• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU TV 9 DEVI NAGAVALLI SKIPPED GRAND FINALE EPISODE EVEN AFTER INVITATION PK

TV 9 Devi Nagavalli: బిగ్ బాస్ అయితే నాకేంటి.. ఫినాలేను పట్టించుకోని దేవి నాగవల్లి..

TV 9 Devi Nagavalli: బిగ్ బాస్ అయితే నాకేంటి.. ఫినాలేను పట్టించుకోని దేవి నాగవల్లి..

దేవి నాగవల్లి (devi nagavalli)

TV 9 Devi Nagavalli: ఈ సారి బిగ్ బాస్ 4 సీజన్‌లో రెబల్ కంటెస్టెంట్స్ కొందరు ఉన్నారు. వాళ్లకు నచ్చింది చేస్తారు.. అక్కడ బిగ్ బాస్ ఉన్నా ఎవరున్నా మనసుకు నచ్చితే చేస్తారు లేదంటే అలాగే మొండిగా ముందుకెళ్తారు.

  • Share this:
ఈ సారి బిగ్ బాస్ 4 సీజన్‌లో రెబల్ కంటెస్టెంట్స్ కొందరు ఉన్నారు. వాళ్లకు నచ్చింది చేస్తారు.. అక్కడ బిగ్ బాస్ ఉన్నా ఎవరున్నా మనసుకు నచ్చితే చేస్తారు లేదంటే అలాగే మొండిగా ముందుకెళ్తారు. కాంప్రమైజ్ అనే మాట వాళ్ల బుర్రలో కనిపించలేదు. అలాంటి కంటెస్టెంట్స్‌లో టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి కూడా ఉంది. ఈ సారి ఈమె బిగ్ బాస్ హౌజ్‌కు వస్తుందని తెలియగానే అంతా ఆసక్తిగా చూసారు. ఎలా ఉంటుందా అని ఎదురు చూసారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మూడో వారమే ఈమె ఎలిమినేట్ కావడం చాలా మంది జీర్ణించుకోలేదు. కేవలం బిగ్ బాస్‌ను ప్రశ్నిస్తుందని.. అప్పుడెప్పుడో ఓ సారి అంతా నిలబడి సారీ చెప్తే దేవి మాత్రం అలాగే కూర్చుండిపోయిందనే కొన్ని కారణాలతో ఈమెను కావాలనే బలవంతంగా ఇంటి నుంచి బయటికి గెంటేసారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఓట్ల విషయంలో కుమార్ సాయి కంటే ఈమెకు చాలా ఎక్కువగానే వచ్చినా కూడా కావాలనే ఈమెను ఎలిమినేట్ చేసారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై దేవి కూడా తప్పు బట్టింది. ఇంట్లో ఉన్నపుడు బయట పరిస్థితులు తనకు తెలియదు కానీ బయటికి వచ్చిన తర్వాత మాత్రం మీరు ఎలిమినేట్ కావడం ఏంటి మేడమ్.. మేమంతా మీకే ఓట్లేసాం అని చెప్తుంటే ఎక్కడో తేడా జరిగిందనే విషయం తనకు కూడా అర్థమైందని చెప్పింది దేవి.
Bigg Boss Telugu 4 Grand Finale,Pranita subash, Mehreen, Laxmi Raai, anil ravipudi, naga chaitanya, sai pallavi, chiranjeevi, nagarjuna, BBTelugu grand finale, bigg boss telugu 4, bigg boss telugu 4 final, bigg boss abijeeth, bigg boss harika, bigg boss akhil, bigg boss ariyana, bigg boss sohel, tollywood, nagarjuna, బిగ్ బాస్ తెలుగు 4, బిగ్ బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే, నాగార్జు, అభిజీత్, బిగ్ బాస్ హారిక, బిగ్ బాస్ అరియానా, బిగ్ బాస్ అఖిల్, బిగ్ బాస్ అరియానా
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu/Youtube)

అంతే కాదు బిగ్ బాస్‌పై కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేసింది. ఇదిలా ఉంటే ఎన్ని జరిగినా కూడా బిగ్ బాస్ ఫినాలేకు మాత్రం అంతా కలిసి ఉంటారు.. వస్తారు కూడా. ప్రతీ సీజన్‌లో కూడా ఇదే జరుగుతుంది. ఈ సారి కోవిడ్ టైమ్‌లో కూడా అందర్నీ పిలిచారు. గంగవ్వ నుంచి తొలివారమే ఎలిమినేట్ అయిపోయి మాయం అయిపోయిన సూర్య కిరణ్ కూడా ఫైనల్‌లో కనిపించాడు. కానీ దేవి నాగవల్లి మాత్రం అక్కడ కనిపించలేదు.. ప్రోమోలో కూడా లేదు. అయితే బయట మాత్రం తన సపోర్ట్ అరియానాకే అని చెప్పుకొచ్చింది దేవి. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో కూడా ఆమె కోసం ప్రచారం చేసింది.

బిగ్ బాస్ పిలిచినా కూడా ఆహ్వానం కూడా పట్టించుకోలేదని.. అన్యాయంగా తనను బయటికి గెంటేసిన షోకు రావాల్సిన అవసరం కూడా లేదని దేవి లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతమంది వచ్చినా కూడా దేవి అందుకే రాలేదని ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్‌లోనే ఉన్నా కూడా రాకపోవడానికి కారణం కూడా ఇదే అంటున్నారు ఆమె అభిమానులు కూడా. తనను పట్టించుకోనపుడు బిగ్ బాస్ అయితే ఏంటి.. ఎవరైతే నాకేంటి అనే ధోరణిలోనే దేవి కూడా ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఇదే చేసి చూపించింది దేవి నాగవల్లి.
Published by:Praveen Kumar Vadla
First published: