• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU UNEXPECTED TWIST WILL JABARDASTH AVINASH GOING TO ELIMINATED PK

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. అవినాష్ ఎలిమినేట్ అవుతున్నాడా..?

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. అవినాష్ ఎలిమినేట్ అవుతున్నాడా..?

బిగ్ బాస్ 4 అమ్మ రాజశేఖర్ అవినాష్ (avinash amma rajasekhar)

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ అంటేనే ఊహకందని ఆట. అక్కడ ఎప్పుడు ఎవర్ని ఎలా ట్రీట్ చేస్తారో ఎవరికీ అర్థం కాదు. ప్రతీవారం గడుస్తుంటే ఎవర్ని పంపిస్తున్నారు.. ఎవరు ఉంటున్నారు అనేది కూడా అంతుచిక్కడం లేదు.

  • Share this:
బిగ్ బాస్ అంటేనే ఊహకందని ఆట. అక్కడ ఎప్పుడు ఎవర్ని ఎలా ట్రీట్ చేస్తారో ఎవరికీ అర్థం కాదు. ప్రతీవారం గడుస్తుంటే ఎవర్ని పంపిస్తున్నారు.. ఎవరు ఉంటున్నారు అనేది కూడా అంతుచిక్కడం లేదు. అప్పట్లో దేవి నాగవల్లి.. ఆ తర్వాత కుమార్ సాయి ఎలిమినేట్ అయినపుడు ఆడియన్స్ ఇలాగే షాక్ అయ్యారు. దివి విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఈ వారం కూడా ఊహించని ట్విస్టు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్స్ నుంచి మోనాల్, అభిజీత్, హారిక సేవ్ అయ్యారు. మిగిలిన ఇద్దరు అవినాష్, అమ్మ రాజశేఖర్.. ఈ ఇద్దరూ డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసుకున్నా.. బయట ఉన్న క్రేజ్ పరంగా చూసుకున్నా కూడా ఈ వారం అవినాష్ సేవ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ అంటేనే ఊహించని ఆట కదా.. అందుకే ఇప్పుడు కూడా ఇదే జరగబోతుందని తెలుస్తుంది. అమ్మ రాజశేఖర్, అవినాష్‌ను ఓ రూమ్‌లోకి పంపించాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ 4 నాగార్జున అమ్మ రాజశేఖర్ అవినాష్ (avinash amma rajasekhar)


దాని ముందు రెండు బల్బులు ఉంచాడు. రెడ్ అండ్ గ్రీన్.. ఉన్న వాళ్లకు గ్రీన్.. పోయేవాళ్లకు రెడ్ అన్నమాట. అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే మరో షాక్ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోలో అమ్మ, అవినాష్ ఇద్దర్నీ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు చూపించాడు. అయితే ఆ రూమ్‌లో ఒకరు బయటికి వెళ్తారు.. ఒకరు అక్కడే ఉంటారని చెప్పాడు నాగార్జున. కానీ హౌజ్ మేట్స్ వెళ్లి చూసేసరికి అక్కడ అవినాష్, అమ్మ ఇద్దరూ రూమ్‌లో కనిపించలేదు. అదేంటి అంటే ఏమో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అంటూ హింటిచ్చాడు నాగార్జున.

బిగ్ బాస్ 4 అమ్మ రాజశేఖర్ అవినాష్ (avinash amma rajasekhar)


దాంతో అరియానా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఎందుకంటే అమ్మ, అవినాష్‌తో అరియానాకు చాలా ఎమోషనల్ బాండ్ ఉంది. అలాంటిది ఇద్దర్నీ ఒకేసారి పంపిస్తారనేది మాత్రం దాదాపు అసాధ్యం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న ప్రచారం ప్రకారం చూస్తే మాత్రం కచ్చితంగా అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతున్నాడు. కానీ ఇప్పుడు అవినాష్ కూడా బయటికి వెళ్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

అదెలా సాధ్యం.. అంత క్రేజీ ప్లేయర్‌ను ఎలా బయటికి పంపిస్తారబ్బా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకవేళ అవినాష్ ఎలిమినేట్ అయినా కూడా సీక్రేట్‌ రూమ్‌లోనే ఉంటాడు కానీ బయటికి మాత్రం వెళ్లడంటున్నారు. మొత్తానికి చూడాలిక.. ఈ వారం ట్విస్ట్ ఎలా ఉంటుందో..? ఎందుకంటే గత వారమే అమ్మ రాజశేఖర్‌ను ఎలిమినేట్ చేసి నోయల్ కథ చెప్పి ఇంట్లోనే ఉంచేసారు. మరి ఈ వారమైనా మార్పులు ఉంటాయో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: