Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో టాప్- 5‌ కంటెస్టెంట్స్ వీరే.. టైటిల్ విన్నర్ అతడే.. ఇది ఫిక్స్..

Bigg Boss 4 Telugu Top 5 Contestants: ప్రస్తుతం ఇంటి కెప్టెన్‌గా కమెడియన్ ముక్కు అవినాష్ హౌస్ లో కొనసాగుతున్నాడు. ఎనిమిదోవారానికి హౌస్ లో 11మంది కంటెస్టెంట్లు మిగిలారు. అయితే వీరిలో టాప్ ఫైవ్‌లో ఎవరుంటారు.. ఈ సారి టైటిల్‌ను గెలిచేదేవరో చూాద్దాం..

news18-telugu
Updated: October 28, 2020, 4:25 PM IST
Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో టాప్- 5‌ కంటెస్టెంట్స్ వీరే.. టైటిల్ విన్నర్ అతడే.. ఇది ఫిక్స్..
బిగ్ బాస్ లోగో Photo: Twitter
  • Share this:
Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఈ సారి కొంత లేటుగా ప్రారంభమైంది. లేటుగా ప్రారంభమవ్వడమే కాదు.. మొదటి రెండు వారాలు పెద్దగా ఆకట్టుకోలేదు కూడా. కారణం అన్ని కొత్త ముఖాలు ఉండటమే. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కుమార్ సాయి కానీ, ఆ తర్వాత జబర్దస్త్ కమెడీయన్ అవినాష్ షోను కొంత రసవత్తరంగా మార్చారు. క్రేజీ కంటెస్టెంట్‌గా వచ్చిన గంగవ్వ ఆరోగ్యం సరిగా లేక ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌజ్ నుండి ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. అందులో భాగంగా మొదటి వారం సూర్య కిరణ్ ఎలిమినేట్ అవ్వగా.. రెండవ వారం కరాటే కళ్యాణీ ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత మూడవ వారం దేవి నాగవల్లీ, నాల్గవ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతీ దీక్షిత్, ఐదవ వారం జోర్దార్ సూజత ఎలిమినేట్ అవ్వగా.. గంగవ్వ ఆరోగ్యం సరిగా లేక స్వయంగా ఇంటి నుండి బయటకు వచ్చింది. ఇక ఆరవ వారంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కుమార్ సాయి అవ్వగా.. ఏడవ వారం దివి వాడ్త్యా ఇంటి నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఎనిమిదవ వారం నడుస్తోంది. తాజాగా యాభైరోజుల జర్నీ పూర్తి చేసుకుంది. ఆరువారాలు హోస్ట్ గా కింగ్ నాగార్జున అలరించారు. ఇక ఏడోవారం వీకెండ్ దసరా స్పెషల్ గా నాగార్జున పెద్దకోడలు అక్కినేని సమంత హోస్ట్ గా వ్యవహరించి కంటెసెంట్లను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఇంటి కెప్టెన్‌గా కమెడియన్ ముక్కు అవినాష్ హౌస్ లో కొనసాగుతున్నాడు. ఎనిమిదోవారానికి హౌస్ లో 11మంది కంటెస్టెంట్లు మిగిలారు. ఈ వారం నామినేషన్‌లో ఆరుగురు ఉన్నారు. కాగా ఆరుగురిలో చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు ఉన్నా రు. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు పేర్లు గమనిస్తే అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, లాస్య ఉన్నారు. ఇక ప్రతి వారం నామినేట్ అయ్యే అభిజీత్ ఈసారి మాత్రం నామినేషన్‌లో లేకపోవడం విశేషం. సోహెల్ కూడా ఈ వారం నామినేట్ కాలేదు. అరియానా, అఖిల్, లాస్య బలంగా ఉన్నారు. దీంతో వీరు బయటకు వెళ్లే అవకాశం తక్కువ. మిగతా ముగ్గురు నీ గమనిస్తే అమ్మ రాజశేఖర్, మోనాల్, మెహబూబ్. ఈ ముగ్గురికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉన్నట్లు సమాచారం. దీంతో రాబోయే వారం లో ఈ ముగ్గురిలో ఒకరు గ్యారెంటీ అవుట్ అనే డిస్కషన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతున్నాయి. ఈ ముగ్గురిలో అమ్మా రాజశేఖర్ ఈ వారం ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు నెటిజన్స్. ఇక చివరి వరకు ఉండే కంటెస్టెంట్లు ఎవరు అన్నది ఇప్పటికే ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. అమ్మాయిల్లో హారిక, అరియానా, లాస్య బలమైన కంటెస్టెంట్లుగా ఉన్నారు. అబ్బాయిల్లో అభిజిత్, అఖిల్, సోహైల్, నోయల్ పోటాపోటీ పడుతున్నారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే.. మైండ్ గేమ్ ఆడుతూ స్లో అండ్ స్టడీగా ఉంటూ నాగార్జున ఒకవైపు కాప్లిమెంట్స్‌తో మరోవైపు కామెంట్స్ ను ఒకేలా తీసుకుంటూ చాలా సేఫ్ గా గేమ్ ఆడుతున్నాడు అభిజిత్. మొదట్లో మోనాల్ వెంట పడినా ఆ తర్వాత తన గేమ్‌ను సరైన పద్దతిలో ఆడుతూ హౌజ్‌లో టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా ఉన్నాడు. అభిజిత్ నటించిన పెళ్ళిగోల వెబ్ సిరిస్ కుర్రకారును అలరించింది. బిగ్ బాస్ సీజన్ 4లో మొదటివారం నుంచి దాదాపు ప్రతివారం నామినేషన్స్ లోకి వస్తున్నాడు. అయినా ఫాల్లోవర్స్ సేవ్ చేస్తున్నారు.

