Bigg Boss 4 Telugu: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇతనే..

Bigg Boss 4 Telugu | తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో బిగ్‌బాస్ షో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో నిన్నటితో  13 వారాలు పూర్తి చేసుకొని 14వ వారంలో అడుగుపెట్టింది. ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ...

news18-telugu
Updated: December 6, 2020, 7:16 AM IST
Bigg Boss 4 Telugu: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇతనే..
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
  • Share this:
Bigg Boss 4 Telugu | తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో బిగ్‌బాస్ షో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో నిన్నటితో  13 వారాలు పూర్తి చేసుకొని 14వ వారంలో అడుగుపెట్టింది. అంటే బిగ్‌బాస్ స్టార్ట్ అయి అపుడే 91 రోజులు పూర్తి చేసుకుటుంది.  మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ షోకు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే మూడు సీజన్స్‌లో మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే విజేతలుగా నిలిచారు. కాబట్టి.. ఈ సారి బిగ్‌బాస్ 4 విజేతగా ఫీమేల్ కంటెస్టెంట్‌కు వచ్చే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. 12వ వారం ఎలిమినేషన్ లేకుండానే ప్రోగ్రామ్‌ను ఎండ్ చేసారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి అవినాష్ హౌస్‌లో సేఫ్ అయిపోయాడు. అప్పటి వరకు బాగానే ఉన్నా నామినేషన్స్ సమయంలో మాత్రం ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం అక్కడ కామన్ సీన్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ సీజన్‌లో ఫైనల్‌కు వెళ్లిన తొలి కంటెస్టెంట్‌గా అఖిల్ రికార్డులకు ఎక్కాడు.

ఈ వారం నామినేషన్స్‌లో హారిక, మోనాల్, అవినాష్, అభిజీత్, అఖిల్ ఉన్నారు. వాళ్లలో అఖిల్ సార్థక్ సేవ్ అయ్యాడు. దాంతో సీజన్ 4లో ఫైనల్ చేరిన తొలి కంటెస్టెంట్ అయ్యాడు అఖిల్. ఇదే విషయం నాగార్జున కూడా చెప్పాడు. సీజన్ 4లో ఫైనల్ చేరడంతో ఇప్పుడు అఖిల్‌కు పోటీగా ఎవరొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఇంకా అవినాష్, అభిజీత్, హారిక, మోనాల్ నామినేషన్స్‌లో ఉన్నారు.ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి జబర్ధస్త్ అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. గతవారం ఎలిమినేషన్ నుండి ఎవిక్షన్ ఫ్రీ  పాస్ నుండి తప్పించుకున్న ఇపుడు మాత్రం ఆ పప్పులు ఉడికేలా కనబడటం లేదు. ఈ సారి బిగ్‌బాస్ హౌస్ నుండి అవినాష్ బయటకు వెళ్లడం పక్కా అని చెబుతున్నారు.

jabardasth avinash,bullet bhaskar not support jabardasth avinash,nagababu not supporting jabardasth avinash,jabardasth avinash bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash nomination,bigg boss 4 telugu avinash nomination this week,jabardasth comedians support to avinash,vote for avinash bigg boss 4 telugu,bigg boss 4 telugu latest promo,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు అవినాష్,అవినాష్ కారణంగా జబర్దస్త్‌లో గొడవలు,అవినాష్‌కు సపోర్ట్ చేయని బుల్లెట్ భాస్కర్,నామినేషన్స్‌లోకి వచ్చిన జబర్దస్త్ అవినాష్
జబర్దస్త్ అవినాష్ (avinash bigg boss)


మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలేకు రెడీ అవుతోంది.  బిగ్‌బాస్ 3 లాగే ఈసారి కూడా బిగ్ ‌బాస్ గ్రాండ్ ఫినాలేను స్టార్ మా నిర్వాహకులు భారీగానే ప్లాన్ చేసారు. బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి సహా పలువురు ముఖ్య అతిథిలుగా విచ్చేసారు. కానీ ఫైనల్ విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు చిరంజీవి బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున చేతులు మీదుగా ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీ అందించారు. ఈ సారి కూడా బిగ్‌బాస్‌ను అదే లెవల్లో ప్లాన్‌లో చేసినట్టు సమాచారం.

mahesh babu twitter,mahesh babu new look,mahesh babu new hairstyle,mahesh babu latest news,mahesh babu new look goes viral,sarkaru vaari paata mahesh babu look,mahesh babu new look for sarkaru vaari paata,mahesh babu sarkaru vaari paata new look,mahesh babu family,mahesh new look,మహేష్ బాబు న్యూ లుక్,మహేష్ బాబు కొత్త లుక్ ఫోటోలు
బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే ముఖ్య అతిథిగా మహేష్ బాబు (mahesh babu/Bigg Boss 4 Telugu)


ఈ సందర్భంగా బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలేకు మరింత గ్రాండ్‌గా ఉండాలనే ప్లాన్‌లో ఈసారి మహేష్  బాబును ఈ ఫినాలేకు ముఖ్య అతిథిగా పిలవాలనే నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే స్టార్ మా నిర్వాహకులతో పాటు నాగార్జున కూడా మహేష్ బాబును సంప్రదిస్తే.. దానికి పండుగాడు బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా రావడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలబడే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 6, 2020, 7:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading