news18-telugu
Updated: November 12, 2020, 7:56 PM IST
నాగార్జున (Star Maa/Nagarjuna)
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌లో ఈ వారం ఊహించని బిగ్ ట్విస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బిగ్‌బాస్ 9 వారాలు కంప్లీట్ చేసుకుంది. ఇపుడు 10వ వారం నడుస్తోంది. గత వారం మాత్రం హౌస్ లీడర్‌గా ఉన్న అమ్మ రాజశేఖర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ 4 తెలుగు మొదలైన తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోలిస్తే అమ్మ రాజశేఖర్ మాత్రం కొన్ని వారాల నుంచి కాస్త వెనకాలే ఉన్నాడు. ఇంట్లో అఖిల్, అభిజీత్, సోహెల్ లాంటి కుర్రాళ్ల మధ్య ఈయన పోటీ తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు నేను ఇది అంటూ చెప్పుకోడానికి ఒక్కటి కూడా చేయలేదు అమ్మ. ఆ మద్య ఒక్కసారి నామినేషన్ నుంచి సేవ్ కావడానికి అరగుండు కొట్టించుకోవడం తప్ప. పైగా దివి వెళ్లిపోయిన తర్వాత అమ్మ రాజశేఖర్ ఆట మరింత దారుణంగా మారిపోయింది. ఈయన కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. నోయల్ వెళ్తూ వెళ్తూ చేసిన కామెంట్స్ మనసులో పెట్టుకుని రచ్చ రచ్చ చేసాడు అమ్మ రాజశేఖర్. ఆ సంగతి పక్కన పెడితే.. గతంలో లాగా ఎక్కువ మంది సెలబ్రిటీలు ఈ షోలో గెస్టులుగా రావడం తగ్గిపోయింది.

సమంత బిగ్ బాస్ (Samantha Bigg Boss host)
కరోనా కారణంగా బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పెద్దగా హడావుడి లేదు. కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ లేవు. పైగా షూటింగ్స్ కూడా లేవు కూడా. దానికి తోడు సినిమాల విడుదల ఆగిపోయింది. సినిమా రిలీజ్లు వుంటే ప్రమోషన్ కోసం బిగ్‌బాస్‌కు వచ్చేవారు. అయితే.. దసరా సందర్భంగా నాగార్జున ప్లేస్‌లో సమంత బిగ్‌బాస్ హోస్ట్‌గా సందడి చేసింది. ఆ సమయంలో నాగార్జున.. ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లాడు. సమంత హోస్ట్ చేసే సమయంలో అఖిల్‌తో పాటు హైపర్ ఆదితో పాటు కొంత మంది వచ్చిన సందడి చేసారు. గత వారం సుమ స్పెషల్ గెస్ట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ వీకెండ్లో దీపావళి కానుకగా నాగ చైతన్య తన లవ్ స్టోరీ ప్రమోషన్లో భాగంగా హౌస్‌లో సందడి చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ వారం మొత్తం నాగ చైతన్య తన తండ్రి స్థానంలో హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా బిగ్‌బాస్‌లో నాగార్జున ఫ్యామిలీ సందడి చేయనున్నదన్న మాట.

నాగ చైతన్య (Twitter/Photo)
రీసెంట్గా నాగార్జున, చిరంజీవి కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా చిరంజీవికి కరోనా సోకడంతో.. నాగార్జున కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఫలితం నెగిటివ్ వచ్చినా.. ఓ 10 రోజులు హోం క్వారంటైన్లో ఉన్నట్టు సమాచారం. అందుకే ఇపుడు తన ప్లేస్‌లో నాగ చైతన్యను హోస్ట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించబోతున్నట్టు సమాచారం. మరి చైతూ ఒక్కడే హౌస్‌లో సందడి చేస్తారా లేకపోతే.. నాగ్ కూడా నెగిటివ్ రావడంతో హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 12, 2020, 7:56 PM IST