• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU WEEKEND EPISODE SPECIAL AND NAGARJUNA SUPER CLASS TO ABIJEET PK

Bigg Boss 4 Telugu: మిగిలిన వాళ్లకు ఆత్మాభిమానం లేదా.. అభిజీత్‌కి నాగార్జున క్లాస్..

Bigg Boss 4 Telugu: మిగిలిన వాళ్లకు ఆత్మాభిమానం లేదా.. అభిజీత్‌కి నాగార్జున క్లాస్..

నాగార్జున అభిజీత్ (Bigg Boss 4 Telugu Nagarjuna Abijeet)

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగులో మరో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. వచ్చీ రావడంతోనే నాగార్జున అందరికీ బాగానే క్లాస్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఈ సారి అభిజీత్ బుక్ అయిపోయాడు. ఆయన మాట్లాడిన కొన్ని మాటలను బాగానే గుర్తు..

  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో మరో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. వచ్చీ రావడంతోనే నాగార్జున అందరికీ బాగానే క్లాస్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఈ సారి అభిజీత్ బుక్ అయిపోయాడు. ఆయన మాట్లాడిన కొన్ని మాటలను బాగానే గుర్తు పెట్టుకుని క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. ఈ వారం నామినేట్ అయిన ఇంటి సభ్యులు తమను తాము సేవ్ చేసుకోడానికి బిగ్ బాస్ ఓ అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా ఓ స్టాండ్ దగ్గర నిలబడి అలాగే ఉండిపోవాలి. వాళ్లను డిస్టర్బ్ చేసి అక్కడ్నుంచి బయటికి జరిగేలా చేయాలి మిగిలిన కంటెస్టెంట్స్. అక్కడ డిస్టర్బ్ చేయడానికి గుడ్లు, గడ్డి, ఐస్ ముక్కలు, నీళ్లు, మట్టి ఇలా చాలానే పెట్టాడు బిగ్ బాస్. వాటన్నింటినీ వాడుకుంటూ బయటికి పంపించేలా చేయాలి. అందులో ఓ స్టేజీలో శృతి మించిపోయింది కూడా. దాంతో అభిజీత్ తనకు తానుగా రేస్ నుంచి తప్పుకున్నాడు. స్టాండ్ దగ్గర్నుంచి బయటికి వచ్చేసాడు. తనకు ఆత్మాభిమానం ఉందని.. సెల్ఫ్ రెస్పెక్ట్ పోయేలా అక్కడ ఏ పని చేయలేను అంటూ సీరియస్ అయ్యాడు అభిజీత్.
bigg boss 4 telugu,bigg boss 4 telugu abijeet,bigg boss 4 telugu abijeet nagarjuna,bigg boss 4 telugu abijeet nagarjuna class,bigg boss 4 telugu abijeet nagarjuna weekend episode,bigg boss 4 telugu latest promo,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు నాగార్జున,బిగ్ బాస్ 4 తెలుగు నాగార్జున అభిజీత్
నాగార్జున అభిజీత్ (Bigg Boss 4 Telugu Nagarjuna Abijeet)

తాను వచ్చేటప్పుడే అది చెప్పి వచ్చానని.. కానీ ఇక్కడ లైన్ క్రాస్ చేస్తున్నారంటూ కామెంట్ చేసాడు. వాటిని వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున గుర్తు చేసాడు. అభి మొన్న నువ్వు టాస్క్ ఆడేటప్పుడు ఓ మాటన్నావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని.. అంటే ఇంట్లో మిగిలిన వాళ్లకు ఆత్మాభిమానం లేదా అంటూ ప్రశ్నించాడు. దాంతో అభిజీత్ కూడా తన వర్షన్ చెప్పుకున్నాడు. అక్కడ అందర్నీ ఉద్దేశించి ఈ మాట అన్నానని చెప్పాడు.

కానీ అభి చేసింది కరెక్ట్ అని ఎంతమంది ఫీల్ అవుతున్నారని నాగార్జున అడిగితే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. దాంతో అభి అలా ఒంటరి అయిపోయాడు. టాస్కులో అలా మధ్యలోంచి వెళ్లిపోవడమే తప్పు అంటే.. మళ్లీ దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ టాపిక్ తీసుకురావడం మరింత తప్పు అంటున్నాడు నాగార్జున. మొత్తానికి ఈ వారం వీకెండ్ ప్రోమోలో నాగార్జున, అభిజీత్ మధ్య మంచి మాటల యుద్ధమే నడిచినట్లు అర్థమవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: