HOME » NEWS » movies » BIGG BOSS 4 TELUGU THOSE TWO ARE REAL VILLIANS IN HOUSE SAYS ABIJEET MOTHER PK

Bigg Boss 4 Telugu: హౌజ్‌లో అసలు విలన్స్ వాళ్లే.. అభిజీత్‌కు నెగిటివిటీ.. అతడి తల్లి కామెంట్స్..

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగులో అభిజీత్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఈయనే విన్నర్ అవుతాడని ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 25, 2020, 10:50 PM IST
Bigg Boss 4 Telugu: హౌజ్‌లో అసలు విలన్స్ వాళ్లే.. అభిజీత్‌కు నెగిటివిటీ.. అతడి తల్లి కామెంట్స్..
అభిజీత్ (Abijeet/Twitter)
  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో అభిజీత్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఈయనే విన్నర్ అవుతాడని ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు ఈయన తల్లికి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగిపోయింది. మొన్నామధ్య హౌజ్‌కు వచ్చి వెళ్లిన తర్వాత అభిజీత్ తల్లి ఇప్పుడు బయట పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం అభి జర్నీకి సంబంధించి ఈమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో హారిక తల్లి కూడా ఉన్నారు. ఈ ఇద్దర్నీ యాంకర్ రవి ఇంటర్వ్యూ చేసాడు. అందులో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అభిజీత్ తల్లి. ముఖ్యంగా అతడి పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది.
bigg boss 4 telugu,bigg boss 4 telugu abijeet,bigg boss 4 telugu abijeet mother,bigg boss 4 telugu abijeet mother anchor ravi,bigg boss 4 telugu abijeet interview,అభిజీత్ తల్లి ఇంటర్వ్యూ,అభిజీత్ బిగ్ బాస్ 4 తెలుగు,తెలుగు సినిమా
అభిజీత్ తల్లి లక్ష్మి (Abijeet mother Lakshmi)


సిక్స్ ప్యాక్ కోసం అభిజిత్ చాలా కష్టపడ్డాడని.. అభితో పాటు తాము కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. వాడి కోసం ఉప్పు లేని తిండి మూడు నెలల పాటు తిన్నామని చెప్పుకొచ్చింది ఈమె. చికెన్ వండినా ఏది వండినా ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా వండాల్సి వచ్చేదని తెలిపింది. ఇప్పటికీ అదే ఫుడ్ అలవాటు చేస్తున్నాడు అభిజీత్ అంటుంది ఆయన తల్లి. ఇక గేమ్ గురించి మాట్లాడుతూ సోహెల్, అరియానా సీక్రెట్ రూమ్ నుంచి ఇంట్లోకి వచ్చినపుడు అభి అరిచాడని.. అప్పుడు అతడిని చూస్తే భయమేసిందని చెప్పింది ఈమె.
bigg boss 4 telugu,bigg boss 4 telugu abijeet,bigg boss 4 telugu abijeet mother,bigg boss 4 telugu abijeet mother anchor ravi,bigg boss 4 telugu abijeet interview,అభిజీత్ తల్లి ఇంటర్వ్యూ,అభిజీత్ బిగ్ బాస్ 4 తెలుగు,తెలుగు సినిమా
అభిజీత్ నాగార్జున మోనాల్ తల్లి (Abijeet Nagarjuna Monal)

ఎక్కడ రెండు రోజులకే బయట అభిపై నెగెటివిటీ వస్తుందేమో అని టెన్షన్ పడ్డామని చెప్పింది అభి తల్లి. కానీ తర్వాత అసలు విషయం తెలిసింది. చాలా సేపు ఓపిక పట్టిన తర్వాతే అలా అరిచాడని తెలిసిన తర్వాత ఊరటనిచ్చిందని అభి తల్లి లక్ష్మీ తెలిపింది. మరోవైపు బిగ్ బాస్ షోలో విలన్స్ అమ్మ రాజశేఖర్, అఖిల్ అనిపిస్తుందని.. ఎందుకంటే ఎదుటి వాళ్లను మనం ఒక మాట అంటే.. వాళ్లు అంటున్నపుడు తిరిగి తీసుకోవాలని చెప్పింది. కానీ ఆ ఓపిక వాళ్లలో లేదని చెప్పింది లక్ష్మీ.
bigg boss 4 telugu,bigg boss 4 telugu abijeet,bigg boss 4 telugu abijeet mother,bigg boss 4 telugu abijeet mother anchor ravi,bigg boss 4 telugu abijeet interview,అభిజీత్ తల్లి ఇంటర్వ్యూ,అభిజీత్ బిగ్ బాస్ 4 తెలుగు,తెలుగు సినిమా
అభిజీత్, అఖిల్ (Abijeet Akhil)

అభిజిత్ మొదటి నుంచి అమ్మ రాజశేఖర్‌కు అదే చెప్పుకుంటూ వచ్చాడని.. తన విషయంలో విలన్ అంటే అమ్మ రాజశేఖర్ అని చెప్పింది. మరోవైపు మూడో వారం అప్పుడు జరిగిన రోబో టాస్కులో కూడా అభిజీత్ ఐడియా అద్భుతం అని.. కానీ అప్పుడు అందరూ అతన్ని తప్పు పట్టినా కూడా గంగవ్వ సపోర్ట్ చేసిందని గుర్తు చేసుకుంది. ఏదేమైనా కూడా అభిజీత్ విన్నర్ అయితే బాగుంటుందని ఆమె ఆశించారు.
Published by: Praveen Kumar Vadla
First published: November 25, 2020, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading