Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 22, 2020, 5:17 PM IST
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
బిగ్ బాస్ మరో వీకెండ్ వచ్చేసింది. వచ్చీ రావడంతోనే ఫుల్ ఫన్ తీసుకొస్తుంది. నాగార్జున కూడా ఓ కంటెస్టెంట్‌ను ఇంటికి పంపే రోజు అందర్నీ నవ్వించే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలోనే సన్ డే కాస్తా ఫన్ డే అయిపోయింది. ఇప్పటికే గత ఎపిసోడ్లో అఖిల్, అభిజీత్ మధ్య యుద్ధానికి తెరలేపిన నాగార్జున.. ఈ వారం మాత్రం అలాంటిదేం లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఉన్న వాళ్లను హాయిగా నవ్వించి.. చివరికి ఎలిమినేషన్ చేయబోతున్నాడు మన్మథుడు. ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలైన కొత్త ప్రోమో చూస్తుంటే సన్ డే ఎపిసోడ్ ఎంత ఫన్‌గా ఉండబోతుందో అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా అవినాష్‌తో ఆడుకున్నాడు నాగార్జున. ఫన్నీ స్టంట్స్ చేయించాడు జబర్దస్త్ కమెడియన్‌తో. రిలీజ్ అయిన ప్రోమోలో మొత్తం అవినాష్ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగిలిన వాళ్లు కూడా వాళ్లను పూర్తిగా డామినేట్ చేసాడు ఈయన. పాటలు పాడాడు.. డాన్సులు చేసాడు.. చివరికి చీర కూడా కట్టుకున్నాడు అవినాష్.
అంతేకాదు ఓ ప్రశ్నకు అందరికంటే ముందు సమాధానం చెప్పాడు.. కానీ అది తప్పు కావడంతో ఛీ నీ మొహం అంటూ నాగార్జున సరదాగా చివాట్లు పెట్టాడు. దానికి అవినాష్ కూడా అంతే సరదాగా నవ్వుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ చాలా టఫ్ అయ్యేలా కనిపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా లాస్యను ఇంటికి పంపిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రోమో చూస్తుంటే అలాంటిదే కనిపిస్తుంది కూడా. మోనాల్ చివరి నిమిషంలో సేవ్ అవ్వడంతో లాస్య ఇంటి ముఖం పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 22, 2020, 5:17 PM IST