bigg boss 4 telugu,bigg boss 4 telugu nominations,bigg boss 4 telugu amma rajasekhar danger zone,bigg boss 4 telugu mehboob danger zone,bigg boss 4 telugu akhil lasya ariyana safe,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ డేంజర్ జోన్,బిగ్ బాస్ 4 తెలుగు అమ్మ రాజశేఖర్
బిగ్ బాస్ 4 తెలుగు 8వ వారం నామినేషన్స్ (bigg boss 4 telugu)


ఇక అఖిల్ విషయానికి వస్తే..  ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ మొదటివారంలోనే కంటతడి పెట్టి సున్నిత మనష్కుడు అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు బిగ్ హౌస్ లో గంగవ్వ ప్రియమైన మనుమడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆ తర్వాత మోనాల్ తో చనువుగా ఉంటూ లవర్ బాయ్ అయ్యాడు. అంతేకాదు గత రెండువారాలుగా మోనాల్ ఎలిమినేషన్ ను అఖిల్ ప్రేమ మాత్రమే కాపాడుతోందంట అతిశయోక్తికాదు. నెటిజన్స్ అంచనా ప్రకారం అఖిల్ టాప్‌ టూలో ఉన్నాడు. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ హౌజ్‌లో అల్లరి చేసే సోహైల్ మూడో స్థానంలో ఉంటాడని అంటున్నారు. కథ వేరుంటది అంటూ మొదటి రెండు మూడు వారాలు మెడనరాలు పొంగేలా ఆవేశపడిపోయిన సోహైల్ బిగ్ బాస్ అర్జున్ రెడ్డి అనేవారు. అయితే ఆ తర్వాత నాగార్జున వార్నింగ్‌లతో చాలా కూల్ అయిపోయాడు. నాలుగైదు వారాల్లో బిగ్ హౌస్ నుంచి ఇంటిదారి పడతాడు అనిపించినా సోహైల్.. ఆ తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు.

Bigg Boss Telugu 4, bigg boss news, bigg boss telugu news, bigg boss telugu updates, bigg boss sohel, avinash on sohel, Bigg Boss Telugu, అవినాష్, సోహెల్, బిగ్ బాస్ తెలుగు 4
సోహెల్ Photo : Instagram


అవినాష్ విషయానికి వస్తే.. ఇతడు కూడా హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో బలంగా ఉన్నవారిలో ఒకడిగా ఉన్నాడు. జబర్దస్త్ షో ద్వారా కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్న అవినాష్.. కూడా టాప్ ఫోర్‌లో ఒకడని అంటున్నారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే పదిమంది లేడీ కంటెస్టెంట్లలో ఆరుగురు బయటకు రాగా ప్రస్తుతం నలుగురు హౌస్ లో ఉన్నారు. వీరిలో మోనాల్, లాస్య ఇంటిదారి పడతారని చివరి వరకు అరియానా, హారిక హౌస్ లో కొనసాగుతారని నెటిజన్ల అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ సారి టైటిల్ విన్నర్ అభిజీత్ లేదా సోహైల్ అంటున్నారు చూాడాలి మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయో..
Published by: Suresh Rachamalla
First published: October 28, 2020, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading