Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి.

Bigg Boss 4 Telugu | తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ మూడో వారం పూర్తి చేసుకుంది. ఒకవైపు ఐపీఎల్, మరోవైపు జబర్ధస్త్ వంటి షోలతో పోటీని తట్టుకుంటూ బిగ్‌బాస్ పూటకో సర్ఫ్రైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా..దేవి నాగవల్లి ఎలిమినేట్ అయింది.

news18-telugu
Updated: September 28, 2020, 11:12 AM IST
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి.
బిగ్‌బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన దేవి నాగవల్లి (StarMaa/Photo)
  • Share this:
బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్: తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ మూడో వారం పూర్తి చేసుకుంది. ఒకవైపు ఐపీఎల్, మరోవైపు జబర్ధస్త్ వంటి షోలతో పోటీని తట్టుకుంటూ బిగ్‌బాస్ పూటకో సర్ఫ్రైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ షోలో మొదటి వారం దర్శకుడు సూర్య కిరణ్, రెండో వారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు. సూర్యకిరణ్ అందరినీ తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూడటంతో అందరికీ శత్రువు అయ్యాడు.అలా హౌస్ నుండి వెళ్లగొట్టబడ్డాడు. మరోవైపు గత వారం  రెండు ఎలిమినేషన్లు ఉంటాయంటూ హడావుడి చేసినా...చివరకు దేత్తడి హారికను ఫేక్ ఎలిమినేషన్‌తో సరిపెట్టారు. ఇప్పుడిక మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న అంశం ఆసక్తిరేపింది.  అటు కుమార్ సాయి, అవినాష్ ఇప్పటికే హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా...శుక్రవారం హౌస్‌లోకి ప్రవేశించిని స్వాతి దీక్షిత్ తన అందచందాలతో అలరిస్తోంది.తాజాగా ఈ వారం హౌస్ నుంచి ప్రముఖ యాంకర్ దేవి నాగవల్లి హౌస్ నుండి బిగ్‌బాస్ ఎలిమినేట్ చేసాడు.

బిగ్‌బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
బిగ్‌బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)


రాను రాను  బిగ్ బాస్ 4 సీజన్ మెల్లగా పుంజుకుంటుంది. ఒక్కోరోజు ఒక్కో రకంగా టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ముఖ్యంగా మూడో వారం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారిపోయింది. పైగా ఇంట్లో కూడా ఒకరి మధ్య ఒకరికి బాగానే పుల్లలు పెట్టాడు బిగ్ బాస్. దాంతో ఒకరంటే ఒకరు మండిపడుతున్నారు. ఓ రకంలో అందరి నిజస్వరూపాలను టాస్క్‌లు బయటపడేలా చేస్తున్నాయి.  ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కూడా ఒకరిపై ఒకరు చాలా సెటైర్లు వేసుకున్నారు. గత వారంలానే ఈ సారి కూడా కుమార్ సాయి అందరికీ సేఫ్ టార్గెట్ అయ్యాడు.  ఈ వారం హౌస్‌లో లాస్య, మోనల్ గజ్జర్ సేఫ్ అంటూ బిగ్‌బాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.బిగ్‌బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు నామినేషన్‌లో మిగిలారు. అందులో కుమార్ సాయి, దేవి, హారిక, మెహబూబ్, అరియానా గ్లోరి ఉన్నారు. ఈ సారి  మాత్రం అందరు అనుకున్నట్టే.. దేవి నాగవల్లి హౌస్ నుండి ఎలిమినేట్ అయింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 27, 2020, 10:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading