Bigg Boss 4 Telugu: బిగ్ బాస్‌లో నచ్చిన కంటెస్టెంట్‌కు ఓట్స్ ఎలా వేయాలో తెలుసా..?

Bigg Boss 4 Telugu Voting process: బిగ్ బాస్ తెలుగు అనే రియాలిటీ షో మన ఆడియన్స్‌కు నచ్చేసింది. తొలి సీజన్‌తోనే దాన్ని నిరూపించారు. అందుకే వరసగా నాలుగో సీజన్ కూడా వచ్చేసింది. నాలుగో సీజన్ కూడా స్టడీ రేటింగ్స్‌తో ముందుకు వెళ్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 30, 2020, 10:53 PM IST
Bigg Boss 4 Telugu: బిగ్ బాస్‌లో నచ్చిన కంటెస్టెంట్‌కు ఓట్స్ ఎలా వేయాలో తెలుసా..?
బిగ్ బాస్ లోగో (bigg boss 4 telugu/Twitter)
  • Share this:
బిగ్ బాస్ తెలుగు అనే రియాలిటీ షో మన ఆడియన్స్‌కు నచ్చేసింది. తొలి సీజన్‌తోనే దాన్ని నిరూపించారు. అందుకే వరసగా నాలుగో సీజన్ కూడా వచ్చేసింది. నాలుగో సీజన్ కూడా స్టడీ రేటింగ్స్‌తో ముందుకు వెళ్తుంది. ఇదిలా ఉంటే ఈ షోలో ప్రతీవారం నామినేషన్ ప్రక్రియ ఉంటుంది.. ఎలిమినేషన్ కూడా ఉంటుంది. వాళ్లు బయటికి రాకుండా చేసే అధికారం మాత్రం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్‌ను కాపాడే బాధ్యతను ఆడియన్స్ తీసుకుంటారు. తమకు నచ్చిన వాళ్లకు ఓట్లు వేసి కాపాడేస్తుంటారు. అయితే అది ఎలా చేయాలి.. నచ్చిన కంటెస్టెంట్‌ను ఎలా సేవ్ చేయాలి అనే విషయంలో మాత్రం చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందనేది కూడా చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల కోసమే ఈ కథనం.

బిగ్ బాస్ లోగో (bigg boss 4 telugu/Twitter)
బిగ్ బాస్ లోగో (bigg boss 4 telugu/Twitter)


బిగ్ బాస్ సీజన్ 1, 2లకు 'గూగుల్‌ ఓటింగ్‌ సిస్టమ్‌' ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో వచ్చిన ఓట్ల ద్వారా ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టేవాళ్లు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చేసారు. సీజన్ 3లో ఎలిమినేషన్‌‌కి చేపట్టే ఓటింగ్‌ ప్రక్రియను మార్చేశారు. ఇప్పుడు అదే విధానాన్ని సీజన్ 4కి కూడా కొనసాగిస్తున్నారు. అందులో ఒకటి హాట్ స్టార్ ఓటింగ్ అయితే.. మరోటి మిస్డ్ కాల్ ఓటింగ్. ఈ రెండు పద్దతులతోనే కంటెస్టెంట్స్‌నే సేవ్ చేయొచ్చు.. లేదంటే ఎలిమినేట్ చేయొచ్చు.

బిగ్‌బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
బిగ్‌బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)


ముందుగా హాట్ స్టార్ ఓటింగ్ ఎలా చేయాలంటే..
ప్లే స్టోర్‌లోకి వెళ్లి హాట్ స్టార్‌ యాడ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.. ఆ తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందులో కొన్ని భాషలు అడుగుతుంది.. అందులో మన భాష తెలుగు కాబట్టి అదే సెలెక్ట్ చేసుకోవాలి. హాట్ స్టార్ ఓపెన్ కాగానే అందులో ప్రసారం అయ్యే షోలతో పాటు సినిమాలు కూడా కనిపిస్తుంటాయి. మీరు ఆల్రెడీ సబ్క్రైబ్ చేసుకుని ఉంటే లైవ్ వస్తుంది.. అలాగే ఏ రోజు ఎపిసోడ్ అప్పుడే ప్లే అవుతుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కింద గ్రీన్ కలర్‌‌తో VOTE అని రాసి ఉంటుంది. VOTEని క్లిక్ చేయగానే.. లాగిన్ అయి ఉంటారు కాబట్టి ఆ వారం నామినేషన్స్ లిస్ట్ కనిపిస్తుంది. వాళ్ల ఫోటోల కింద వోట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం రోజుకు 10 ఓట్లు వేసుకోవచ్చు. అన్నీ ఒకరికే వేసుకోవచ్చు లేదంటే 10 ఓట్లను విడగొట్టి ఎవరికి ఎన్ని పంచినా పర్లేదు. మీ ఓట్లు పూర్తి కాగానే కింద DONE అనే బటన్ వస్తుంది. క్లిక్ చేస్తే సరిపోతుంది.

హాట్ స్టార్‌లో బిగ్ బాస్ ఓటింగ్ పద్దతి (Bigg Boss 4 Telugu)
హాట్ స్టార్‌లో బిగ్ బాస్ ఓటింగ్ పద్దతి (Bigg Boss 4 Telugu)
హాట్ స్టార్‌లో లాగిన్ కావడానికి కూడా ఓ ప్రక్రియ ఉంటుంది. లాగిన్ బటన్ నొక్కిన తర్వాత కంటిన్యూ చేయాలి.. ఒక వేళ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే.. సంబంధిత నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మీ వ్యక్తిగత వివరాలు పొందు పరచాలి. అప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు సబ్క్రిప్షన్ లిస్టులో ఉంటే ఇవేం లేకుండా నేరుగా ఓట్ చేయొచ్చు. ఓటిపి ప్రాసెస్ కేవలం కొత్త యూజర్స్‌కు మాత్రమే.

బిగ్‌బాస్ 4 ప్రోమోలో నాగార్జున (twitter/StarMaa)
బిగ్‌బాస్ 4 ప్రోమోలో నాగార్జున (twitter/StarMaa)


హాట్ స్టార్ తర్వాత నేరుగా సంబంధిత కంటెస్టెంట్ ఫోన్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో ఓట్ చేయొచ్చు. ఉదాహరణకు ఈ వారం లాస్య నామినేషన్స్‌లో ఉంది. Bigg Boss Voting Number Lasya - 8886658203కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. అలా ప్రతీ ఒక్కరికి ఒక్కో నెంబర్ ఉంటుంది. రోజులో ఒక్కో నెంబర్ నుండి 50 వరకూ ఓట్లు వేయొచ్చు. ఈ ఓట్లను సర్దుబాటు చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఏడుగురు నామినేషన్స్‌లో ఉంటే 50 ఓట్లను మీకు నచ్చినట్లుగా పంచుకోవచ్చు. ప్రతీ ఒక్కరి సంబంధిత ఫోన్ నెంబర్‌కు చేసి మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం రాత్రి 12 గంటలతో ముగుస్తుంది. శనివారం, ఆదివారం ఉండదు.
Published by: Praveen Kumar Vadla
First published: September 30, 2020, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading