా సేఫ్ అవుతారు. అందులో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. ఇక గ్లామర్ డోస్ పరంగా చూసుకుంటే మోనాల్ గజ్జర్, హారిక కూడా సేఫ్ అయిపోతారు.
దేత్తడి హారిక(Dethadi Harika)
దేత్తడి హారిక(Dethadi Harika)

మిగిలింది ముగ్గురే.. వాళ్లే మెహబూబ్, కుమార్ సాయి, అరియానా గ్లోరీ. మళ్లీ ఈ ముగ్గురిలో కూడా అరియానా గేమ్ కాస్త భిన్నంగా ఉంది. ఆమె తనకు తానుగా ఏదో క్రియేట్ చేసుకోవాలని చూస్తుంది.. ఇంట్లో అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంటుంది. దాంతో ఈమెకు కూడా ఈ వారం ఆడియన్స్ అవకాశం ఇచ్చేలాగే కనిపిస్తున్నారు. ఇక మిగిలింది ఇద్దరే.. వాళ్లే మెహబూబ్, కుమార్ సాయి. మొదటి వారం బాగా డల్‌గా కనిపించిన మెహబూబ్.. రెండో వారం నుంచి బాగానే ఓపెన్ అయిపోయాడు.
కుమార్ సాయి పంపాన (kumar sai pampana)
కుమార్ సాయి పంపాన (kumar sai pampana)

ఇక రెండో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి మాత్రం ఇప్పటి వరకు అలాగే కనిపిస్తున్నాడు. ఈయన నుంచి ఇంట్లో ఎలాంటి ఫన్ కూడా జనరేట్ కావడం లేదు. దాంతో ఈ వారం బయటికి వచ్చేది అతడే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. పైగా రెండో వారం తను సేవ్ అయితే తానే నమ్మలేకపోయాడు కుమార్. అంతగా తనపై తాను నమ్మకం లేకుండా ఉన్నాడు ఈయన. మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా మూడో వారం మెహబూబ్ లేదంటే కుమార్ సాయి బయటికి వచ్చేలా కనిపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 22, 2020, 5:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading