Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ టైమింగ్స్ మారాయ్ గుర్తుందిగా.. రాత్రి 10 గంటలకు..

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ ఎప్పుడొస్తుందిరా అని చిన్న పిల్లాడిని అడిగినా కూడా రాత్రి 9 గంటల 30 నిమిషాలకు అని చెప్తాడు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ అయిపోయింది ఈ షో. రేటింగ్స్ ఎలా వచ్చినా కూడా చూసే వాళ్లు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 7, 2020, 5:06 PM IST
Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ టైమింగ్స్ మారాయ్ గుర్తుందిగా.. రాత్రి 10 గంటలకు..
బిగ్ బాస్ 4 తెలుగు టైమింగ్స్‌లో మార్పులు
  • Share this:
బిగ్ బాస్ ఎప్పుడొస్తుందిరా అని చిన్న పిల్లాడిని అడిగినా కూడా రాత్రి 9 గంటల 30 నిమిషాలకు అని చెప్తాడు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ అయిపోయింది ఈ షో. రేటింగ్స్ ఎలా వచ్చినా కూడా చూసే వాళ్లు మాత్రం రోజూ చూస్తూనే ఉంటారు బిగ్ బాస్. దీనికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీకెండ్ వచ్చిందంటే టిఆర్పీ కూడా దుమ్ము లేచిపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ టైమింగ్స్‌లో మార్పులు మొదలయ్యాయి. మరో 14 రోజుల్లో పూర్తయ్యే షోకు ఇప్పట్నుంచే మరమ్మత్తులు మొదలు పెట్టారు స్టార్ మా యాజమాన్యం. అయిపోయిన తర్వాత కొత్తవి వెతుక్కునే కంటే కూడా.. ముందు నుంచే బిగ్ బాస్ స్థానంలో ఏది రీ ప్లేస్ చేయాలో సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇకపై బిగ్ బాస్ రాత్రి 9.30 నిమిషాలకు కాకుండా మరో అరగంట ఆలస్యంగా వస్తుంది. డిసెంబర్ 7 నుంచి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ ప్రసారం కానుంది. బిగ్ బాస్ వచ్చే సమయంలో వదినమ్మ సీరియల్ రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతున్న వదినమ్మ కాస్తా 9:30 నిమిషాలకు షిఫ్ట్ అయింది.

vadinamma serial,bigg boss 4 telugu,bigg boss 4 telugu timings changed,bigg boss 4 telugu timing changed,bigg boss 4 telugu timings changed from december 7,bigg boss 4 timings changed,bigg boss 4 telugu new timings,timings changed in bigg boss,bigg boss 4 telugu review,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు టైమింగ్స్‌లో మార్పు
బిగ్‌బాస్ షో ప్రారంభం (Twitter/Photo)


వదినమ్మ వచ్చే 7 గంటలకు ఇప్పుడు గుప్పెడంత మనసు అనే కొత్త సీరియల్ మొదలు కానుంది. డిసెంబర్ 7 నుంచి ఈ మార్పులు చేర్పులు మొదలు కానున్నాయి. ఇప్పటికే స్టార్ మాలో అందరితోనూ ఈ ప్రమోషన్ చేయిస్తున్నారు నిర్వాహకులు. మరో రెండు వారాలు మాత్రమే షో ఉండటంతో ఇప్పట్నుంచే మార్పులు మొదలు పెట్టింది సదరు ఛానెల్. ఇప్పటికే జనాల్లోకి షో వెళ్లిపోయింది కాబట్టి ఇప్పుడు టైమింగ్స్ మార్చినా కూడా వచ్చే ప్రమాదం ఏం లేదని నమ్ముతున్నారు నిర్వాహకులు. వీకెండ్స్ మాత్రం టైమ్ మార్చలేదు. ఎప్పట్లాగే రాత్రి 9 గంటల నుంచి 10:30 నిమిషల వరకు రానుంది బిగ్ బాస్ 4 తెలుగు.
Published by: Praveen Kumar Vadla
First published: December 7, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading